ప్రశ్న అవసరం.... సమాజ సేవకు డబ్బు అవసరమా అని ప్రశ్న ... డబ్బు మనిషి కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతుంది .. అది ఒక సపోర్ట్ ... వుద్యోగం స్త్రీ తన భాద్యతలను మరింత సంతృప్తి కరంగా పూర్తి చేయడానికి దోహద పడుతుంది మా ఇంటికి అద్దెకు ఇల్లు కావాలి అని ఒకామె వచ్చారు .. తనని తాను పరిచయం చేసుకుంటూ ఒక సమాజ సేవకురాలిగా చెప్పుకున్నారు ..నేను చాలా చాలా సంతోషం ఫీల్ అయ్యాను ... అంతలో తనతో వచ్చిన హేల్పర్ " అవునమ్మా , మాకు ఏది అవసరం వున్నా అమ్మగారి దగ్గరకు పరుగెడతాము ... మాకు ఇళ్ళు కాలిపోయినప్పుడు కూడా ఏంతో సహాయం చేసారు.. నెల నెలా సమయానికి వడ్డీ కట్టేస్తే చాలు అసలు నెమ్మది మీద ఇవ్వవచ్చు . తొందర పెట్టరు---- " అని ఆమె గురించి గొప్పగా చెప్పింది ... నాకు నుండి నీరు కారిపోయినట్లు ఐపోయింది .. ఇప్పటికీ మరచిపోలేను అ మాటలు .. సమాజ సేవ అంటే వడ్డీ వ్యాపారమా ??????? పేరుకు పేరు , ఆదాయానికి ఆదాయం ........ పేద ప్రజలు నూతిలో ...
పోస్ట్‌లు
ఇది ఇంతే లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది
యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా....
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వ్రాసినవారు
రుక్మిణిదేవి
-
"యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా" .. . స్త్రీ ఎక్కడ గౌరవింపబడుతుందో, అక్కడ దేవతలు నివాసం వుంటారు అని పురాణాలు , పెద్దలు పదే పదే చెప్తూనే వుంటారు . ఢిల్లీ ఒక్కటే కాదు, దేశం అంతటా స్త్రీ నిరాదరణకి గురి అవుతూనే వుంది ... ఎన్నో వుదాహరణలు .. అందరికీ తెలిసిన విషయమే . అయినా పరిస్థితి మారలెదు. ఎందరు గగ్గోలు పెట్టినా జరిగేది జరగక ఆగడం లేదు .. రెమిడీ ఏమిటో ఆలోచించే తీరిక ఎవరికీ లేదు ... కొందరి వల్ల మాత్రమే సాధ్యం కానిది .. మార్పు కావాలి . మారాలి మారాలి అనుకోవడం లోనే జీవితం గడిచిపోతుంది ..కాని , హృదయ భారం మాత్రం మిగిలిపోతుంది .. ఇంతటి వుపోద్గాతం ఎందుకు అనుకుంటున్నారా .. ? ఒకరోజు రాత్రి ఒంటి గంటకి ట్రైన్ దిగి నేను ,మావారు స్టేషన్ బయటకి వచ్చాము . పేవ్మెంట్స్ మీద కొందరు నిరాశ్రయులు అక్కడక్కడా పడుకుని వున్నారు .. drainage మాన్ హోల్స్ కూడా వున్నాయి పైన ఎటువంటి కవర్స్ లేకుండా .. ఇవి మనకి ఆశ్చర్యకరమయిన విషయాలు కాదు. . ఈ పడుకుని వున్న వారిలో ఒక చివరగా ఆడవారు కూడా వున్నారు .. ఎటువంటి క్షేమకరమైన పరిస్థితి కనబడలేదు.. సరి ఐన ఆచ్చా...
నేనింతే.......
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వ్రాసినవారు
రుక్మిణిదేవి
-
ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా ప్రతిక్షణం ఆనందంగా వుంటాను.. ఎలా సాధ్యమైంది అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను..మూడు కారణాలు తెలిసాయి. మొదటి కారణం........ నిరంతరం బాబా నామస్మరణ .. రెండవ కారణం... అందరిలోని మంచితనాన్ని మాత్రమే చూడగల్గడం...మూడవది...మధురమైన ఘటనలు మాత్రమే స్మృతికి తెచ్చుకోవడం.... దీనికి మావారు నాకిచ్చిన బిరుదు...... ."నువ్వసలు మనిషివైతేగా".. నవ్వేసాను హాయిగా..
