పోస్ట్‌లు

జులై, 2010లోని పోస్ట్‌లను చూపుతోంది

ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్షలు

చాలామంది తమను తాము పరిచయంచేసుకొనేటప్పుడు ఏదో ఒక ప్రత్యేకత అంటే నేను సింపుల్,షార్ప్,యాక్టివ్ ఇలా తమ తమ వ్యక్తిత్వాలను ప్రతిబింబించేలా చేస్తారు.. మరి కొందరు గురించి మంచి లేదా వేరే ఏ ఇతర భావం ఐనా తమకు కన్పించింది లేదా అనిపించింది తమ తమ పరిచయ సంధర్భాల్లో మీరు పలానా,అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం, ఇలాంటి భావాలతో.... ఆ వ్యక్తి తమను ఎంతగా ఇన్స్పైర్ చేసారు......కొద్దిపాటి కావచ్చు లేదా ఎక్కువ మోతాదులో కావచ్చు..... పరిచయం తీరు ఇలా వుంటుంది కద.. ఇంతకీ నేను ఈ ఉపోద్ఘాతం ఎందుకు మొదలు పెట్టాను అనుకుంటున్నారా? నాకు చాలా మొహమాటం అన్ని విషయాల్లో.. నా ముందు ప్రొఫైల్ లో నన్ను నేను అస్తమిస్తున్న సూర్యుని తో పోల్చుకున్నాను..మరల ఉదయం వుంటుంది కదా అన్నారు పద్మ కళ గారు..అందుకే నేను నేనే అన్నాను.. . తెలుగు బ్లాగ్ మొదలు పెట్టి రెండు సంవత్సరాలు ఐన సరిగా నడపలేకపోయాను.సమయాభావం మరియు మరికొన్ని కారణాల వలన .. జ్యోతి గారు మంచి బ్లాగర్ అని తెలిసినా ఆమె ను కాంటాక్ట్ చేయగలిగే అవకాశం దొరకడం నా అదృష్టం అని భావిస్తూ,ఆమె సహకారం తో మరల బ్లాగ్గింగ్ మొదలుపెట్టాను..వారిద్దరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరో విషయం ,,అన్ని

బ్రతకడమా, జీవించడమా?

ఏమిటిది పిచ్చి ప్రశ్న అనుకుంటున్నారు కద.........ఒక్కసారి ఆలోచించండి.....ఇప్పుడు అర్ధమయిందా ఎందుకు అడిగానో.........సరే,నేనే చెప్తాను... బ్రతకడానికి,జీవించడానికి..నక్కకి,నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది....అందరం బ్రతుకుతున్నాము.ఉదయం నిద్ర లేచిన దగ్గరనుండి,రాత్రి పడుకునేవరకు...మరి ఇంకేమి కావాలండి? జీవించడం.....ఎలా? జీవించడానికి ఒక అర్ధం,పరమార్ధం కావాలి..అర్ధం అంటే నేనిక్కడ మీరు అనుకుంటున్నదే చెప్తున్నాను..మనిషికి కాసింత కళా,పోషణా ఉండాలి అంటారు రావుగోపాలరావుగారు ముత్యాల ముగ్గు సినిమాలో..మరి ఆ రెండూ ఎక్కడ లభిస్తాయండి అని అడిగితే డబ్బు కలవారి జవాబుకి,డబ్బు లేనివారి జవాబుకి వున్న తేడానే.....నక్కకి,నాగలోకానికి వున్నంత.. డబ్బు అంటాడు ఉన్నవాడు..చింకిచాప అంటాడు లేనివాడు...ఇదేమిటి అంటే......వ్యక్తి తనకున్న అవకాశాన్ని సద్వినియోగంచేసుకోవడం అన్నమాట..ఎవరి స్థానాల్లో వారు జీవించడానికి చేసే ప్రయత్నం అన్నమాట...సరే ఎలానూ డ్బ్బు విషయం వచ్చింది కద.ఒక రహస్యం చెప్పనా..ఆ,ఇది అందరికీ తెలిసిందే అంటారా.....ఐతే ఓ.కే... డబ్బు కొండమీది కోతినయినా తెస్తుందండి..మనిషిని అధః పాతాళానికి దిగిజారుస్తుంది... .. అధికారం కూ

మనమేనా...........?

