యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా....

"యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే  తత్ర దేవతా".. . స్త్రీ ఎక్కడ గౌరవింపబడుతుందో, అక్కడ దేవతలు నివాసం వుంటారు అని పురాణాలు , పెద్దలు పదే పదే  చెప్తూనే వుంటారు .  ఢిల్లీ ఒక్కటే కాదు, దేశం అంతటా స్త్రీ నిరాదరణకి గురి అవుతూనే వుంది ... ఎన్నో వుదాహరణలు .. అందరికీ తెలిసిన విషయమే . అయినా పరిస్థితి మారలెదు. ఎందరు గగ్గోలు పెట్టినా జరిగేది జరగక ఆగడం లేదు .. రెమిడీ ఏమిటో ఆలోచించే తీరిక ఎవరికీ లేదు ... కొందరి వల్ల మాత్రమే  సాధ్యం కానిది .. మార్పు కావాలి . మారాలి మారాలి అనుకోవడం లోనే జీవితం గడిచిపోతుంది ..కాని , హృదయ భారం మాత్రం మిగిలిపోతుంది .. ఇంతటి వుపోద్గాతం ఎందుకు అనుకుంటున్నారా .. ? ఒకరోజు రాత్రి ఒంటి గంటకి ట్రైన్ దిగి నేను ,మావారు స్టేషన్ బయటకి వచ్చాము . పేవ్మెంట్స్ మీద కొందరు నిరాశ్రయులు అక్కడక్కడా పడుకుని వున్నారు .. drainage మాన్ హోల్స్ కూడా వున్నాయి పైన ఎటువంటి కవర్స్ లేకుండా .. ఇవి మనకి ఆశ్చర్యకరమయిన   విషయాలు కాదు. . ఈ పడుకుని వున్న వారిలో ఒక చివరగా ఆడవారు కూడా వున్నారు .. ఎటువంటి క్షేమకరమైన పరిస్థితి కనబడలేదు.. సరి ఐన ఆచ్చాదన లేదు .... కారు చీకటి  .ఎక్కడి నుండో సన్నటి వెలుతురూ .. అంతే ... ఒకామె లేచి నిలబడి దిక్కులు చూస్తుంది .. బహుశా ప్రక్క సరిగా కుదరలేదా లేక చలి వేస్తుందా లేక మరే ఇతర కారణాలో .. నేను ఈరోజు చూస్తున్నాను .. వాళ్ళు రోజూ అక్కడే వుంది వుండవచ్చు కదా .. మనసు భారంగా తయారయింది .. ఆలోచనలు పరిపరి విధాలు... ట్రాఫిక్ incharges వుంటారు కదా . అదే దారిలో ఎందఱో పెద్దవాళ్ళు అంటే రాజకీయ నాయకులు వెళ్తూ వుంటారు కదా .. వారి దృష్టి వీరిమీద పడకుండా వుంది వుంటుందా .. వారిని తప్పు పట్టలేము అనేదానికి నా దగ్గర వుదాహరణలు వున్నాయి.. ఒక ఆశ్రమానికి మేము వెళ్ళినప్పుడు (వారికి ఏమి అవసరము వుంటాయో కనుక్కుని అవి కొని ఇద్దాము అని) వారితో మాటల్లో కొన్ని విషయాలు తెలిసాయి .. ఎవరైనా అనాధలు ఎక్కడైనా వున్నారు అని కబురు తెలిసి వీరు వెళ్లి వారిని తీసుకు వచ్చి ఆశ్రమం కల్పించ చూసినా రెండు మూడు రోజుల తర్వాత వాళ్ళు చెప్పకుండా పారిపోతున్నారు అని.    