ఎందరో రచయత(త్రు)లు..అందరికీ నా అభివందనాలు. ముందుగా కదంబమాల అనే సిరీస్ ని మొదలు పెట్టిన జ్ఞానప్రసూన గారికి నా నమస్కారాలు.. ఈ ఒరవడిలో నేనూ వున్నాను అని చేసిన నా యీ చిన్నిప్రయత్నాన్ని మీ ముందు ఉంచుతున్నందుకు ఆనందిస్తున్నాను..
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వ్రాసినవారు
రుక్మిణిదేవి
-
ఈ ప్రయత్నం సఫలం కావాలంటే మీరు సుభద్ర గారు వ్రాసిన కథ చదివి రావాలి మరి... కదంబమాల___ "అమ్మా, అనితా... అనితా" అన్న నారాయణమ్మ గారి కేకలకి పరుగున వెళ్ళిన సరోజిని అక్కడి దృశ్యం చూసి నిశ్చేష్టురాలై నిలబడిపోయింది కొన్ని క్షణాలు.. వెంటనే తేరుకుని వంటింట్లోకి పరుగెత్తి గ్లాసుతో నీళ్ళు తీసుకుని వచ్చి అనిత మొహం పైన చిలకరించింది. కొన్ని క్షణాల తర్వాత తేరుకున్న అనితని "ఏమయిందిరా" అని అడిగిన శ్రీరాం గారిని చూసి బోరున ఏడ్చేసింది.. "అయ్యో,అయ్యో..నేనప్పుడే చెప్పాను.. పిల్ల అర్బకురాలు. ఈ మాయదారి చదువులు వద్దు అని. విన్నారా ఎవరైనా. ఇప్పుడు చూడండి ఎలా ఏడుస్తుందో". అని నారాయణమ్మ గారు గోల చెయ్యడం మొదలుపెట్టారు. అబ్బా.. నువ్వుండవే.. నన్ను మాట్లాడనీ.. విషయం కనుక్కోనీ" అని చిన్నగా నారాయణమ్మ గారిని మందలించి, "అనితా! ఇలా చూడమ్మా. ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు సమాజంలో ఒక బాగం ఐపోయాయి. న్యూక్లియర్ కుటుంబ వ్యవస్థను ఒకందుకు ప్రోత్సహిస్తే,అది ఈనాటి సమాజాన్ని పెడత్రోవ పట్టిస్తుంది. అలా అని అన్ని కుటుంబాలూ అలానే వున్నాయి అని కాదు నా ఉద్దేశ్యం. చరిత్రను, సమాజాన్ని...
ఈ కాలం మగపిల్లలు
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వ్రాసినవారు
రుక్మిణిదేవి
-
మా చెల్లెలు కాంపిటీటివ్ ఎక్జామ్ వ్రాయడానికి ఎక్జామ్ సెంటర్ కి తీసుకు వెళ్ళాము.. ఎక్జామ్ ఐపోయిన తర్వాత పిల్లలందరూ బయటకు వస్తున్నారు.. మా ముందునుండి ఒక మగపిల్లల గుంపు వెళుతుంది.. వారి సంభాషణ విని ఆహా అని ఎంతో ఆశ్చర్యపోయాము.. మరచిపోలేక పోతున్నాము ఆ మాటలు..వారిలో వారు ఇలా మాట్లాడుకుంటూ నడుస్తున్నారు.. "ఏరా, ఎక్జామ్ ఎలా వ్రాశావు?" "ఏదో లేరా. అసలు ప్రిపేర్ ఐతే కద..మనకొస్తుందని ఏం గారంటి లేదు. ఐనా మనం ఇంత కష్టపడడం అవసరం అంటావా? ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే పోలా.. ఇంట్లో ఉండి హాయిగా మనకి నచ్చినట్లు వండుకుని తినవచ్చు..." ఔరా..ఔరౌరా.....కద.............
ఈ కాలం పిల్లలు కేవలం ఒక భర్తగా లేక ఒక భార్యగా వుండాలని అనుకోవడం లేదు. మరి ఏం కోరుకుంటున్నారు??
