పోస్ట్‌లు

సెప్టెంబర్, 2010లోని పోస్ట్‌లను చూపుతోంది

జీవో ఔర్ జీనేదో

ఒక స్త్రీ కి కావలసినదేమిటి ? తను ఏది కోరుకుంటే అదే చేయగల స్వేచ్చ ఇస్తే సరిపొతుందా ? దానికే స్వేచ్చ అని పేరు పెడితే తెల్లవారి లేచిన దగ్గరనుండి రాత్రి పడుకొనేవరకూ చీరలు,నగలు అని కలలు కంటూ, వాటికోసం భర్తను సాధించే వారిని ఎంతోమందిని చూస్తున్నాము.. అందరూ అలా వుండరు, లేకుండా కూడా లేరు..ఇది ఒప్పుకోవాల్సిన విషయం.. షాపింగ్ మాల్స్ ఎన్ని చూడడం లేదు...కాని శారీరకంగా గానీ,మానసికంగా గాని మగవారికి ఏమాత్రం తీసిపోని ఒక స్త్రీ బాంధవ్యాల దగ్గరకొచ్చేసరికి తనను తాను మలచుకుంటూనే తన వారిని నడిపించే విషయానికొచ్చేసరికి బలహీనురాలిగా ఎందుకు తయారవుతుంది..? ఆమె ఏం కోరుకుంటుంది ? నా బార్య నా మాట జవదాటరాదు అనుకునే భర్తను కోరుకుంటుందా ? లేదండి......అలా ఏ బార్యా కోరుకోదు...కాని భర్త ప్రేమతో గీస్తే, లక్ష్మణరేఖను దాటాలని ఏ స్త్రీ కూడా కోరుకోదు ..ఒక సెక్యూరిటి కోరుకుంటుంది..నేనున్నాను అనే ఒక అండ కోరుకుంటుంది..పిల్లలకు అన్నీ సమకూరుస్తూనే వారి ప్రేమ ఆశిస్తుంది.. వీటన్నింటితో పాటు "నేను" అన్న ఒక గుర్తింపు కోరుకుంటుంది..(అందుకే తన వంట కొత్త కాకపోయినా ప్రతిరోజు ఇంట్లోవారి మెప్పుకోలు పొందాలని ఆశిస్తుంది) వంటగద
అమెరికాలో చదువు ఎందుకురా? డాలర్లే,డాలర్లు.........ఇదండి సమధానం... నిన్న మావారు ఇంటికి వచ్చి వినిపించిన ఒక కధనం నా మనసులో ఈ చెత్తకధకి నాంది.. మాకు తెలిసినవారి అబ్బాయిని అమెరికా పంపడం కోసం ఇంకా కనీసం నివాసయోగ్యంగా కూడా కట్టని ఓ ఇల్లు తాకట్టు పెట్టి. అక్షరాలా ఇరవై ఐదు లక్షలు (తల్లి తపన తన కొడుకు అమెరికా వెళ్ళాలని) పెట్టి ఎలా ఐతేనేం అక్కడ ఉద్యోగ రీత్యా ఉంటున్న తమ కూతురు,అల్లుడుల సహకారంతో ఒక యూనివర్శిటీ లో ఎమ్.ఎస్ కోర్స్ లో జాయిన్ చేశారు...యూనివర్శిటీ కాంటీన్ లో ఐతే తక్కువ డాలర్లు ఇస్తారని,బయట పని (పార్ట్ టైమ్) ఒప్పుకుని (వారానికి రెండువందల డాలర్లు) జాయిన్ ఐన తర్వాత అమ్మా,నాన్నకి ఫొన్ చేసాడట.. అమ్మా,నీకేం కావాలి అన్నాడట..ఇంతకీ ఏం పనిరా బాబు అని అడిగిన అమ్మకు "కుప్పలు కుప్పలుగా పోసి ఉన్న చెత్తను సంచులలో నింపి భుజాలు పడిపోయేలా మోసుకుని వాళ్ళు చూపిన స్థలంలో పొయ్యాలట" అని కొంచెం వివరంగా వివరిస్తే........ఏం చెప్పమంటారు ఆ తల్లి ఆవేదన? ఇంట్లో తను తిన్న చాక్లేట్ రేపర్ ని "ఒరెయ్ బాబు డస్ట్ బిన్ లో పడెయ్యరా", అని నెత్తి,నోరు కొట్టుకున్నా తలెగరేసి మరీ విదిలించుకు పోయే నా కొడుకు ఈరో

