పోస్ట్‌లు

ఆగస్టు, 2012లోని పోస్ట్‌లను చూపుతోంది
మనం నాటిన విత్తనం భూమిలోనికి తన   వెళ్ళు జోప్పిస్తూ కాండాన్ని భూమి పైకి పంపి శాఖోప శాఖలుగా ఎలా ఐతే పెరిగి ఆకులు, పూవులు, కాయలు, పండ్లతో ప్రకృతిని రంజింప జేస్తుందో    , అదే విధంగా ధర్మం అనే విత్తనం మన మనసులో నాటితే తన సందేశాలతో మనలని వుద్ధరిస్తూ, తద్వారా మనలో నుండి మన చుట్టూ వున్నవారిలో తన శాఖలను విస్తరింపజేసి సమాజ కల్యాణానికి మార్గం వేస్తుంది.. మనం తినే తిండి మన కోసం, మనం చేసే పూజలు మన కోసం, , కాని మనం పాటించే ధర్మాలు మనలనే కాక, మన చుట్టూ వున్న వారిని కూడా సరియిన మార్గం లో నడిపిస్తాయి అనడంలో ఎ మాత్రం సందేహం లేదు .. రోజూ మన ప్రస్తావనలో ధర్మం గురించి వచ్చే మాటలు ఇలా వుంటాయి . ౧.   ధర్మంగా ఆలోచించాలి మరి .(మంచిగా వుండాలి ) ౨. ఇదేమన్నా ధర్మంగా వుందా ? ( ఇదేమన్నా న్యాయంగా వుందా ) ౩. ధర్మం చెయ్యండి బాబూ...( భిక్షమెత్తుకునే వారి భాషలో )...అంటే మనం వేసే రూపాయి, అర్ధ రూపాయి గురించి కాక మరేదో అర్ధం స్పురిస్తుంది   కదా.. ౪. నా ధర్మం నేను నిర్వర్తించాను   (కర్తవ్యమ్ ) ౫. ధర్మంగా నడుచుకోవాలి. ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, ఎప్పుడు అధర్మం పెచ్చు పెరిగిపోతుందో, ఎప్పుడు రాక్

ఏది ధర్మం ?

ఏది ధర్మం ? ఈ ప్రశ్న అందరి మనస్సులో ప్రతి నిత్యం మెదులుతున్నదే.. తెలుసుకోవాలన్న కుతూహలమూ వుంది ..అందుకే నా యీ చిన్ని ప్రయత్నం నాకు మేలు చేయడమే గాక, నాలాంటి  ఇతరులకు కూడా సహాయ పడుతుంది అని ఆశిస్తూ .. అసలు ధర్మం అంటే ఏమిటి ? ఈ ప్రశ్నకు సమాధానం నలుగురూ నాలుగు రీతుల్లో ఎవరికి తెలిసింది లేదా తోచింది  వారు చెప్పవచ్చు.ఐతే ధర్మం శాస్త్ర పరమైనదా ,మనకు  మనం సృష్టించు కున్నదా ? ధర్మం అంటే ఏమిటి అన్న   ప్రశ్నకు సమాధానం చాలా  క్లిష్టమైనది . ఈ పదం చాలా  నిగూడత కలిగినది ..చాలా లోతు గలది  విశాలమైనది.                                           ధర్మంతు  సాక్షాత్ భగవత్ ప్రణీతం ధర్మములు అన్నియు సాక్షాత్ పరమాత్మ నుండి నుండి లభించాయి --- బ్రహ్మశ్రీ గుత్తికొండ వెంకటేశ్వర  రావు గారు. ధర్మం ఏ యుగంలో అయినా ఒక్క లాగే వుంటుందా ? వుండదు.. దేశ ,కాల, ప్రాంతాల స్థితిని బట్టి   మారుతూ వుంటుంది..        దృతి: క్షమా దమం అస్తేయం శౌచమింద్రియ  నిగ్రహం          హ్రీర్విద్యో  సత్య మక్రోధం ఏతత్ ధర్మస్య లక్షణం ...   దృతి, క్షమ, దమం, అస్తేయం, శౌచం, ఇంద్రియనిగ్రహం, హ్రీ: (సిగ్గు ),విద్య, సత్యం, అ క్రోధం ,....ఈ ప

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ... : ఓం శ్రీ గురుభ్యోన్నమః  ఓం శ్రీ మహా గణాధిపతయే నమః  నూతన అధ్యాయం మొదలు పెట్టేటపుడు సహజంగా తలచుకునే నామాలను తలుస్తూ ..బ్లాగ్ లో  మరల ఇంత త...
ఓం శ్రీ గురుభ్యోన్నమః  ఓం శ్రీ మహా గణాధిపతయే నమః  నూతన అధ్యాయం మొదలు పెట్టేటపుడు సహజంగా తలచుకునే నామాలను తలుస్తూ ..బ్లాగ్ లో  మరల ఇంత త్వరగా వ్రాయడం మొదలు పెడతానని, వ్రాయ గలనని అనుకోలేదు .. మనలోని భావాలు లేదా ఆలోచనలు ఎవరితో అయినా పంచుకోవడం సహజం ..అలా చేయలేనప్పుడు ఒక పేపర్ మీదో లేక ఒక diary  లోనో వ్రాసుకోవడం చాలా మందికి అలవాటు .. ఆ చాలా మందిలో నేనూ వున్నాను ..ఈ మధ్య  కాలంలో గత కొంత కాలంగా నేను ఇల్లు, భర్త, పిల్లలు, అత్తమామలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు ఇలాంటి భాద్యతల మీద తప్ప ఇక ఇతర వ్యాపకాల మీద అంటే పుస్తకాలు చదవడం గాని ఏమైనా వ్రాయడం గాని లాంటి పనులు చేయలేక పోయాను ..   ఒక రోజు విశ్రాంతి తీసుకోవడం కోసం మంచం మీద చేరిన నా మనసులో ఒక ఆలోచన మొదలైంది .. అది నన్ను నేను కోల్పోతున్నాను అని ...కోల్పోవడం అంటే కోరికలు గాని, అసూయా ద్వేషాల వంటి వి గాని కాదు ..నా పుస్తక pathanam, భగవన్నామ స్మరణ జరుగుతున్నా ఒక స్థితిని అంటే ఒక సహజ స్థితి ని కోల్పోయానని అనిపించింది .. ఆ సమయంలో సాధకుడు అనే మన ఆధ్యాత్మిక బ్లాగర్ నాకు ఒక సూచన ఇవ్వడం జరిగింది .. ఆచరించడానికి ప్రయత్నిస్తానని చెప్పడం , ఇదిగో ఈ రోజు మరల బ్లాగ