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వ్రాసినవారు
రుక్మిణిదేవి
-
మనకి మనం సంప్రదాయాలు విదించుకున్నాము . . . మన సంస్కృతి దేశ విదేశాలకి తెలియజేశాము..ఇతరులు మన దేశవిలువలను అనుసరిస్తున్న సమయానికి మనం వింతపోకడలు పోతున్నాము. ఇంతవరకూ అందరూ ఆమోదించే విషయమే... ఐతే ఇంకా ఏదో తెలియనిది తెలియజేస్తున్నారు మన పిల్లలు.. ఇదివరకు టెక్నాలజీ అభివృద్ది లోనికి రాని సమయంలో ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్న సమయంలొ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఇంట్లో ఒక్కరు సంపాదిస్తే పదిమంది కూర్చుని తినే స్థితిలో సహజంగానే పెద్దవారు అంటే వయసు పైబడిన వారు తమ శక్తి సామర్ధ్యాలు తగ్గిన తరువాత పిల్లల సేవలపై ఆధార పడి ఉండేవారన్నది అందరికీ విధితమే...ఉద్యోగరీత్యా కానివ్వండి లేదా అన్నదమ్ముల కుటుంబాలలో ఒకరికొకరికి సరిపడక కానివ్వండి లేదా పిల్లల భవిష్యత్ దృష్ట్యా, ఒక ఊరినుండి ఇంకో ఊరికి బదిలీ వెళ్ళే సమయంలో పెద్దలు తాము పుట్టి పెరిగిన ఊరిని విడిచి వెళ్ళలేక ఆక్కడే ఉండిపోవడం వల్ల(ఈనాడు ముందు జాగ్రత్తగా పిల్లల పెళ్ళిళ్ళు చేసిన వెంటనే వారిని విడిగా ఉంచి వారికంటూ ఒక కుటుంబం ఏర్పాటు చేస్తున్నారు పెద్దలు) చిన్న చిన్న కుటుంబాలు ఏర్పడడం జరిగింది...ఒక కుటుంబం అంటే అమ్మ,నాన్న, ఒకరు లేక ఇద్దరు పిల్లలు..అమ్మనా...
నేనెలా వుండాలనుకుంటానంటే..............
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వ్రాసినవారు
రుక్మిణిదేవి
-
పడిలేచే కెరటం లా చల్లగా,మెల్లగా వీచే చిరుగాలిలా ప్రకృతి సందడిలా వాన చినుకులా ముత్యపు బిందువులా విద్యుత్తరంగంలా పదహారేళ్ళ ప్రాయంలా సుమధుర గానంలా గలగల పారే సెలయేరులా గాలికి కదిలే ఆకులా చిరుమువ్వల సందడిలా పసిపాప నవ్వులా అమ్మ ఒడిలా నాన్న లాలనలా... నేను "నేను" లా....................................... ఒక "మనీషి" లా................. చాలా సార్లు మా స్నేహితురాలు "నేనెలా వుండాలి?", "ఎలా ఉంటే బాగుంటుందీ" అని ప్రశ్నల వర్షం కురిపిస్తూ వుంటే "మీరు మీరు లా ఉంటే చాలు" అని సమాధానం ఇచ్చాను.. ఆ తర్వాత నా మదిలో కదిలినవి ఇదిగో. ఇలా వ్రాయడం జరిగింది....
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరూ ??????
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వ్రాసినవారు
రుక్మిణిదేవి
-
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరూ ??????బైక్ మీద మా హజ్బెండ్ వెనకాల ఆరామ్ గా కూర్చుని ప్రయాణిస్తున్న నేను సడన్ గా ఉలిక్కిపడ్డాను.. మా బండి ఉన్న స్థలానికి ఎక్కడో ఆమడ దూరం అన్నట్లు సిగ్నల్స్..ఎన్నెన్నో రకరకాల వెహికల్స్ మధ్యలో..అందులోనూ దీపావళి సందడి ఏమో త్వరత్వరగా ఇంటికి చేరాలని చుట్టుప్రక్కల ఏమి జరుగుతుందో గమనించాలన్న ధ్యాస కూడా లేనంతగా ఆత్రుతతో వున్నారు...సడన్ గా నా మనసులో ఒక భయం..ఏదో జరగబోతుంది అన్న భయం..నెమ్మదిగా అన్ని వెహికల్స్ కదలడం మొదలుపెట్టాయి...మా హజ్బెండ్ కూడా ఏమీ తీసిపోరు...ఏవేవో చిన్న చిన్న సందులు దొరికినా బండి లాగించేద్దామని చూస్తారు.వెనక నుండి హెచ్చరిస్తూనే వుంటాను..వింటేగా...నా డ్రైవింగ్ నే సంశయిస్తావా అన్నట్లు ఒక చూపు నా వైపు విసురుతారు..సిగ్నల్స్ దాటుతూ టర్న్ తీసుకొనేలోగా మా ముందు స్పీడ్ గా టర్న్ తీసుకున్న బండి స్కిడ్ అయి, బండి ఈ మూలకు..మనుషులు ఎటో విసిరేస్తున్నట్లుఒకరు డివైడర్ ని గుద్దుకున్నట్లుగా,మరొకరు బండిక్రింద కాలు ఇరుక్కుపోయి... అయ్యో, అంటూ హృదయం ద్రవించిపోయింది.. బిత్తరపోయినట్లు ఐపోయింది..కొన్ని క్షణాల్లో అంతా ఐపోయింది..ఇప్పుడే కదా దీపావళి సందడితో పెద్దగ...
