పోస్ట్‌లు

తిరస్కృతి

నిర్ణయం మనదే  .....  సున్నితంగా తిరస్కరించడం - మనం మనకి ఎంత శక్తి వుందో అంత మేరకే వినియోగించుకోగలగడం ,చేయలేని పనిని మృదువుగా తిరస్కరించడం ముఖ్యం . There is no substitute for hardwork.. కష్టపడి పని చేయగలగడం ఒక అదృష్టం .. కానీ వారానికి ఒకసారి విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యమైన అంశం .. తిరిగి కోల్పోయిన శక్తిని సంపాదించుకోగలము ... పిల్లలను చూసి నేర్చుకోవలసినవి ఎన్నో... అన్నింటికన్నా నాకు నచ్చిన విషయం " వాచీ " ని ఒకరోజు మన దగ్గర లేకుండా గడపగలగడం .. అది సాధ్యమే .. ఐతే, మొబైల్ లేకుండా ఒక్క గంట గడపగలగడం ---- చాలా పెద్ద విషయం ఈరొజుల్లొ.. రాబిన్ శర్మ ఈ పుస్తకం వ్రాసిన రోజుల్లో మొబైల్ వుండి  వుండదు కదా .. చిన్న పిల్లలు అల్లరి చేయకుండా వుండాలి అనుకునే పేరెంట్స్ వాళ్ళ చేతుల్లో ఒక మొబైల్ ఇచ్చెస్తున్నారు.. వీడియో గేమ్స్ కి అలవాటు  చేస్తున్నది  కూడా   తల్లిదండ్రులు మాత్రమే .. ప్రతి ఒక్క విషయానికీ లాభనష్టాలను భేరీజు వేస్తుంటాము మనం .. మొబైల్ వాడకం వల్ల లాభం కన్నా నష్టాలు ఎక్కువగా వున్నాయి అని నెత్తి నోరూ కొట్టుకుంటున్నా పట్టించుకోము .. అందుకే అన్నది మార్పు కావాలి అని. ఎటువంటి మార్పు కావాలి
ప్రశ్న అవసరం....    సమాజ సేవకు  డబ్బు  అవసరమా అని ప్రశ్న ... డబ్బు మనిషి  కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతుంది .. అది ఒక సపోర్ట్ ...  వుద్యోగం స్త్రీ తన భాద్యతలను మరింత సంతృప్తి కరంగా పూర్తి  చేయడానికి దోహద పడుతుంది   మా ఇంటికి అద్దెకు ఇల్లు కావాలి అని ఒకామె వచ్చారు .. తనని తాను    పరిచయం చేసుకుంటూ ఒక సమాజ సేవకురాలిగా చెప్పుకున్నారు ..నేను చాలా చాలా సంతోషం ఫీల్ అయ్యాను ... అంతలో  తనతో వచ్చిన హేల్పర్    " అవునమ్మా ,  మాకు ఏది అవసరం  వున్నా అమ్మగారి దగ్గరకు పరుగెడతాము ... మాకు ఇళ్ళు  కాలిపోయినప్పుడు కూడా ఏంతో  సహాయం చేసారు.. నెల నెలా సమయానికి వడ్డీ కట్టేస్తే చాలు అసలు నెమ్మది మీద ఇవ్వవచ్చు . తొందర పెట్టరు---- "   అని ఆమె గురించి గొప్పగా చెప్పింది ... నాకు  నుండి నీరు కారిపోయినట్లు ఐపోయింది .. ఇప్పటికీ  మరచిపోలేను అ మాటలు .. సమాజ సేవ అంటే వడ్డీ వ్యాపారమా  ???????     పేరుకు పేరు , ఆదాయానికి ఆదాయం ........   పేద ప్రజలు  నూతిలో కప్పలా  ..............   
