పోస్ట్‌లు

జూన్, 2015లోని పోస్ట్‌లను చూపుతోంది

భారతీయం: యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా....

భారతీయం: యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా.... : "యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే  తత్ర దేవతా" .. . స్త్రీ ఎక్కడ గౌరవింపబడుతుందో, అక్కడ దేవతలు నివాసం వుంటారు అని పురాణాలు , పెద్దలు ...

యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా....

"యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే  తత్ర దేవతా" .. . స్త్రీ ఎక్కడ గౌరవింపబడుతుందో, అక్కడ దేవతలు నివాసం వుంటారు అని పురాణాలు , పెద్దలు పదే పదే  చెప్తూనే వుంటారు .  ఢిల్లీ ఒక్కటే కాదు, దేశం అంతటా స్త్రీ నిరాదరణకి గురి అవుతూనే వుంది ... ఎన్నో వుదాహరణలు .. అందరికీ తెలిసిన విషయమే . అయినా పరిస్థితి మారలెదు. ఎందరు గగ్గోలు పెట్టినా జరిగేది జరగక ఆగడం లేదు .. రెమిడీ ఏమిటో ఆలోచించే తీరిక ఎవరికీ లేదు ... కొందరి వల్ల మాత్రమే  సాధ్యం కానిది .. మార్పు కావాలి . మారాలి మారాలి అనుకోవడం లోనే జీవితం గడిచిపోతుంది ..కాని , హృదయ భారం మాత్రం మిగిలిపోతుంది .. ఇంతటి వుపోద్గాతం ఎందుకు అనుకుంటున్నారా .. ? ఒకరోజు రాత్రి ఒంటి గంటకి ట్రైన్ దిగి నేను ,మావారు స్టేషన్ బయటకి వచ్చాము . పేవ్మెంట్స్ మీద కొందరు నిరాశ్రయులు అక్కడక్కడా పడుకుని వున్నారు .. drainage మాన్ హోల్స్ కూడా వున్నాయి పైన ఎటువంటి కవర్స్ లేకుండా .. ఇవి మనకి ఆశ్చర్యకరమయిన   విషయాలు కాదు. . ఈ పడుకుని వున్న వారిలో ఒక చివరగా ఆడవారు కూడా వున్నారు .. ఎటువంటి క్షేమకరమైన పరిస్థితి కనబడలేదు.. సరి ఐన ఆచ్చాదన లేదు .... కారు చీకటి  .ఎక్కడి నుండో సన్నటి వెలుతురూ