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వ్రాసినవారు
రుక్మిణిదేవి
-
ఒక్కోసారి పరిస్థితులు మన చేయిదాటిపోతున్నాయి అని అన్పించినప్పుడు, ఏదో అసహాయత మనలో కనబడుతుంటుంది...అలాంటప్పుడు మనలో ఎన్నో ప్రశ్నలు ఇది ఇలా వుంటేనే బాగుంటుందా, ఇలా చేస్తేనే బాగుంటుందా అని.. అవి పిచ్చి ప్రశ్నలు అని నేను అనుకోను.. అలాంటివాటిలో ఇదొకటి.. .మా మామయ్యా గారి అమ్మాయిని రీసెంట్ gaa తన retirement డబ్బు ఆంతా పెట్టి కట్నం,అత్తా, ఆడపడుచు laanchanaalalo చాలా గ్రాండ్ గా చేసారు.....ఎందుకంటే అబ్బాయి తరపువారు చాలా గొప్ప background మరి...పేరు గొప్ప, వూరు....ఈ సామెతలు ఎలా వస్తాయో ఇప్పుడు అర్ధం అవుతుంది..........అమ్మాయిని అబ్బాయి పట్టించుకోడు.తిన్నావా, లేవా అడగడు....తెల్లవారేవరకూ ఇంటికి చేరడు..కొన్ని రోజులు ఇంటిమోహమే చూడడు..ఇంట్లో అత్తా మామల సతాయింపు...కూరలో ఉప్పెక్కువైందని.. అదని,ఇదని వంకలు..భార్యని మాత్రం తల్లిని చేసాడు..అత్తగారింటికి vaste A.C. లో తప్ప padukodani అప్పటికప్పుడు arrange చేసారు..అదేమని అడిగితే, "పెళ్లి ఐతే బాగు పడతాడని పెళ్లి చేసాము" అని అత్తవారింటి సమాదానం...అమ్మాయి పుట్టింట్లో,, తల్లిదండ్రులు కన్నీటితో, అబ్బాయి రోడ్లు పట్టుకుని వుద్యోగం సద్యోగం లే...
జీవో ఔర్ జీనేదో
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వ్రాసినవారు
రుక్మిణిదేవి
-
ఒక స్త్రీ కి కావలసినదేమిటి ? తను ఏది కోరుకుంటే అదే చేయగల స్వేచ్చ ఇస్తే సరిపొతుందా ? దానికే స్వేచ్చ అని పేరు పెడితే తెల్లవారి లేచిన దగ్గరనుండి రాత్రి పడుకొనేవరకూ చీరలు,నగలు అని కలలు కంటూ, వాటికోసం భర్తను సాధించే వారిని ఎంతోమందిని చూస్తున్నాము.. అందరూ అలా వుండరు, లేకుండా కూడా లేరు..ఇది ఒప్పుకోవాల్సిన విషయం.. షాపింగ్ మాల్స్ ఎన్ని చూడడం లేదు...కాని శారీరకంగా గానీ,మానసికంగా గాని మగవారికి ఏమాత్రం తీసిపోని ఒక స్త్రీ బాంధవ్యాల దగ్గరకొచ్చేసరికి తనను తాను మలచుకుంటూనే తన వారిని నడిపించే విషయానికొచ్చేసరికి బలహీనురాలిగా ఎందుకు తయారవుతుంది..? ఆమె ఏం కోరుకుంటుంది ? నా బార్య నా మాట జవదాటరాదు అనుకునే భర్తను కోరుకుంటుందా ? లేదండి......అలా ఏ బార్యా కోరుకోదు...కాని భర్త ప్రేమతో గీస్తే, లక్ష్మణరేఖను దాటాలని ఏ స్త్రీ కూడా కోరుకోదు ..ఒక సెక్యూరిటి కోరుకుంటుంది..నేనున్నాను అనే ఒక అండ కోరుకుంటుంది..పిల్లలకు అన్నీ సమకూరుస్తూనే వారి ప్రేమ ఆశిస్తుంది.. వీటన్నింటితో పాటు "నేను" అన్న ఒక గుర్తింపు కోరుకుంటుంది..(అందుకే తన వంట కొత్త కాకపోయినా ప్రతిరోజు ఇంట్లోవారి మెప్పుకోలు పొందాలని ఆశిస్తుంది) వంటగద...
