పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2011లోని పోస్ట్‌లను చూపుతోంది

నా మనోగతం

అందరికి నా నమస్కారాలు.. నా మనసు కలతతో నిండి వుంది.. అది అలా వుండకూడదని తెలుసు .. ఎందుకంటే కష్టాలని కూడా సుఖంగానే తీసుకుంటాను కాబట్టి...కాని....ఈ నాటి నా పరిస్థితి వేరు.....అందుకే నా ఈ పరిస్థితిని మీకు వివరించాలని...... ..................  అమ్మ మౌనంగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళేది..  భర్త ,5గురు పిల్లలు, తన తమ్ముడు, అడపడుచు కుమారుడు.... ఇంతమందికి వంటలు చేస్తూ...పూజలు, పండగలు, తెల్లని మేని చాయతో ఒక పద్దతిలో........ తన తల్లి తన 5 సంవత్సరాల వయస్సులో గతిస్తే, తండ్రి తనకి మొదటి సంతానం కలిగిన తర్వాత కాలగతి చెందారు.. నాన్నగారి తరపు వారితో ఇమిడీ , ఇమడలేక, భర్త దగ్గర మాత్రమే తన కోపతాపాలు, తన గురించి నాకు అంతకుమించి తెలిసే అవకాశం లేదు. కారణం ఒక్కటే....నా మౌనం....ఆ మౌనంలో ఏ భావాలూ వుండేవి కావు.ఏ ఆలోచనలూ వుండేవి కావు. పుస్తకం ఒక్కటే వుండేది.. ఏ పుస్తకమైనా, ఒక చిరిగిన కాగితమైనా దానిలోని అక్షరాల వెంట మాత్రం నా కళ్ళు పరుగులు తీసేవి. . అమ్మా అని పిలిచిన గుర్తులేదు. ఆకలి అని అడిగిన గుర్తులేదు. . నా పని నేను చేసుకుంటూ పెట్టినది తినడం గుర్తుంది.. ఎవరైనా మొహంలో లక్ష్మి కళ వుంది అన్నపుడు ఒక