సేనయోరుభయోర్మధ్యే రధం స్థాపయా మీ>చ్యుత. యావదేతాన్నిరీక్షే>హం  యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా  సహా యోద్ధవ్యమస్మిన్  రణసముద్యమే . అర్జునుడు - ఓ కృష్ణా ! ఈ యుద్ధారంభమునందు నేనెవరితో పోరుసల్పవలయునో , అట్టి ఈ యుద్ధాభిలాషులను ఎచటినుండి నేను చక్కగా జూడగల్గుదునో రెండు సేనల   మధ్య అచ్చోట నా రధమును నిలబెట్టుము . అని శ్రీకృష్ణ పరమాత్మునితో చెప్పెను . వ్యాఖ్య - శత్రువులతో తలపడుటకు ముందుగా, శత్రు పక్షమున ఎందరు కలరో ,ఎవరెవరు కలరో, వారందరూ ఏ ప్రకారముగా ఉన్నారో అంతయు గమనించుట ఉత్తమ యోధుని లక్షణము . కనుకనే అర్జునుడు వారలను చక్కగా చూచుటకై రధమును ఉభయ సేనల మధ్యకు తీసుకు పొమ్మని శ్రీకృష్ణునికి చెప్పెను .. "నేను" అనబడు ఈ ఆత్మ కు ఉపాధి కల్పించిన ఈ శరీరం మనకు దేవాలయం . దానిని ఒక యుద్ధరంగం గా కూడా చిత్రీకరించవచ్చును .. యుద్ధరంగం మధ్యలో అంటే పద్మవ్యూహంలో నిలబడిన ఆత్మ తన చుట్టూ అల్లబడిన,నిలబెట్టబడిన సైనికులను ఏ విధంగా ఛేదించుకుని పరమాత్మను చేరగలదో ఆ యుద్ధమే మహాభారత యుద్ధం ..ఆత్మను పంచపాండవ స్వరూపంగా భావిస్తే ,అరిషడ్వార్గాలు అనబడే కౌరవులు  ఆ ఆత్మను చుట్టి అనుక్షణం నరకం చూపిస్తూ  ఉంటాయి అనడంలో
ఎవరిని చూసి , ఏ బంధుజనాన్ని చూసి మనసు వికలము కాబడుతుందో ఆ బంధుజనం ముందు అర్జునుని నిలబెట్టాడు శ్రీకృష్ణుడు.. ఎంత కఠినతరమైన అవస్థ అది ? గీతోపదేశమునకు క్షేత్రం అక్కడే తయారగుచున్నది . . ఇక్కడ మనస్సు అర్జునుడిగా , అరిషడ్వార్గాలు మనయొక్క బంధుజనంగా భావించినటులైన మన శరీరం గొప్ప యుద్ధక్షేత్రంగా మారుతుంది ..కౌరవులు అన్నివిశాలా పాండవులకు అపకారమే చేశారు .. వారికి దక్కవలసిన రాజ్యం లాక్కొని కూడా నానా హింసలకు గురి చేశారు .. బుద్ధినాశాత్ప్రణశ్యతి -బుద్ధి చేసినచో మనుష్యుడు చెడిపోవును,. నశించిపోవును అని గీతలో ఆ శ్రీకృష్ణపరమాత్ముడు చెప్పి ఉన్నాడు. ..దీనిని బట్టి ఎవరెవరి బుద్ధి శుద్ధత్వము లేక అవగుణాలతో కూడి ఉండునో,అట్టివారు జీవితరంగమున దుర్యోధనుని అపయశస్సు,అపజయం,వినాశం తప్పక పొందగలరు . ఇటువంటివారి సాంగత్యంలో ఉంది దుర్యోధనునికి ప్రియం చేయు వారందరూ యుద్ధరంగమున ఉన్నారు . పాపమును ప్రోత్సహించుట మహాపాపం . అందువల్ల దుర్యోధనుని వంటి దుర్భుద్ధి గల వారిని ఆశ్రయించడం గాని ,ఆతని పక్షాన గాని నిలవడం ఎప్పటికీ తగదు .. నిద్రను జయించినవాడు, తమోగుణాన్ని నిర్జించిన వారు ఉత్తములుగా చెప్పబడతారు . ఏ స్వజనమును చూసి అర్జునుడి