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వ్రాసినవారు
రుక్మిణిదేవి
-
అమెరికాలో చదువు ఎందుకురా? డాలర్లే,డాలర్లు.........ఇదండి సమధానం... నిన్న మావారు ఇంటికి వచ్చి వినిపించిన ఒక కధనం నా మనసులో ఈ చెత్తకధకి నాంది.. మాకు తెలిసినవారి అబ్బాయిని అమెరికా పంపడం కోసం ఇంకా కనీసం నివాసయోగ్యంగా కూడా కట్టని ఓ ఇల్లు తాకట్టు పెట్టి. అక్షరాలా ఇరవై ఐదు లక్షలు (తల్లి తపన తన కొడుకు అమెరికా వెళ్ళాలని) పెట్టి ఎలా ఐతేనేం అక్కడ ఉద్యోగ రీత్యా ఉంటున్న తమ కూతురు,అల్లుడుల సహకారంతో ఒక యూనివర్శిటీ లో ఎమ్.ఎస్ కోర్స్ లో జాయిన్ చేశారు...యూనివర్శిటీ కాంటీన్ లో ఐతే తక్కువ డాలర్లు ఇస్తారని,బయట పని (పార్ట్ టైమ్) ఒప్పుకుని (వారానికి రెండువందల డాలర్లు) జాయిన్ ఐన తర్వాత అమ్మా,నాన్నకి ఫొన్ చేసాడట.. అమ్మా,నీకేం కావాలి అన్నాడట..ఇంతకీ ఏం పనిరా బాబు అని అడిగిన అమ్మకు "కుప్పలు కుప్పలుగా పోసి ఉన్న చెత్తను సంచులలో నింపి భుజాలు పడిపోయేలా మోసుకుని వాళ్ళు చూపిన స్థలంలో పొయ్యాలట" అని కొంచెం వివరంగా వివరిస్తే........ఏం చెప్పమంటారు ఆ తల్లి ఆవేదన? ఇంట్లో తను తిన్న చాక్లేట్ రేపర్ ని "ఒరెయ్ బాబు డస్ట్ బిన్ లో పడెయ్యరా", అని నెత్తి,నోరు కొట్టుకున్నా తలెగరేసి మరీ విదిలించుకు పోయే నా కొడుకు ఈరో...
ఓ స్త్రీ స్వగతం
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వ్రాసినవారు
రుక్మిణిదేవి
-
మై మాలికిన్ హుః అప్నీ మర్జీ కా.......... ఒహ్ యెస్....నేను ఆడుతున్నాను, పాడతున్నాను (మనసులో సుమండీ)... ప్రపంచంలోని ఆనందాన్నంతా ప్రతి సెకనూ అందుకోవాలని ఆరాట పడుతున్నాను... నాకు నచ్చింది చేస్తున్నాను,,నచ్చినట్లు ఉంటున్నాను... నిధి చాల సుఖమూ........... "మమ్మీ........... వీల్లేదు. నువ్వు మాకు నచ్చినట్లు ఉండాలి..మాకు నచ్చిందే చెయ్యాలి... ఐనా నేను ఏ అమే...రికా అమ్మా,నాన్నకో పుట్టి వుంటే ఎంత బాగుండేది...నా బాడ్ లక్...." ఓ కన్న కూతురి నిట్టూర్పు. "ఏమేవ్...నాకు నచ్చినట్లు మాత్రమే నువ్వుండాలి...లేదంటే నువ్వు నాకు అక్కరలేదు..ఐనా నిన్ను కాదే, నిన్ను కన్నవాళ్ళను,నాక్కట్టబెట్టిన వాళ్ళను అనాలి... నా ఖర్మ..". ఓ భర్త అంతులేని మనోవేదన............ "అమ్మా,నా ఫ్రెండ్స్ తో కలసి సినిమాకు వెళ్ళివచ్చానని,,సిగరెట్లు తాగుతున్నానని నాన్నకు ఊదేసావా...నువ్వు అసలు నా కన్నతల్లివేనా........"..ఓ కన్నకొడుకు ఆక్రోశం.... "ఓరి భగవంతుడా! నేనేం పాపం జేసానయ్యా ? వీళ్ళ కోసమా నేను రెక్కలు,ముక్కలు చేసుకున్నది...ఇదేనా జీవితం ?" ఒక్కసారి గతంలోనికి తొంగిచూసుకున్న ఆ తల్లికి అంతా శూన్యం కనబడింద...
