పోస్ట్‌లు

ఆగస్టు, 2010లోని పోస్ట్‌లను చూపుతోంది

గీతా భవనము

గీతా మే చోత్తమం గృహమ్ . ......అని భగవధ్వాక్యము. అనగా "నేను గీతనాశ్రయించుకుని యున్నాను. గీత నా యొక్క నివాసగృహము" అని భావము. ఈ ప్రకారముగ గీతామాహాత్యమున గీతా గృహమును గూర్చి భగవానుడు తెలిపియున్నాడు.. ఆ గృహము యొక్క స్వరూప,స్వభావముల వివరము ఈ క్రింద తెలుపబడుచున్నది. గీతా సౌధ వివరములు నిర్మాత____ శ్రీకృష్ణపరమాత్మ అలంకరణ కర్త___శ్రీ వేదవ్యాస మునీంద్రులు ఆకారము___ మూడంతస్థులు గలది. పునాది___అర్జున విషాదయోగము(ప్రధమాధ్యాయము) మొదటి అంతస్థు___ 5 గదులు (2వ అధ్యాయము నుండి 6 వ అధ్యాయము వరకు)(సాంఖ్యయోగము, కర్మ యోగము, జ్ఞానయోగము,కర్మయోగము,సన్న్యాసయోగము, ఆత్మసంయమయోగము _అనునవి) రెండవ అంతస్థు____ 6 గదులు (భక్తిషట్కము_ 7వ అధ్యాయము నుండి 12వ అధ్యాయము వరకు)(విజ్ఞానయోగము, అక్షరపరబ్రహ్మయోగము, రాజవిద్యారాజగుహ్యయోగము,విభూతియోగము,విశ్వరూపసందర్శనయోగము,భక్తియోగము..అనునవి) మూడవ అంతస్థు___ 6 గదులు ( జ్ఞానషట్కము..13వ అధ్యాయమునుండి 18వ అధ్యాయము వరకు) క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగము, గుణత్రయవిభాగయోగము,పురుషోత్తమప్రాప్తియోగము,దైవాసురసంపద్విభాగయోగము,శ్రద్దాత్రయవిభాగయోగమ్య్, మోక్షసన్న్యాసయోగము...అనునవి) నిర్మాణమునకు
౮.. ఏ ప్రకారము గాలి వీచనిచోట గల దీపము నిశ్చలముగనుండునో,ఆ ప్రకారము ఆత్మ ధ్యానమందు లగ్నమై యున్న యోగియొక్క స్వాధీనచిత్తము కూడ నిశ్చల స్థితిని పొంది యుండును ( కావున యోగిపుంగవుల నిశ్వలమనస్సునకు అట్టి దీపము యొక్క స్థితి ఉపమానముగ చెప్పబడింది). (6_34). ౯. అర్జునా ! నాకంటే ఇతరమైనది ఏదియును ఈ ప్రపంచమున ఒకింతైనను లేదు.దారమునందు మణుల వలె నాయందీ సమస్త ప్రపంచమున్ను కూర్చబడియున్నది...(7_7) ౧౦. అంతటను సంచరించునదియు,గొప్పదియునగు వాయువు సర్వకాలములందును ఆకాశమునందెట్లు నిలిచియున్నదో,అట్లే సమస్తభూతములున్ను నాయందున్నవని తెలిసికొనుము.. ౧౧. ఓ అర్జునా ! ఈ శరీరము క్షేత్రమని చెప్పబడుచున్నది. మరియు దీనినితెలియువాడు క్షెత్రజ్ఞుడని విజ్ఞులు పేర్కొనుచున్నారు.(9_6) ౧౨. ఆతి సూక్ష్మమైయుండుటచేసర్వవ్యాపకమగు ఆకాశము దేనిచెతను అంట్బడక ఎట్లుండునో, అట్లే సర్వత్ర వ్యాపించియున్న ఆత్మ దెహాదులచే నంటబడక యుండును.(13_2) ౧౩. అర్జునా ! సూర్యుడొక్కడు సమస్తలోకము నెట్లు ప్రకాశింపజేయుచున్నాడొ, అట్లే క్షేత్రజ్ఞుడగు ఆత్మ దెహాది సమస్త క్షేత్రమును ప్రకాశింపజేయుచునాడు.(13_33) ౧౪. దేనికి వేదములు ఆలులుగానున్నవో అట్టి సంసార రూప అశ్వత్ధవృక్షము(ర

భారతీయం: గీ" అనగా త్యాగము, "త" అనగా తత్త్వజ్ఞానము...త్యాగము...