అది ఒక్కటే కాదు , మేము రామేశ్వరం యాత్రకి వెళ్ళినప్పుడు ఆగిన మా బస్ లోనికి ఒక ఇరవై ఐదు సంవత్సరాల వయసు గల స్లిమ్ గా అందంగా వున్న అమ్మాయి వచ్చి చేయి చాపింది .అప్పుడు మేము ఎందుకు నీకు ఈ పని.. మాతో రా .. నిన్ను చదివించి , మంచి పని ఇప్పించే ఏర్పాటు చేస్తాము .. లేదా పని పాటా చేసుకుని బ్రతుకుదువు గాని అని చెప్పాము .. వెంటనే ఆ అమ్మాయి - "నాకు ఈ జీవితమే బాగుంది. నాకు పని చేయాల్సిన అవసరం లేదు " అని బస్ దిగి వెళ్ళిపోయింది .. నాకు అర్ధం కాలేదు . మరోసారి జన్మభూమి ఎక్స్ప్రెస్ లో   ఒక ఏడు సంవత్సరాల అమ్మాయి రింగ్ తో జిమ్మిక్స్  చేయడం మొదలుపెట్టింది .. నా దగ్గర వున్న ఇడ్లి ఇచ్చాను ..ఎంతో ముద్దుగా పోనీటైల్ వేసుకుని వుంది .  దగ్గరకి పిలిచి  "మా ఇంటికి రా నిన్ను పెంచుకుంటాము .. చదువుకుందువు  గాని" అని అడిగాను.. అమ్మో , వద్దు అని పారిపోయింది అక్కడ నుండి    .  ఏమిటిది ? కష్టపడడానికి ఇష్టపడడం లెదు. బిక్షాటన సాధు  లక్షణం అని చెప్తారు కదా .. వీళ్ళు సాధువులా లేక వీరి కర్మానుసారం ఇలా జీవితం గడుపుతున్నారా ? అని ఎన్నో ప్రశ్నలు మదిలొ. . పాపి పేట్ అని హిందీ లో అంటూ వుంటారు .. ఆ పొట్ట కోసమే ఐతే మనం తెల్లవారి లిచిన దగ్గర నుండి కష్టపడి పనిచేసే కన్నా ఈ పని ఏదో బాగానే వుంది కదా. తిని పడుకోవచ్చు కదా .. ఏమిటి ఈ ఆలోచనలు అనకండి .. అది అంతే  ..  కారణం  ఏది ఏమైనా స్వేచ్చా జీవితాలు అనిపించిది ... అది నిజమేనా ...   వీళ్ళది స్వేచ్చాజీవితం సరే పేవ్మెంట్ మీద వారి సంగతి ఏమిటి ? వారూ అంతేనా .. నా ప్రశ్నలకి సమాధానం దొరకడం లేదు . కారణం ఏమిటంటే , రైల్వే ఫ్లాట్ఫారం మీద ఒక సిమెంట్ దిమ్మ మీద కూర్చుని బహుశా షుగర్ వ్యాధి వల్ల కాళ్ళు రెండూ గాయాలై రక్తము ,చీము కారుతూ సహాయం కోసం ఏడుస్తూ తెలుగు మాట్లాడలేక హిందీలో ప్రాదేయపడుతున్న ఆమె నా కళ్ళ ముందు మెదుల్తూనే వుంది .. ట్రైన్ కదిలిపోతూ వున్న సమయం లో ఫ్లాట్ఫారం మీద పరుగుతో వెళ్లి ట్రైన్ అందుకున్న నా మనసు ఈనాటికీ దిగాలు పడుతూనే వుంది . ఆగిపోవడానికి లేదు . ఆ సమయంలో మా నాన్నగారు చనిపోయారని పరుగుపెట్టాను .. మానసిక స్థితి సరిగా లేని స్త్రీ ని కూడా తల్లిని చేసి రోడ్ల మీద వదిలేసినా ఉదాహరణలు ఎన్నో.. ఇంటిలో క్షేమ స్థితిలో వుంది క్షోభ పడే వారి గురించి నేను మాట్లాడను ...    












      ..     .      

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం