పోస్ట్‌లు

జనవరి, 2011లోని పోస్ట్‌లను చూపుతోంది
యోగి ఉత్తమమైనవాడు. యోగి జన్మ శ్రేష్టమైనది.. జ్ఞాని కంటే యోగి గొప్పవాడుగా తెలియజేయబడింది.. కర్మయోగి కార్యశూరుడుగను, భక్తియోగి ప్రేమ మార్గముని పాటించవాడుగను, రాజయోగి అంతశ్శక్తి గలవాడుగను, జ్ఞానయోగి తత్త్వమార్గదర్శకుడుగను వుండును.. సాధకుడు యోగఫలితములను పొందలేకపోవుటకు కారణము విషయ, వస్తు, శబ్ద, భోగ రాహిత్యముతో పాటు, సాధన యందు అనాసక్తిని పెంపొందించుకోలేకపోయిన వాడు అనాసక్తయోగిగను, పుణ్యపాపములు లేనివాడు, విగతకల్మషుడు, బ్రహ్మ స్వరూపుడై నిత్యానందమును అనుభవించువాడు అగామ్యయోగి యని  పిలువబడుతున్నారు.... పరబ్రహ్మయే ప్రధమయోగి.. "ఋష్" అను ధాతువు నుండి ఋషి అను శబ్దం ఉద్బవించింది. ముని అనగా మననశీలుడు... ఎల్లప్పుడూ పరమాత్మయందు లీనమై, పరమాత్మనే మననం చేయువాడు ముని.. దేవలోకమును నివసించు ఋషులు దేవర్షులు. వారిలో ప్రముఖులు.... 1. నరనారాయణులు (ధర్ముని పుత్రులు) 2. వాలి ఖిలులు (క్రతు కుమారులు) 3. కర్ణముడు 4. పర్వతుడు 5. నారదుడు (పై ముగ్గురు పులహ సుతులు) 6. అసితుడు 7. వత్సలుడు 8. వ్యాసుడు సనకాదులు నలుగురు... సనక, సనందన, సనాతన, సనత్ కుమారులు.. వీరు కూడా బ్రహ్మ మానస పుత్రులే. మనువులు పద

మనోయోగ సాధన........

మౌనంగా వుండడం చాతకానితనం కాదు. బడబడా మాట్లాడడం గడసరితనం కాదు.. మౌనంగా వుండేవారు అంతర్లీనంగా ఆలోచనా శక్తితో నిండి ఉంటారు. అవి ఎదుటివారిని ఇబ్బంది పెట్టవు. వారు అలాగే ఆనందంగా వుంటారు. గబగబా మాట్లాడెవారు తొందరలో మాట్లాడే మాటలు ఎదుటివ్యక్తిని బాధపెట్టవచ్చు. ఇబ్బందుల్లో పడవేయవచ్చు.. వీరికి ఆలోచనా శక్తి తక్కువగా ఉంటుంది. పుస్తకాలంటే అమితమైన ఇష్టం ఉన్న నేను ఈనాటివరకూ భగవద్గీతను పూర్తిగా చదవలేకపోయాను. కాని నా కర్మను నేను ఏనాడూ విడిచిపెట్టలేదు. జరిగేది గమనిస్తూ వుంటాను. కష్టపడడానికి ఇష్టపడతాను. అలా అని నాలో అంతర్లీనంగా దాగి ఉన్న ఆనందాన్ని విడిచిపెట్టను.. ఎన్ని పుస్తకాలు చదివినా ఏదో వెదుకులాట.. చివరకు నాకు దొరికిన పుస్తకం "యోగసాధన,  మనోయోగదర్శనం"..రచన..రాజీవ్ గాంధీ ఎక్స్ లెన్స్ అవార్డు గ్రహీత భారతజ్యోతి ఆచార్య డా//యోగశ్రీ గారు. 1910 వ సంవత్సరంలో ప్రారంభమైన కుండలినీ యోగం 2010 నాటికి నూరేళ్ళకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంతవరకూ వెలుగు చూడని కుండలినీ యోగంపై రచించిన పుస్తకం ఇది. సహజంగానే ధ్యానసాధన మొదలుపెట్టిన మానవునికి కుండలినియోగం గురించిన విషయంలో ఆసక్తి వుండడం పరిశీలనలోకి వచ్చిం

భారతీయం: ధ్యానమార్గం

భారతీయం: ధ్యానమార్గం : "సామాన్యం గా మనం చిన్నపిల్లలనుండి పెద్దవారి వరకూ అడిగే కామన్ ప్రశ్న....'పెద్ద ఐతే ఏం చదువుదామని అనుకుంటున్నావు ? లేదా ఏం చేద్దామనుకుంటున్నావు..."