భారతీయం: గీ" అనగా త్యాగము, "త" అనగా తత్త్వజ్ఞానము...త్యాగము... : "గీ' అనగా త్యాగము, 'త' అనగా తత్త్వజ్ఞానము...త్యాగమును,తత్త్వజ్ఞానమును భోధించునదే గీత అని మానవులందరు తెలుసుకొనవలయును. మహాత్ములు తాము గంభీర త..."
గీ" అనగా త్యాగము, "త" అనగా తత్త్వజ్ఞానము...త్యాగమును,తత్త్వజ్ఞానమును భోధించునదే గీత అని మానవులందరు తెలుసుకొనవలయును. మహాత్ములు తాము గంభీర తత్త్వములు జనసామాన్యము యొక్క హృదయమును నాటుటకొరకై పెక్కు దృష్టాంతములను వాడుచుందురు. తద్వారా క్లిష్ట భావాలు ఐనా జనులకు సులభముగ భోధపడుచుండును. గీత యందు శ్రీ కృష్ణమూర్తి ఇట్తిపద్దతినే అనుసరించి అనుపమ ఆధ్యాత్మిక తత్త్వములను చక్కటి సాదృశ్యముల ద్వా"గీ" అనగా త్యాగము, "త" అనగా తత్త్వజ్ఞానము...త్యాగమును,తత్త్వజ్ఞానమును భోధించునదే గీత అన రా భోధించుచు పోయెను..వారు తెలిపిన ఉపమానములు.............. ౧.మనుజుడు పాత బట్టలను విడిచి ఇతరములగు క్రొత్తబట్టనెటుల ధరించుచున్నాడో; అట్లే ఆత్మయు పాత శరీరములను వదిలి క్రొత్త శరీరములను ధరించుచున్నది. ౨.సర్వత్ర జలముచే పరిపూర్ణమైన గొప్ప జలాశయము లభింప; అత్తరి స్వల్ప జలముతో గూడిన భావి మొదలగువానియందు మనుజునకెంత ప్రయోజనముండునో,అనుభవజ్ఞుడగు బ్రహ్మజ్ఞానికి సమస్తవేదములందును అంత ప్రయోజనమే ఉండును. ౩.తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకొనునట్లు,యోగి యగువాడు ఇంద్రియములను విషయముల యెపుడు మరలించుకొనునో అపుడాతని జ్ఞా
చిత్రం
1970 వ సంవత్సరంలోశ్రీవిద్యాప్రకాశానందగిరి స్వాములవారి విరచిత, శ్రీ శుక బ్రహ్మాశ్రమము,శ్రీ కాళహస్తి వారు వెలుగు లోనికి తెచ్చిన గీతా మకరందము అనెడి ఒక మహా గ్రంధము ఈ మధ్య కాలంలో నాకు లభించింది... ఆ వివరంబెట్టిదనిన....... పుస్తకాభిలాష కాస్త మెండుగా ఉన్న నేను ఎక్కడికి వెళ్ళినా ముందు వెదుక్కునేది వాటి కోసమే.. మే నెలలో మా మరిది కుమార్తె పెళ్ళి సందర్భంగా మేము మా అత్తగారి ఇంటికి వెళ్ళడం జరిగింది..క్రితం సంవత్సరం అక్కడ ప్రసిద్ది చెందిన రఘునాధస్వామి ఆలయంలో ఒక ఆరు సంవత్సరాల వయసు గల ఒక చిన్న బాబుని చూడడం జరిగింది...వైభవ వేంకటేశ్వరుని చూసినంత ఆనందం అనుభవించాను..అంత ముద్దుగా, బొద్దుగా మొహంలో ఒక తేజస్సుతో మంచి అన్నమయ్య కీర్తనతో అందరినీ అలరించాడు.. మా తాతగారి మనుమడు పెద్దమ్మా అని చెప్పి ఆయన ప్రొఫెసర్ గా చెసి రిటైర్ అయ్యారు అని చెప్పింది..మంచి బుక్స్ ఎమైనా వుంటే తెచ్చిపెట్టమ్మా,చూసి ఇచ్చేస్తాను అని అడిగాను..అది సభ్యత కాదు,నేను స్వయంగా వెళ్ళాలి అని తెలిసినా,వెళ్ళలేని పరిస్థితి..అడిగినదే ఆలస్యం నాకు అప్పుడు దొరికిన పుస్తకం "శ్రీ యోగ వాశిష్టం"...చాలా పురాతన గ్రంధం..............ఏమి చెప్పను నా అను
అబ్బ మమ్మీ వుండు,,ఊపిరాడనివ్వవు,,ఒక్కరోజు హాలిడే దొరికితే చాలు...అది చెయ్యి,ఇది చెయ్యి అని ప్రాణం తీస్తావు...ఏంచెయ్యాలి? ప్రశాంతంగా ఒక్కరోజు ఉండనివ్వవు కద,,,,,,,,,,,,ఇదండీ ప్రతి ఆదివారం మా పక్కింటి సందడి...అక్కడే వాష్ బేషిన్ శుభ్రం చేస్తున్న నేను అవాక్కవుతుంటాను..ఇంతకీ ఆ తల్లి చేసిన పాపం ఏమిటంటారా....ఫ్రిజ్ లో నుండి పాలగిన్నె తీసుకురమ్మనో లేదా ఏదొ అందించమనో (రిక్వెస్టేనండి నాన్నా,బుజ్జి అని) పిల్లలు ఇంట్లొ వున్నారు,కొంచం సాయం చేస్తారు అని చిన్న ఆశ తో అడుగుతారండి ... మేడమ్,,,ప్లీజ్ మేడం.......కొంచెం సేపు,ఓన్లీ ధర్టీ మినిట్స్,,ఈ పీరియడ్ ఆడుకుంటాం మేడం..మళ్ళీ ఇంటికి వెళ్ళగానే ట్యూషన్ కి వెళ్ళిపోవాలి........మా అనిరుధ్ లాంటి పిల్లల వేడుకోలు..ట్యూషనా....ఉదయం నిద్రలేచి,కాలకృత్యాలు తీర్చుకుని,అమ్మ పెట్టింది తిని గబగబ తయారై స్కూల్ కి పరుగెత్తి(లేటైతే పి.టి. మాష్టారితో భాధ) అసెంబ్లీ ఐన దగ్గర్నుండీ సాయంత్రం స్టడీ అవర్స్ (పేరిట రుబ్బబడుతున్న చదువులా కాదు కాదు పసిపిల్లల మెదడులు.) అయ్యేంతవరకు ఆ బెంఛీ ల మీద కూర్చుని,కూర్చుని (బ్యాక్ పెయిన్స్,మెడ వంగిపోవడాలూ)బ్రేకు దొరికితే సింహాలైపోయే ఈ పసిపిల్లల జీ