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వ్రాసినవారు
రుక్మిణిదేవి
-
రెండుగంటలముందు మా ఇంట్లో అద్దెకి ఉన్న ఆమె మా ఇంటికి వచ్చారు.. ఒరిస్సా వాస్తవ్యులు.... భర్త సేల్స్ ఎక్జిక్యూటివ్ ఏదో మెడికల్ కంపెనీలో... భర్త తన ఉద్యోగధర్మంలో భాగంగా ఆయా వూర్లు తిరగాలి.. పైగా రెండున్నర సంవత్సరాలకొకసారి ట్రాన్స్ఫర్లు...ఈమె, తన రెండవ తరగతి చదువుతున్నకుమారుడు ఇంట్లో వుంటారు.. ఆమెతో మాట్లాడుతున్నంత సేపూ శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీత భొధిస్తున్నట్లు అన్పించింది.... నా అనుభవాలు ఇంచుమించు అవే ఐనప్పటికి (ఒక స్త్రీగా) నేను నోరు మెదపకుండా తను చెప్పేది నవ్వుతూ వింటూ వున్నాను.. నిజంగా అనుభవాలు మనిషికి పరిపక్వతనిస్తాయి అన్నదానికి ఆమె ఒక ఉదాహరణ...ఒరిస్సాలో ఒక మారుమూల పల్లెటూరులో జన్మించి పెళ్ళి చేసుకుని అత్తవారింట అడుగుపెట్టిన ఆమె అక్కడి వారి భొజన అలవాట్ల గురించి మాట్లాడుతూ,, బాబీ,, వెజ్ నుండి నేను నాన్_వెజ్ లొ పడ్డాను..ఐనప్పటికీ వారి ఇచ్చానుసారం నేను నాన్_వెజ్ వండడం అలవాటు చేసుకున్నాను..ఆడవారు ఎప్పుడూ బయటికి రాని సంస్కృతి మా అత్తవారింట్లో... నేను నా ఇంటిపనుల కోసం బయటకు వెళ్ళడం,పసి పిల్లవాడు జలుబు చేసినా జ్వరం వచ్చినా ఎవరో ఒకరి సాయంతో పరుగులు పెట్టడం, తప్పలేదు.. ఆక్షేపణ తెలిపిన...
మా నాన్నగారు
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వ్రాసినవారు
రుక్మిణిదేవి
-
శుభోధయం ... ఈ రోజు , మా జీవితంలో మరపురాని ఒక సంఘటన జరిగిన రోజు ... సరిగ్గా రెండు సంవత్సరాల క్రిందట ఇదే రొజు మా నాన్నగారు మానుండి శాశ్వతంగా దూరమయిన రోజు .. ఆరోజు నేను స్కూల్ లో మంచి బిజీగా వున్న సమయం ... ఫోన్ కాల్ మావారినుండి .... అర్జెంటుగా విజయవాడ వెళ్ళాలి , పర్మిషన్ తీసుకుని రెడీగా వుంటే తను నన్ను పికప్ చేసుకుని , రత్నాచల్ కి బయలుదేరాలని ... సిరిపురం నుండి , రైల్వే స్టేషన్ కి వచ్చేలోగా అంతా ఐపోయింది అని చెల్లి ఫోన్ ........................ ఆ జ్ఞాపకాలలో ఒక చిన్న మరపుకి రాని , మరువలేని , ఆచరణీయయోగ్యమయిన ఒక చిన్న సంఘటన ............................. నాకు చిన్నతనం నుండీ పుస్తకాలు అంటే ఏదో తెలియని మమేకం ... చిన్న చిరిగిన కాయితం ముక్క ఐనా నాకు అపురూపం .. నాన్నగారు ట్రైన్ కి వెళ్తూ ఇచ్చిన చిల్లర తో మొదటగా నేను కొన్నది ......... ఆంద్రప్రభ వీక్లీ ... వేంకటేశ్వరస్వామి వారి ముఖచిత్రం ... ఆ అలవాటు మా నాన్నగారిదే .. ఎన్నో బుక్స్ తెచ్చేవారు .. అది , ఇది అని కాదు .. సాంఘిక , డిటెక్టివ్ , భక్తి ... ఇలా చదవదగినవి ...
