పోస్ట్‌లు

జనవరి, 2010లోని పోస్ట్‌లను చూపుతోంది

....... ధ్యానం. ......

మెడిటేషన్ క్లాసులు తీసుకోవడానికి వెళ్ళిన ప్రతిసారి ఒక విషయం అబ్జర్వ్ చేస్తున్నాను....ఆరోగ్యం కోసం అని కొందరు,ప్రశాంతత కోసం అని మరికొందరు చెప్తే, జ్ఞానం కోసం అని ఒకరిద్దరు చెప్తున్నారు. అయితే జన్మల గురించి కూడా వివరిస్తున్నారు, ఎవరికి తెలిసినట్లు వారు..మరుజన్మ వద్దు అని,ఎమైనా కోరికలు వుంటే ఇప్పుడే తీర్చేసుకోవాలని, ఇలాంటి అపోహలు కూడా వున్నాయని తెలుస్తుంది... ధ్యానం మనిషిని తప్పుదారి పట్టించదు భాద్యతలను మరిపింపదు. ధ్యానం ఆరోగ్యకరమయిన ఆలోచనా సరళిని పెంచి, జీవితాన్ని మార్చగలిగిన ఒక యోగం. ధ్యానం మౌనాన్ని నేర్పుతుంది మాటలనూ నేర్పుతుంది. ప్రశాంతత ఇస్తుంది,ప్రకృతిని పరిచయం చేస్తుంది. మౌనమూ ధ్యానమే,మంత్రపఠనమూ ధ్యానమే, ధ్యానం ప్రేమను నేర్పుతుంది, ప్రేమ తత్వాన్ని పెంచుతుంది. కామ,క్రోధ,మద, మాత్సర్యాలని చంపుతుంది, మంచిని పెంచుతుంది. మరవ వద్దు భాద్యతలను,విడువవద్దు ధ్యానాన్ని, ఒయాసిస్సులకై పరుగులొద్దు నిన్ను నీవు తెలుసుకొని మసలు. మన ప్రయత్నమ్ మనది ప్రతి ఆనందము మనదే. ధ్యానం ఆరోగ్యకరమయిన ఆలోచనా సరళిని పెంచి,

ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు..

 ఏ రోజైనా ఎలాంటి రోజైనా అందరు సంతోఃసంగా ఉండడం మనకి ముఖ్యం కద. ఈ సందర్భంలో కొన్ని విషయాలు. . . . .శూన్యస్థితి గురించి నేను చదివింది చెప్పడానికి చిన్న ప్రయత్నం _ మనం దైనందిన కార్యక్రమాలలో చాలా ఆలోచిస్తు గడుపుతాము. . ఆలోచనా రహిత స్థితికి మనల్ని మనం ప్రయాణించగలగడమే శూన్యస్థితి అని తెలుస్తుంది..ఆ స్థితికి చేరాలి అంటే మనం ఏమి చెయాలి? అంటే "ధ్యానం" చెయాలి అన్నారు. బుద్ధుడు జ్ఞానోదయం పొందాడు ఒక భోధి చెట్టు క్రింద అని చదువుకున్నాం కద...కాని ఏం జ్ఞానం పొందాడు అని మనం ఆలోచించినట్లు నాకు తెలియదు..కాలక్రమంలో చాలామంది మహానుభావులు తమ తమ అనుభవాలతో ప్రజలకి ధ్యానం గురించి తెలియజెసినట్లు చదువుకుంటున్నాము..ధ్యానం ఎన్నో రకాలు అని కూడా చెప్తున్నారు. ఆ వివరాలతో మరోసారి మీ ముందుకు..
ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ఏ రోజైనా ఎలాంటి రోజైనా అందరు సంతోఃసంగా ఉండడం మనకి ముఖ్యం కద. ఈ సందర్భంలో కొన్ని విషయాలు. . . . .శూన్యస్థితి గురించి నేను చదివింది చెప్పడానికి చిన్న ప్రయత్నం _ మనం దైనందిన కార్యక్రమాలలో చాలా ఆలోచిస్తు గడుపుతాము. . ఆలోచనా రహిత స్థితికి మనల్ని మనం ప్రయాణించగలగడమే శూన్యస్థితి అని తెలుస్తుంది..ఆ స్థితికి చేరాలి అంటే మనం ఏమి చెయాలి? అంటే "ధ్యానం" చెయాలి అన్నారు. బుద్ధుడు జ్ఞానోదయం పొందాడు ఒక భోధి చెట్టు క్రింద అని చదువుకున్నాం కద...కాని ఏం జ్ఞానం పొందాడు అని మనం ఆలోచించినట్లు నాకు తెలియదు..కాలక్రమంలో చాలామంది మహానుభావులు తమ తమ అనుభవాలతో ప్రజలకి ధ్యానం గురించి తెలియజెసినట్లు చదువుకుంటున్నాము..ధ్యానం ఎన్నో రకాలు అని కూడా చెప్తున్నారు. ఆ వివరాలతో మరోసారి మీ ముందుకు..