భరతావనిలో ఆంధ్రుని ప్రతిభాజ్వాల

ఆగస్టు పదిహేను,రెండువేల పదవ సంవత్సరం,,స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ముగిసి అందరు దూరధర్శన్ ముందు తమ తమ స్థానాల్లో అసీనులైన సమయం,, అందరి కళ్ళూ అటువైపే,,, ఏం అవుతుందో అని ఆత్రుత................ గరమా గరమ్ కాఫీ హోజాయ్ అన్నాను.. ఎస్,ఎస్ అని అందరూ తలలు తిప్పకుండానే సమాధానం...అప్పుడనిపించింది...నాలో మాత్రమే కాదు అందరి మనసుల్లో ఒకే భావన..........ఆత్రుత......అని.. ఉదయం నుండీ ప్రతి ఇంటా,ప్రతి ఒక్కరి మనసూ ఒకే విషయం మీద కేంద్రీకృతమై వుంది..స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఒక వైపు,, నాలుగు నెలల నుండి సాగుతున్న "ఇండియన్ ఐడోల్" పాటల పోటీల చివరి ప్రహసనం మరో వైపు....ప్రతిభకి పట్టం కట్టబడుతుందా లేక ప్రాంతీయతాభిమానానికా అని సందేహం....కారుణ్య,హేమచంద్రులు ప్రతిభావంతులు ఐనప్పటికీ ఫైనల్లో విజేతలు కాలేకపోయారు..మరి ఈసారీ అలానే జరుగుతుందా అని ఒక ప్రక్క సందేహం.. మరో ప్రక్క అలా జరగదు,విజయం మనదే అని ప్రతి ఆంధ్రుడి ఆత్మ విశ్వాసం...ప్రతి ఒక్కరి మొబైల్ లోనూ ఆ నామధేయమే..జై శ్రీరామ్..... స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కన్నా, ఈ వేడుక కోసం ఎదురుచూడని కళాహృదయులు వుండరు..మెసేజ్ ల మీద మెసేజ్ లు.... ఎంతటి అదృష్టవంతుడివయ్యా

మా నాన్నగారు

శుభోధయం ... ఈ రోజు , మా జీవితంలో మరపురాని ఒక సంఘటన జరిగిన రోజు ... సరిగ్గా రెండు సంవత్సరాల క్రిందట ఇదే రొజు మా నాన్నగారు మానుండి శాశ్వతంగా దూరమయిన రోజు .. ఆరోజు నేను స్కూల్ లో మంచి బిజీగా వున్న సమయం ... ఫోన్ కాల్ మావారినుండి .... అర్జెంటుగా విజయవాడ వెళ్ళాలి , పర్మిషన్ తీసుకుని రెడీగా వుంటే తను నన్ను పికప్ చేసుకుని , రత్నాచల్ కి బయలుదేరాలని ... సిరిపురం నుండి , రైల్వే స్టేషన్ కి వచ్చేలోగా అంతా ఐపోయింది అని చెల్లి ఫోన్ ........................ ఆ జ్ఞాపకాలలో ఒక చిన్న మరపుకి రాని , మరువలేని , ఆచరణీయయోగ్యమయిన ఒక చిన్న సంఘటన ............................. నాకు చిన్నతనం నుండీ పుస్తకాలు అంటే ఏదో తెలియని మమేకం ... చిన్న చిరిగిన కాయితం ముక్క ఐనా నాకు అపురూపం .. నాన్నగారు ట్రైన్ కి వెళ్తూ ఇచ్చిన చిల్లర తో మొదటగా నేను కొన్నది ......... ఆంద్రప్రభ వీక్లీ ... వేంకటేశ్వరస్వామి వారి ముఖచిత్రం ... ఆ అలవాటు మా నాన్నగారిదే .. ఎన్నో బుక్స్ తెచ్చేవారు .. అది , ఇది అని కాదు .. సాంఘిక , డిటెక్టివ్ , భక్తి ... ఇలా చదవదగినవి