పోస్ట్‌లు

డిసెంబర్, 2010లోని పోస్ట్‌లను చూపుతోంది

భారతీయం: ఈ కాలం మగపిల్లలు

భారతీయం: ఈ కాలం మగపిల్లలు : "మా చెల్లెలు కాంపిటీటివ్ ఎక్జామ్ వ్రాయడానికి ఎక్జామ్ సెంటర్ కి తీసుకు వెళ్ళాము.. ఎక్జామ్ ఐపోయిన తర్వాత పిల్లలందరూ బయటకు వస్తున్నా..." పోస్ట్‌ను ప్రచురించు

ఈ కాలం మగపిల్లలు

మా  చెల్లెలు కాంపిటీటివ్ ఎక్జామ్ వ్రాయడానికి ఎక్జామ్ సెంటర్ కి తీసుకు వెళ్ళాము.. ఎక్జామ్ ఐపోయిన తర్వాత పిల్లలందరూ బయటకు  వస్తున్నారు.. మా ముందునుండి ఒక మగపిల్లల గుంపు వెళుతుంది.. వారి సంభాషణ విని ఆహా అని ఎంతో ఆశ్చర్యపోయాము.. మరచిపోలేక పోతున్నాము ఆ మాటలు..వారిలో వారు ఇలా మాట్లాడుకుంటూ నడుస్తున్నారు.. "ఏరా, ఎక్జామ్ ఎలా వ్రాశావు?"  "ఏదో లేరా. అసలు ప్రిపేర్ ఐతే కద..మనకొస్తుందని ఏం గారంటి లేదు. ఐనా మనం ఇంత కష్టపడడం అవసరం అంటావా? ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే పోలా.. ఇంట్లో ఉండి హాయిగా మనకి నచ్చినట్లు వండుకుని తినవచ్చు..." ఔరా..ఔరౌరా.....కద.............

ఈ కాలం పిల్లలు కేవలం ఒక భర్తగా లేక ఒక భార్యగా వుండాలని అనుకోవడం లేదు. మరి ఏం కోరుకుంటున్నారు??

మనకి మనం సంప్రదాయాలు విదించుకున్నాము . . . మన సంస్కృతి దేశ విదేశాలకి తెలియజేశాము..ఇతరులు మన దేశవిలువలను అనుసరిస్తున్న సమయానికి మనం వింతపోకడలు పోతున్నాము. ఇంతవరకూ అందరూ ఆమోదించే విషయమే... ఐతే ఇంకా ఏదో తెలియనిది తెలియజేస్తున్నారు మన పిల్లలు..   ఇదివరకు టెక్నాలజీ అభివృద్ది లోనికి రాని సమయంలో ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్న సమయంలొ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఇంట్లో ఒక్కరు సంపాదిస్తే పదిమంది కూర్చుని తినే స్థితిలో సహజంగానే పెద్దవారు అంటే వయసు పైబడిన వారు తమ శక్తి సామర్ధ్యాలు తగ్గిన తరువాత పిల్లల సేవలపై ఆధార పడి ఉండేవారన్నది అందరికీ విధితమే...ఉద్యోగరీత్యా కానివ్వండి లేదా అన్నదమ్ముల కుటుంబాలలో ఒకరికొకరికి సరిపడక కానివ్వండి లేదా పిల్లల భవిష్యత్ దృష్ట్యా, ఒక ఊరినుండి ఇంకో ఊరికి బదిలీ వెళ్ళే సమయంలో పెద్దలు తాము పుట్టి పెరిగిన ఊరిని విడిచి వెళ్ళలేక ఆక్కడే ఉండిపోవడం వల్ల(ఈనాడు ముందు జాగ్రత్తగా పిల్లల పెళ్ళిళ్ళు చేసిన వెంటనే వారిని విడిగా ఉంచి వారికంటూ ఒక కుటుంబం ఏర్పాటు చేస్తున్నారు పెద్దలు) చిన్న చిన్న కుటుంబాలు ఏర్పడడం జరిగింది...ఒక కుటుంబం అంటే అమ్మ,నాన్న, ఒకరు లేక ఇద్దరు పిల్లలు..అమ్మనాన్నల

నేనెలా వుండాలనుకుంటానంటే..............

పడిలేచే కెరటం లా చల్లగా,మెల్లగా వీచే చిరుగాలిలా ప్రకృతి సందడిలా వాన చినుకులా ముత్యపు బిందువులా విద్యుత్తరంగంలా పదహారేళ్ళ ప్రాయంలా సుమధుర గానంలా గలగల పారే సెలయేరులా గాలికి కదిలే ఆకులా చిరుమువ్వల సందడిలా పసిపాప నవ్వులా అమ్మ ఒడిలా నాన్న లాలనలా... నేను "నేను" లా....................................... ఒక "మనీషి" లా................. చాలా సార్లు మా స్నేహితురాలు "నేనెలా వుండాలి?", "ఎలా ఉంటే బాగుంటుందీ" అని ప్రశ్నల వర్షం కురిపిస్తూ వుంటే "మీరు మీరు లా ఉంటే చాలు" అని సమాధానం ఇచ్చాను.. ఆ తర్వాత నా మదిలో కదిలినవి ఇదిగో. ఇలా వ్రాయడం జరిగింది....   

మనిషి తనలోని భావ పరంపరలను, ఒత్తిళ్ళను తగ్గించుకోగల ఏకైక మార్గం ఏదైనా ఒక పదార్ధం మీద ధ్యాస పెట్టడం.... ఆ పదార్ధం మనలోని శ్వాస కావచ్చు లేదా భగవంతుడు కావచ్చు..సృష్టి అనేక పదార్ధాలతో కూడి ఉన్నది.. మానవ దేహం కూడా అనేక పదార్ధాలతో కూడి ఉన్నది...ఐతే భగవంతుని కూడా పదార్ధంతో పోల్చవచ్చా ??