ఓ స్త్రీ స్వగతం

చిత్రం
మై మాలికిన్ హుః అప్నీ మర్జీ కా.......... ఒహ్ యెస్....నేను ఆడుతున్నాను, పాడతున్నాను (మనసులో సుమండీ)... ప్రపంచంలోని ఆనందాన్నంతా ప్రతి సెకనూ అందుకోవాలని ఆరాట పడుతున్నాను... నాకు నచ్చింది చేస్తున్నాను,,నచ్చినట్లు ఉంటున్నాను... నిధి చాల సుఖమూ........... "మమ్మీ........... వీల్లేదు. నువ్వు మాకు నచ్చినట్లు ఉండాలి..మాకు నచ్చిందే చెయ్యాలి... ఐనా నేను ఏ అమే...రికా అమ్మా,నాన్నకో పుట్టి వుంటే ఎంత బాగుండేది...నా బాడ్ లక్...." ఓ కన్న కూతురి నిట్టూర్పు. "ఏమేవ్...నాకు నచ్చినట్లు మాత్రమే నువ్వుండాలి...లేదంటే నువ్వు నాకు అక్కరలేదు..ఐనా నిన్ను కాదే, నిన్ను కన్నవాళ్ళను,నాక్కట్టబెట్టిన వాళ్ళను అనాలి... నా ఖర్మ..". ఓ భర్త అంతులేని మనోవేదన............ "అమ్మా,నా ఫ్రెండ్స్ తో కలసి సినిమాకు వెళ్ళివచ్చానని,,సిగరెట్లు తాగుతున్నానని నాన్నకు ఊదేసావా...నువ్వు అసలు నా కన్నతల్లివేనా........"..ఓ కన్నకొడుకు ఆక్రోశం.... "ఓరి భగవంతుడా! నేనేం పాపం జేసానయ్యా ? వీళ్ళ కోసమా నేను రెక్కలు,ముక్కలు చేసుకున్నది...ఇదేనా జీవితం ?" ఒక్కసారి గతంలోనికి తొంగిచూసుకున్న ఆ తల్లికి అంతా శూన్యం కనబడింద
చిత్రం
వినాయక చవితి శుభాకాంక్షలు

