పోస్ట్‌లు

మే, 2015లోని పోస్ట్‌లను చూపుతోంది

భారతీయం: ▶ Ornaments Missing in Gollapalli Raghunatha Swamy...

భారతీయం: ▶ Ornaments Missing in Gollapalli Raghunatha Swamy... : ▶ Ornaments Missing in Gollapalli Raghunatha Swamy Temple At Krishna District - Video Dailymotion

భారతీయం: నేనెలా వుండాలనుకుంటానంటే..............

భారతీయం: నేనెలా వుండాలనుకుంటానంటే.............. : పడిలేచే కెరటం లా చల్లగా,మెల్లగా వీచే చిరుగాలిలా ప్రకృతి సందడిలా వాన చినుకులా ముత్యపు బిందువులా విద్యుత్తరంగంలా పదహారేళ్ళ ప్రాయంలా సు...

నేనెలా వుండాలనుకుంటానంటే..............

పడిలేచే కెరటం లా చల్లగా,మెల్లగా వీచే చిరుగాలిలా ప్రకృతి సందడిలా వాన చినుకులా ముత్యపు బిందువులా విద్యుత్తరంగంలా పదహారేళ్ళ ప్రాయంలా సుమధుర గానంలా గలగల పారే సెలయేరులా గాలికి కదిలే ఆకులా చిరుమువ్వల సందడిలా పసిపాప నవ్వులా అమ్మ ఒడిలా నాన్న లాలనలా... నేను "నేను" లా....................................... చాలా సార్లు మా స్నేహితురాలు ,   ఎలా ఉంటే బాగుంటుందీ అని ప్రశ్నల వర్షం కురిపిస్తూ వుంటే "మీరు మీరు లా ఉంటే చాలు" అని సమాధానం ఇచ్చాను.. ఆ తర్వాత నా మదిలో కదిలినవి ఇదిగో. ఇలా వ్రాయడం జరిగింది....   

భారతీయం: "జీవితం నీకు ఏది ఇస్తే అది తీసుకో"...

భారతీయం: "జీవితం నీకు ఏది ఇస్తే అది తీసుకో"... :  అసంతృప్తి ... ప్రతి ఒక్కరి జీవితాలలో పాచిపట్టబడి అంటుకుపోయిన ఒక భావన .. దానికి వయసుతో సంబంధం లేదు . కేవలం మనసుతో మాత్రమె బంధం .. ఒక నిమిష ...

"జీవితం నీకు ఏది ఇస్తే అది తీసుకో"...

 అసంతృప్తి ... ప్రతి ఒక్కరి జీవితాలలో పాచిపట్టబడి అంటుకుపోయిన ఒక భావన .. దానికి వయసుతో సంబంధం లేదు . కేవలం మనసుతో మాత్రమె బంధం .. ఒక నిమిష మా, ఒక గంటా , ఒక నెలా లేక ఒక సంవత్సరమా అని కాకుండా జీవితాంతం మనతో వుండిపోయేది ..బాల్కనీ  లో నిలబడి అల్లంతదూరాన ఒక చిన్న గ్రామం వంటి వాతావరణం చూసినప్పుడు ..." ఆహా ఎంత హాయి ఐన జీవితాలు.." అని మన మనసులో ఒక భావన పుడుతుంది. అవి ఎంత హాయి ఐన జీవితాలో మనకి తెలియదు గాని ఆ నిమిషం మనకు ఒక హాయినిస్తుంది . ఇది నిజమ్.. ఆ భావన మన మనసులో పాతుకుంటుంది . మన జీవనానికి , అక్కడి జీవనానికి పోలిక కట్టడం మొదలుపెడుతుంది .. ఇక్కడ మనమేదో కష్ట పడిపోతున్నట్లు , అక్కడి వారు సుఖపడిపోతున్నట్లు , వాళ్ళు అదృష్టవంతులు ఐనట్లు, మనం దురదృష్టవంతులము ఐనట్లు ఒక పెద్ద ఫీలింగ్ కలుగుతుంది..  దూరపుకొండలు నునుపు అన్న సంగతి మన మనసు ఆ క్షణంలో మరచిపోతుంది .  .  . అక్కడ మొదలౌతుంది మన మనసులో అసంతృప్తి ... "జీవితం నీకు ఏది ఇస్తే అది తీసుకో"...   అని మా వాడు ఎవరికో హితభోద చేస్తుంటే ఆశ్చర్యం తో నిలబడిపోయాను ..ఎంత గొప్ప సత్యం దాగి వుంది ఆ మాటలో. ఎంత నిజం దాగి వుంది ? ఆ మాటలు ఎవరి