ధ్యానమార్గం

సామాన్యం గా మనం చిన్నపిల్లలనుండి పెద్దవారి వరకూ అడిగే కామన్ ప్రశ్న...."పెద్ద ఐతే ఏం చదువుదామని అనుకుంటున్నావు ? లేదా ఏం చేద్దామనుకుంటున్నావు"  అని.. కద...ప్రశ్న ఎలా అడిగినా దాని అర్ధం ఒక్కటే.. లక్ష్యం...అంటే "నీ లక్ష్యం ఏమిటి " అని అడగడం అన్నమాట.. మళ్ళీ ఇంకో ప్రశ్న కూడా వేస్తాము. "నీ లక్ష్యసాధనకు ఏం చేస్తావు" అని.  చిన్నపిల్లలైతే అలా చదువుతాను, ఇలా చదువుతాను అని తమ ప్రణాళిక చెప్తారు. పెద్దవాళ్ళు ఐతే వారి ఆలోచనలు పంచుకుంటారు. కద. ..సహజంగానే మనం మెచ్చుకుంటాము..మరి మనం చదువుకుని, ఉద్యోగాలు చేసి మనల్ని మనం బ్రతికించుకోవడానికి ఇన్ని ప్రణాళికలు అవసరం ఐనప్పుడు, మనల్ని జీవింపజేసుకోవడానికి ఇంకెన్ని ప్రణాళికలు అవసరం అవుతాయి.. ఏమిటిది, బ్రతకడం, జీవించడం అని వేరు, వేరుగా చెప్తున్నారు అంటున్నారా ? ఒక మొక్కకి నీరు పోస్తే అది బ్రతుకుతుంది. కాని దానికి ఎండ వేడిమి, ఇతరత్రా మినరల్స్ దొరికితే పూలూ. పళ్ళతో మన మనసుల్ని పులకరింపజేస్తుంది..ఆనందభరితుల్ని చేస్తుంది కద.  ఇలాంటి ఎన్నో మొక్కలు, వృక్షాలు ప్రకృతికి జీవం పోస్తాయి కద. నా మాటల్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి.. బ్ర

నేనింతే.......

ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా  ప్రతిక్షణం ఆనందంగా వుంటాను.. ఎలా సాధ్యమైంది అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను..మూడు కారణాలు తెలిసాయి. మొదటి కారణం........ నిరంతరం బాబా నామస్మరణ .. రెండవ కారణం... అందరిలోని మంచితనాన్ని మాత్రమే చూడగల్గడం...మూడవది...మధురమైన ఘటనలు మాత్రమే స్మృతికి తెచ్చుకోవడం.... దీనికి మావారు నాకిచ్చిన బిరుదు...... ."నువ్వసలు మనిషివైతేగా".. నవ్వేసాను హాయిగా..

ఎందరో రచయత(త్రు)లు..అందరికీ నా అభివందనాలు. ముందుగా కదంబమాల అనే సిరీస్ ని మొదలు పెట్టిన జ్ఞానప్రసూన గారికి నా నమస్కారాలు.. ఈ ఒరవడిలో నేనూ వున్నాను అని చేసిన నా యీ చిన్నిప్రయత్నాన్ని మీ ముందు ఉంచుతున్నందుకు ఆనందిస్తున్నాను..

ఈ ప్రయత్నం సఫలం కావాలంటే మీరు   సుభద్ర గారు   వ్రాసిన కథ చదివి రావాలి మరి... కదంబమాల___ "అమ్మా, అనితా... అనితా" అన్న నారాయణమ్మ గారి కేకలకి పరుగున వెళ్ళిన సరోజిని అక్కడి దృశ్యం చూసి నిశ్చేష్టురాలై నిలబడిపోయింది కొన్ని క్షణాలు.. వెంటనే తేరుకుని వంటింట్లోకి పరుగెత్తి గ్లాసుతో నీళ్ళు తీసుకుని వచ్చి అనిత మొహం పైన చిలకరించింది. కొన్ని క్షణాల తర్వాత తేరుకున్న అనితని  "ఏమయిందిరా" అని అడిగిన శ్రీరాం గారిని చూసి బోరున ఏడ్చేసింది.. "అయ్యో,అయ్యో..నేనప్పుడే చెప్పాను.. పిల్ల అర్బకురాలు. ఈ మాయదారి చదువులు వద్దు అని. విన్నారా ఎవరైనా. ఇప్పుడు చూడండి ఎలా ఏడుస్తుందో". అని నారాయణమ్మ గారు గోల చెయ్యడం మొదలుపెట్టారు. అబ్బా.. నువ్వుండవే.. నన్ను మాట్లాడనీ.. విషయం కనుక్కోనీ" అని చిన్నగా  నారాయణమ్మ గారిని మందలించి, "అనితా! ఇలా చూడమ్మా. ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు సమాజంలో ఒక బాగం ఐపోయాయి. న్యూక్లియర్ కుటుంబ వ్యవస్థను ఒకందుకు ప్రోత్సహిస్తే,అది ఈనాటి సమాజాన్ని పెడత్రోవ పట్టిస్తుంది. అలా అని అన్ని కుటుంబాలూ అలానే వున్నాయి అని కాదు నా ఉద్దేశ్యం. చరిత్రను, సమాజాన్ని