మహాభారతయుద్ధం

సేనయోరుభయోర్మధ్యే రధం స్థాపయా మీ>చ్యుత. యావదేతాన్నిరీక్షే>హం  యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా  సహా యోద్ధవ్యమస్మిన్  రణసముద్యమే . అర్జునుడు - ఓ కృష్ణా ! ఈ యుద్ధారంభమునందు నేనెవరితో పోరుసల్పవలయునో , అట్టి ఈ యుద్ధాభిలాషులను ఎచటినుండి నేను చక్కగా జూడగల్గుదునో రెండు సేనల   మధ్య అచ్చోట నా రధమును నిలబెట్టుము . అని శ్రీకృష్ణ పరమాత్మునితో చెప్పెను . వ్యాఖ్య - శత్రువులతో తలపడుటకు ముందుగా, శత్రు పక్షమున ఎందరు కలరో ,ఎవరెవరు కలరో, వారందరూ ఏ ప్రకారముగా ఉన్నారో అంతయు గమనించుట ఉత్తమ యోధుని లక్షణము . కనుకనే అర్జునుడు వారలను చక్కగా చూచుటకై రధమును ఉభయ సేనల మధ్యకు తీసుకు పొమ్మని శ్రీకృష్ణునికి చెప్పెను .. నేను అనబడు ఈ ఆత్మ కు ఉపాధి కల్పించిన ఈ శరీరం మనకు దేవాలయం . దానిని ఒక యుద్ధరంగం గా కూడా చిత్రీకరించవచ్చును .. యుద్ధరంగం మధ్యలో అంటే పద్మవ్యూహంలో నిలబడిన ఆత్మ తన చుట్టూ అల్లబడిన,నిలబెట్టబడిన సైనికులను ఏ విధంగా ఛేదించుకుని పరమాత్మను చేరగలదో ఆ యుద్ధమే మహాభారత యుద్ధం  ..ఆత్మను పంచపాండవ స్వరూపంగా భావిస్తే , అరిషడ్వార్గాలు అనబడే కౌరవులు  ఆ ఆత్మను చుట్టి అనుక్షణం నరకం చూపిస్తూ  ఉంటాయి అనడంలో ఏ మాత్రం
చిత్రం
ఓం వేంకటేశాయ నమః !! నేను తెలుగు.వన్ నుండి సంగ్రహించిన వైకుంఠ ఏకాదశి విశిష్టత ను బ్లాగ్ లో పోస్ట్ చేస్తున్నాను ..  వెంకటాద్రి సముస్థానం బ్రహ్మాండే నాస్తికించితః .వేంకటేశ నమోదేవ న భూతే న భవిష్యతి !!  
చిత్రం
విఘ్నేశ్వరా ! సమస్త జీవులకు ఆధారభూతుడగు ఆ పరమశివుని పుత్రుడవు ..పార్వతీ తనయుడవు ,  కరుణామూర్తివి .. నిరంతరం మా చిత్తము సర్వకాల సర్వావస్థల యందు నీ పాదారవిందముల యెడ నిమగ్నమై , అచంచలమైన భక్తితో కూడి యుండి, మనో వాక్కాయ కర్మలచే మా వలన ఎవరికీ అపకారం జరగకుండునట్లు ను, నిర్మలమైన మనస్సును కూడి వుండి  నిరంతరం నీ ధ్యానములో వుండి ,జ్ఞాన సంపత్తిని కలిగి వుండే సామర్ధ్యములను  కలిగించువాడవై మమ్ము ఆశీర్వదించి మా యెడ దయ చూపుమయా తండ్రీ .......      వ్యాఖ్యను జోడించు                                            సర్వేజనా సుఖినోభవంతు  

ప్లాటినం వుదయం ..........