బ్రతకడమా, జీవించడమా?
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వ్రాసినవారు
రుక్మిణిదేవి
-
ఏమిటిది పిచ్చి ప్రశ్న అనుకుంటున్నారు కద.........ఒక్కసారి ఆలోచించండి.....ఇప్పుడు అర్ధమయిందా ఎందుకు అడిగానో.........సరే,నేనే చెప్తాను... బ్రతకడానికి,జీవించడానికి..నక్కకి,నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది....అందరం బ్రతుకుతున్నాము.ఉదయం నిద్ర లేచిన దగ్గరనుండి,రాత్రి పడుకునేవరకు...మరి ఇంకేమి కావాలండి? జీవించడం.....ఎలా? జీవించడానికి ఒక అర్ధం,పరమార్ధం కావాలి..అర్ధం అంటే నేనిక్కడ మీరు అనుకుంటున్నదే చెప్తున్నాను..మనిషికి కాసింత కళా,పోషణా ఉండాలి అంటారు రావుగోపాలరావుగారు ముత్యాల ముగ్గు సినిమాలో..మరి ఆ రెండూ ఎక్కడ లభిస్తాయండి అని అడిగితే డబ్బు కలవారి జవాబుకి,డబ్బు లేనివారి జవాబుకి వున్న తేడానే.....నక్కకి,నాగలోకానికి వున్నంత.. డబ్బు అంటాడు ఉన్నవాడు..చింకిచాప అంటాడు లేనివాడు...ఇదేమిటి అంటే......వ్యక్తి తనకున్న అవకాశాన్ని సద్వినియోగంచేసుకోవడం అన్నమాట..ఎవరి స్థానాల్లో వారు జీవించడానికి చేసే ప్రయత్నం అన్నమాట...సరే ఎలానూ డ్బ్బు విషయం వచ్చింది కద.ఒక రహస్యం చెప్పనా..ఆ,ఇది అందరికీ తెలిసిందే అంటారా.....ఐతే ఓ.కే... డబ్బు కొండమీది కోతినయినా తెస్తుందండి..మనిషిని అధః పాతాళానికి దిగిజారుస్తుంది... .. అధికారం కూ...
స్వేచ్చ కావాలి
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వ్రాసినవారు
రుక్మిణిదేవి
-
ఈ వాక్యం ఒక స్నేహితురాలు ప్రస్తావించినపుడు నాకు ఆశ్చర్యం కలిగింది.. ఏమిటి ఈ కోరిక.. ఎందుకు అలా అనిపించింది? అని నాలో ఒక ప్రశ్నార్ధకం......... ఏం స్వేచ్చ? అంత లోతైనదా ఈ పదానికి అర్థం? ఎలాంటి స్వేచ్చ కావాలి? నా ఉద్దేశ్యంలో ........... *మనసుకి, ఆకాశంలో ఎగిరే పక్షీ తేడా ఏముంది? పక్షి రెక్కలు విప్పి ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. .మనసు రెక్కలు తొడిగి ఎక్కడెక్కడికో పయనం మొదలిడుతుంది. *మరి రెండింటికి పోలిక..........గాలికి వదిలామా ఆకాశమే నాది అంటాయి..మన చేతికి చిక్కనంటాయి..ఐన పయనం ఆగనంటాయి. మనసుని మాత్రం పగ్గం వేయకపోతే దారి తప్పిన భాటసారిలా అటు,ఇటు గమ్యం తెలియక విల విల లాడుతూ రోదిస్తుంది.... ఏదయినా కావాలి అని అనుకునే ముందు "అది ఎందుకు కావాలి?" అన్న ప్రశ్న వేసుకోగలగాలి.