మనం ఆనందంగానే వున్నాము...ఉంటున్నాము. కాని సునామీలు,ఆకస్మిక మరణాలు,ఆత్మహత్యలు,యాక్సిడెంట్లు,పేదరికం, అవి ఇవి అన్నీ మనల్ని అనుక్షణం కలవరపెడుతూనే ఉంటాయి.. మరి మనం ఆనందంగానే వున్నామా? జీవి సుఖాన్నే కోరుకుంటాడు. బస్సుల్లో,ట్రెయిన్సెలో రిజర్వేషన్లు ఎలాంటి శ్రమ లేకుండా పని జరిగిపోతే చాలు. అవకాశం లేనివారు ఆక్రోశిస్తారు గాని దొరికితే వదులుకుంటారా ఎవరయినా మనమేనా...........?

మనమేనా...........?

స్వేచ్చ కావాలి

ఈ వాక్యం ఒక స్నేహితురాలు ప్రస్తావించినపుడు నాకు ఆశ్చర్యం కలిగింది.. ఏమిటి ఈ కోరిక.. ఎందుకు అలా అనిపించింది? అని నాలో ఒక ప్రశ్నార్ధకం......... ఏం స్వేచ్చ? అంత లోతైనదా ఈ పదానికి అర్థం? ఎలాంటి స్వేచ్చ కావాలి? నా ఉద్దేశ్యంలో ........... *మనసుకి, ఆకాశంలో ఎగిరే పక్షీ తేడా ఏముంది? పక్షి రెక్కలు విప్పి ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. .మనసు రెక్కలు తొడిగి ఎక్కడెక్కడికో పయనం మొదలిడుతుంది. *మరి రెండింటికి పోలిక..........గాలికి వదిలామా ఆకాశమే నాది అంటాయి..మన చేతికి చిక్కనంటాయి..ఐన పయనం ఆగనంటాయి. మనసుని మాత్రం పగ్గం వేయకపోతే దారి తప్పిన భాటసారిలా అటు,ఇటు గమ్యం తెలియక విల విల లాడుతూ రోదిస్తుంది.... ఏదయినా కావాలి అని అనుకునే ముందు "అది ఎందుకు కావాలి?" అన్న ప్రశ్న వేసుకోగలగాలి.

ఈ పెద్దవాళ్ళు ఇంతే

మంచం మీద పడుకుని ఇంటిపై కప్పు వైపు చూస్తు తన ఆలోచనలో పడ్డ అత్తగారిని చూసాను.. రేపే తన ఊరి ప్రయాణం. ఆయన దించి వచ్చే ఆలోచన...అత్తగారి ఆలోచనలో సారాంశం నాకు తెలిసిందే.."నా ఇంటిలోనే నాకు స్వాతంత్ర్యం లేకుండా పోయిందే" అన్నభాధ...తన ఇద్దరు కొడుకుల దగ్గర ఏదో నెలా,రెండు నెలలు ఉండిపోతుండమే గాని పర్మినెంటుగా ఉండాలంటే ఇంకా ఒంట్లో ఓపిక ఉంది కద అంటారు.పుట్టి పెరిగిన నేల.వ్యవసాయ భూములు, స్వంత ఇల్లు, అన్నదమ్ముల రక్త సంబందికులు,అందరికి దూరంగా ఈ హడావిడి బ్రతుకులు,రణగొణ ధ్వనుల మధ్య,ఈ పట్టణ వాతావరణంలో వూపిరాడని బ్రతుకుల్లో ఉండలేకపోతున్నారు. ఇది ఈ ఒక్క తల్లి తండ్రి సమస్య మాత్రమే కాదు. ఎందరో....మరెందరో............ పసిపాపలుగా పుట్టీ, బాల్యావస్థ నుండి యవ్వనావస్థ చేరుకుని తమకంటూ ఒక సంసారం ఏర్పడిన తర్వాత ఆ కుటుంబం కోసం రేయీంబవళ్ళు శ్రమించి,అటు పిల్లల ఫీజులు,కుటుంబ ఖర్చులు చూసుకుంటూ, బంధువులు,భాధ్యతలు,పెళ్ళిళ్లు పేరంటాలూ చేసి చివరకు తమకంటూ మిగిలింది ఏమీ లేక వ్రుద్దాప్య ధశకు చేరుకునే ప్రతి తల్లి,తండ్రుల మనోవ్యధ ఇది..ఆర్ధిక, ఆరోగ్య స్థితి మెరుగ్గా వుండి తమని తాము చూసుకోగల వారి పరిస్థితి కొంత నయం. ఉం