మనిషే మనిషికి శత్రువు........... అని  పదే పదే మన చుట్టూ జరిగే సంఘటనలు మనకి నిత్యం గుర్తు చేస్తుంటాయి .  మనలని కదిలించేస్తుంటాయి .. మనసులు వికలమై పోతుంటాయి .. మన పరంగా కావచ్చు లేక ఇతరుల పరంగా కావచ్చు .. ఆఫ్ట్రాల్ మనం మనుషులమే ... ఇటువంటి సంఘటనలు మన కొత్త వుదయాన్ని ఆనందంగా మార్చవు .. కానీ మార్చుకోవాలి . మనం ఆ సామర్ధ్యాన్ని పెంచుకోగలగాలి .. అందుకే నిద్రలేవగానే మన అరచేతులు చూసుకోమని ,దైవాన్ని ప్రార్ధిస్తూ లేవమని ఇలా ఎన్నో జాగ్రత్తలు చెప్తూ వుంటారు పెద్దలు.. వాటిని కొట్టి పారేయలెము. నిన్నటి ఆనందకర ఘటనలు మనల్ని ఈరోజు కూడా సంతోషంగా వుంచగలవు గలవు గాని, విషాదకర సంఘటనలు  మనల్ని కొన్నిరోజులు కలచివేస్తాయి .. అది మన అనారొగ్యానికి దారితీస్తుంది కూడా   . అందుకే కొత్తరోజును ఆనందంగా ఆహ్వానించండి అన్న కాన్సెప్ట్ ఈ పుస్తకంలో కనిపిస్తుంది . నిద్ర లేచిన మొదటి 30  నిమిషాలను ప్లాటినం గా రచయిత  వర్ణించారు .. ఆ మొదటి 30 నిమిషాల ప్రభావం మనం గడపబోయే రోజు మొత్తం మీద ప్రతి క్షణం ఎంత విలువతో గడుపుతారు అన్న దానిపై ఆధారపడి వుంటుంది అని తెలిపారు .. ఇది నిజమే అనడానికి ఒక చిన్న వుదాహరణ ... మా ప్

భారతీయం: ఇక ఐదవ విషయం ఏమిటంటే, వ్యక్తిగతంగా మనమేమిటి అని తె...

భారతీయం: ఇక ఐదవ విషయం ఏమిటంటే, వ్యక్తిగతంగా మనమేమిటి అని తె... : ఇక ఐదవ విషయం ఏమిటంటే, వ్యక్తిగతంగా మనమేమిటి అని తెలుసుకోవడం .. దానికి రెండు మార్గాలు. ఒకటి నిరంతరం మనలోనికి మనం చూసుకోవడం, అంటే మనల్ని మనం...
ఇక ఐదవ విషయం ఏమిటంటే, వ్యక్తిగతంగా మనమేమిటి అని తెలుసుకోవడం .. దానికి రెండు మార్గాలు. ఒకటి నిరంతరం మనలోనికి మనం చూసుకోవడం, అంటే మనల్ని మనం విశ్లెశించుకొవడం.ఇక రెండవది మనరోజు వారీ అనుభవాలను, దానినుంచి నేర్చుకున్న పాఠాలను ఒక పుస్తకం లో(డైరీ ) వ్రాసుకోవడం .. ఈ పద్దతులు మన వ్యక్తిగత కార్యకలాపాలకు, వూహాశాక్తికి , జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి ఏంతో  దొహదపడతాయి.. ఆరవది- నిజాయితీని పెంపొందించుకోవడం - ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం . సరళతరంగా వుండే విషయాలని సంక్లిష్టంగా మార్చుకోకుండా వుండడం , మనం మనకి ఇచ్చుకున్న మాటని నిలబెట్టుకోకపోవడం . వుదాహరణకి, కొత్త సంవత్సరం రాబోతుంది అంటే నేను చేయబోయే అంటే నా నెక్స్ట్ ఇయర్ కి సంబందించిన కార్యకలాపాల ప్రణాళిక లేక నేను ఇలా వుండాలి అన్న ఒక resolution ఫాలో కాకపొవదమ్. నన్ను నేను మార్చుకొలెకపొవడం. వున్దకోదదు.. మనం అనుకున్నది చెయగలగాలి.. ఒక మంచిమాట ఈ సందర్భం గా -- వుపకారం చేయకపోయినా పర్వాలెదు. అపకారం చేయాలన్న తలంపు లేకుండా వుంటే చాలు.. చూసారా తలంపు వుంటే మనసు లాగుతూ వుంటుంది కద.. అందుకే తలంపు లేకుండా వుండాలి అన్నది. మా నాన్నగారు ఎంత  నిజాయితీ పరులు