ఈ పెద్దవాళ్ళు ఇంతే

మంచం మీద పడుకుని ఇంటిపై కప్పు వైపు చూస్తు తన ఆలోచనలో పడ్డ అత్తగారిని చూసాను..

రేపే తన ఊరి ప్రయాణం. ఆయన దించి వచ్చే ఆలోచన...అత్తగారి ఆలోచనలో సారాంశం నాకు తెలిసిందే.."నా ఇంటిలోనే నాకు స్వాతంత్ర్యం లేకుండా పోయిందే" అన్నభాధ...తన ఇద్దరు కొడుకుల దగ్గర ఏదో నెలా,రెండు నెలలు ఉండిపోతుండమే గాని పర్మినెంటుగా ఉండాలంటే ఇంకా ఒంట్లో ఓపిక ఉంది కద అంటారు.పుట్టి పెరిగిన నేల.వ్యవసాయ భూములు, స్వంత ఇల్లు, అన్నదమ్ముల రక్త సంబందికులు,అందరికి దూరంగా ఈ హడావిడి బ్రతుకులు,రణగొణ ధ్వనుల మధ్య,ఈ పట్టణ వాతావరణంలో వూపిరాడని బ్రతుకుల్లో ఉండలేకపోతున్నారు.

ఇది ఈ ఒక్క తల్లి తండ్రి సమస్య మాత్రమే కాదు. ఎందరో....మరెందరో............

పసిపాపలుగా పుట్టీ, బాల్యావస్థ నుండి యవ్వనావస్థ చేరుకుని తమకంటూ ఒక సంసారం ఏర్పడిన తర్వాత ఆ కుటుంబం కోసం రేయీంబవళ్ళు శ్రమించి,అటు పిల్లల ఫీజులు,కుటుంబ ఖర్చులు చూసుకుంటూ, బంధువులు,భాధ్యతలు,పెళ్ళిళ్లు పేరంటాలూ చేసి చివరకు తమకంటూ మిగిలింది ఏమీ లేక వ్రుద్దాప్య ధశకు చేరుకునే ప్రతి తల్లి,తండ్రుల మనోవ్యధ ఇది..ఆర్ధిక, ఆరోగ్య స్థితి మెరుగ్గా వుండి తమని తాము చూసుకోగల వారి పరిస్థితి కొంత నయం. ఉండడానికి తమకంటూ స్వంతఇల్లు లేక కొందరు, భర్త లేక భార్య కాలగతిని పొందిన వారు కొందరు, ఆర్థిక స్థోమత లేక మరి కొందరు.............వారి పరిస్థితి? దీనికి సమధానం ఎవరి దగ్గర ఉంది? ఎవరిని తప్పు పట్టగలము? ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది..మరల వ్రుద్దాప్యదశకు చేరుకొనే తర్వాతి తరం వారి పరిస్థితి ఇంతే....ఈ స్థితికి ఎవరు భాధ్యులు?

పాత తరంవారు క్రొత్త తరాన్ని మనస్పూర్తిగా ఆహ్వానించలేకపోవడమే ఇందుకు కారణమా?

ఎవరు మారాలి?

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

స్నేహంలో రకాలు

నాన్న మాట అమ్మకి వేదం