ఉపనిషత్తుల మనొహరత్వం,శక్తి :భగవద్గీత

ఉపనిషత్తులు రచించబడ్డ కాలాన్ని గురించి విద్వాంసులలో భిన్నాభిప్రాయాలున్నవి అని,ప్రధాన ఉపనిషత్తులు చాలామటుకు క్రీస్తు పూర్వం ఏడవశతాబ్దిలో బౌద్దయుగానికి పూర్వమే రచించబడ్డాయని చాలామంది అంగీకరిస్తారు. మొత్తం రెండువందల పైచిలుకు ఉపనిషత్తులు ఉన్నాయని ,చాలా మటుకు సంప్రదాయబద్దంగా ఉన్నాయని, ఇవన్నీ బౌద్దకాలం తర్వాతనే, అంటే శంకరాచార్యుల కాలం తర్వాతనే రచింప బడ్డవన్నది విస్పష్టం అని స్వామి రంగనాధానంధ తన ఉపనిషత్తుల సందేశం అనే గ్రంధంలో వివరించడం జరిగింది..సమాజంలో మానవుడి ఐహిక జీవితాన్ని శాసించే సంప్రదాయాలు, ఆచారాలు,కట్టుబాట్లు కాలానుగుణంగా మారవలసిన ఆవశ్యకత ఎంతైనా వుంది. భారతీయ సమాజంలో శాశ్వత విలువలు పట్టుతప్పిన ప్ర్లతిసారి ఒక్కొక్క మహోన్నతుడైన ఆధ్యాత్మిక గురువరేణ్యుడు అవతరిస్తూ, ఆ విలువలను కాలానుగుణమైన రీతిలో తమ జీవితం ద్వారా,ప్రభోదాల ద్వారా పునరావిష్కరిస్తూ వచ్చారని రచయిత పేర్కోవడం జరిగింది;.రామక్రిష్ణ పరమహంస పునరావిష్కరించిన విశ్వజనీనమైన,హేతుబద్దమైన,సనాతన ధర్మాన్ని స్వామి వివేకానందులు నలు దిశలా ప్రచారం చేసారు..తర్వాత ఆ ధార్మిక సందేశాన్ని,వేదాంత తత్వాన్ని జీవితంలో వ్యక్తిగతంగా ఎలా ఉపయుక్తంగా,అనువర్తి
చిత్రం
రెండుగంటలముందు మా ఇంట్లో అద్దెకి ఉన్న ఆమె మా ఇంటికి వచ్చారు.. ఒరిస్సా వాస్తవ్యులు.... భర్త సేల్స్ ఎక్జిక్యూటివ్ ఏదో మెడికల్ కంపెనీలో... భర్త తన ఉద్యోగధర్మంలో భాగంగా ఆయా వూర్లు తిరగాలి.. పైగా రెండున్నర సంవత్సరాలకొకసారి ట్రాన్స్ఫర్లు...ఈమె, తన రెండవ తరగతి చదువుతున్నకుమారుడు ఇంట్లో వుంటారు.. ఆమెతో మాట్లాడుతున్నంత సేపూ శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీత భొధిస్తున్నట్లు అన్పించింది.... నా అనుభవాలు ఇంచుమించు అవే ఐనప్పటికి (ఒక స్త్రీగా) నేను నోరు మెదపకుండా తను చెప్పేది నవ్వుతూ వింటూ వున్నాను.. నిజంగా అనుభవాలు మనిషికి పరిపక్వతనిస్తాయి అన్నదానికి ఆమె ఒక ఉదాహరణ...ఒరిస్సాలో ఒక మారుమూల పల్లెటూరులో జన్మించి పెళ్ళి చేసుకుని అత్తవారింట అడుగుపెట్టిన ఆమె అక్కడి వారి భొజన అలవాట్ల గురించి మాట్లాడుతూ,, బాబీ,, వెజ్ నుండి నేను నాన్_వెజ్ లొ పడ్డాను..ఐనప్పటికీ వారి ఇచ్చానుసారం నేను నాన్_వెజ్ వండడం అలవాటు చేసుకున్నాను..ఆడవారు ఎప్పుడూ బయటికి రాని సంస్కృతి మా అత్తవారింట్లో... నేను నా ఇంటిపనుల కోసం బయటకు వెళ్ళడం,పసి పిల్లవాడు జలుబు చేసినా జ్వరం వచ్చినా ఎవరో ఒకరి సాయంతో పరుగులు పెట్టడం, తప్పలేదు.. ఆక్షేపణ తెలిపిన

గీతా స్వరూపము

ప్రపంచమున ఎన్నియో గీతలు కలవు. అష్టావక్ర గీత, అవధూత గీత, ఋభు గీత, బ్రహ్మగీత, వసిస్టగీత,గణేశగీత,హనుమద్గీత,పరాశరగీత,హరితగీత,శివగీత,హంసగీత,భిక్షుగీత,కపిలగీత,దేవీగీత మున్నగు అగణితములైన గీతలు విశ్వసాహిత్యమున వెలయుచున్నను,భగవద్గీత యొక్క దానికే గీత యను నామము చక్కగ రూడీపడినది. గీతది మాతృహృదయము..ఒక గ్రంధము మాత్రమే కాదు. సజీవచైతన్యమూర్తి..గీత కల్పవృక్షము వంటిది..ఉఅపనిషత్సారము గీత..గీత ఒక యజ్ఞము..గీతా జ్ఞానము అనంతము.. భారత సర్వస్వము గీత.ఆధ్యాత్మ వాజ్మయమున ముముక్షువులకు ప్రస్థానత్రయ(దశోపనిషత్తులు,భగవద్గీత,బ్రహ్మసూత్రములు) మిళితము..గీత నిత్యజీవితసంగిని.. శొకరాహిత్యము,ఆనందప్రాప్తియే గీతా లక్ష్యము. గీతయందు సర్వయోగసమన్వయము, సర్వ భూతదయసమత్వము, కనిపిస్తాయి..త్యాగము, సన్యాసమునకు భాష్యము...యోగము,తపస్సులకు అద్దం పత్తినది. మానవుని దేవునిగ మార్చివేయగల శక్తిస్థోమతలు గీతాభోధకు గలవు.