పోస్ట్‌లు

మార్చి, 2013లోని పోస్ట్‌లను చూపుతోంది

భారతీయం: ఇంతకు ఇంతే

భారతీయం: ఇంతకు ఇంతే : మనం వుదయం లేచిన దగ్గర నుండి, "  భగవంతుడా!  ఏమిటి కష్టాలు" అని కనీసం పదిసార్లు అయినా అనుకుంటూ  వుంటాము.. అవి మనం కొని తెచ్చుకునేవి...

ఇంతకు ఇంతే

మనం వుదయం లేచిన దగ్గర నుండి, "  భగవంతుడా!  ఏమిటి కష్టాలు" అని కనీసం పదిసార్లు అయినా అనుకుంటూ  వుంటాము.. అవి మనం కొని తెచ్చుకునేవి అని తెలుసుకోలేక , తెలిసినా కొన్నింటిని తప్పించుకోలేం అని తెలుసు కాబట్టి ... మన కర్మల  ఫలాలే అవి..  కర్మ యోగం గురించి ఇంతకు ముందే వివరించడం జరిగింది కాబట్టి ఆ సబ్జెక్ట్ టచ్ చేయను గాని ,  దానం అనెడి   కర్మయొక్క ఫలం ఎలా వుంటుంది అన్నది ఒక చిన్న కధ ద్వారా  తెలియజేస్తాను        ఒకానొక  రాజ్యాన్ని పరిపాలించే రాజు గారికి పుత్ర  సంతానం కావాలని యజ్ఞ యాగాదులు చేయించగా అదృష్ట వశమున పుత్ర సంతానం కలిగినది.   కాని, దురదృష్ట వశాత్తు రాజుకి  జన్మించిన కుమారుడు మూగవాడయ్యెను. ఐతే,  ఆనాటి నుండి ఆ రాజ్యం లోని బ్రాహ్మణులకి కష్టములు మొదలైనవి. ..బ్రాహ్మణులు లోప భూయిష్టమైన యజ్ఞమును చేయుట వలన తన  కుమారుడు మూగ వాడు  అయినాడని  రాజు అభిప్రాయ పడెను  .. అందుచే ఆ రాజు శైవులైన బ్రాహ్మణులను గుండు గొరిగించి విభూతి  రేఖలు పెట్టించి గాడిద పై వూరేగించెను.    ఆనాటి నుండి రాజుగారు  వింతగా ప్రవర్తింప సాగెను.. . బ్రాహ్మణులను పిలిచి విరివిగా తోటకూర దానం చేయ సాగెను. సాగు భూమిలో అధిక విస్త
సర్వేజనా   సుఖినో భవంతు      మనం తెల్లవారి  నిద్ర  లేచిన దగ్గర నుండి  రాత్రి నిద్రకు వుపక్రమించే వరకూ    ఎన్నో చెయ్యాలని అనుకుంటాము .   అనుకున్న   పనులు    అన్నీ పూర్తీ కావచ్చు లేదా కాక పోవచ్చు . పూర్తి  ఐతే సంతోష పడతాము లేదంటే   ఏదో విచారం మనల్ని కమ్ముకుంటుంది . ఇది అందరికీ  కాక పోవచ్చు కాని కొందరికి ఇలా జరుగుతూ వుండవచ్చు. ఐతే ఏ   పనిలో విజయం సాధించాలన్నా అది మన సంకల్ప శక్తి మీద   ఆధార పడి  వుంటుంది. ఆ సంకల్ప శక్తి  ఏమిటి ?  అన్న విషయం మరో సారి వివరిస్తాను. ఈరోజు ఈ మధ్య కాలంలో మా కుటుంబానికి  అత్యంత మధురానుభూతిని కలిగించిన రెండు విషయాలు ప్రస్తావిస్తాను .  నేను సామాన్యంగా రద్దీ ఎక్కువ వున్న  ప్రదేశాలకు అది ఎంతటి   ప్రాముఖ్యత   కలిగినదైనా  లేదా ఎంత  పర్వదినం అయినా   అడుగు పెట్టడానికి సాహసించను..   వూపిరి ఆడనట్లు వుంటుంది.  హాయిగా ఇంటిలో ప్రశాంతంగా  టి . వి లో    చూసుకోవచ్చు కదా అని అనుకునే దానిని..  వైకుంఠ ఏకాదశి పర్వదినాన అందరూ తిరుపతి వెళ్తుంటారు.   నేను ఎందుకు వెళ్ళడానికి  ఇష్ట పడడం లేదు అని నా మనసులో కూడా తిరుపతి తిరుమల వేంకటేశ్వరుని ఆ సమయం లో దర్శనం చేసుకోవాలి అన్న కోరిక ( అని