Content

Thursday, September 16, 2010

జీవో ఔర్ జీనేదో

ఒక స్త్రీ కి కావలసినదేమిటి ? తను ఏది కోరుకుంటే అదే చేయగల స్వేచ్చ ఇస్తే సరిపొతుందా ? దానికే స్వేచ్చ అని పేరు పెడితే తెల్లవారి లేచిన దగ్గరనుండి రాత్రి పడుకొనేవరకూ చీరలు,నగలు అని కలలు కంటూ, వాటికోసం భర్తను సాధించే వారిని ఎంతోమందిని చూస్తున్నాము.. అందరూ అలా వుండరు, లేకుండా కూడా లేరు..ఇది ఒప్పుకోవాల్సిన విషయం.. షాపింగ్ మాల్స్ ఎన్ని చూడడం లేదు...కాని శారీరకంగా గానీ,మానసికంగా గాని మగవారికి ఏమాత్రం తీసిపోని ఒక స్త్రీ బాంధవ్యాల దగ్గరకొచ్చేసరికి తనను తాను మలచుకుంటూనే తన వారిని నడిపించే విషయానికొచ్చేసరికి బలహీనురాలిగా ఎందుకు తయారవుతుంది..?
ఆమె ఏం కోరుకుంటుంది ? నా బార్య నా మాట జవదాటరాదు అనుకునే భర్తను కోరుకుంటుందా ?
లేదండి......అలా ఏ బార్యా కోరుకోదు...కాని భర్త ప్రేమతో గీస్తే, లక్ష్మణరేఖను దాటాలని ఏ స్త్రీ కూడా కోరుకోదు..ఒక సెక్యూరిటి కోరుకుంటుంది..నేనున్నాను అనే ఒక అండ కోరుకుంటుంది..పిల్లలకు అన్నీ సమకూరుస్తూనే వారి ప్రేమ ఆశిస్తుంది.. వీటన్నింటితో పాటు "నేను" అన్న ఒక గుర్తింపు కోరుకుంటుంది..(అందుకే తన వంట కొత్త కాకపోయినా ప్రతిరోజు ఇంట్లోవారి మెప్పుకోలు పొందాలని ఆశిస్తుంది) వంటగదిలో తనకు చేయి చాచినా అందని ఒక డబ్బా తీసి ఇవ్వమనడానికి తను స్టూలు ఎక్కి దించలేక కాదు.. భర్త ప్రేమను ప్రతి పనిలోనూ వ్యక్తం చెయ్యాలని కోరుకుంటుంది..పుట్టిన తర్వాత తండ్రి నీడలో, వయస్కురాలైన తర్వాత భర్త అండతో తనకు భద్రత కోరుకుంటుంది.. కారణరహితమైన ప్రేమను కోరుకుంటుంది.. దాని కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తుంది..(ఏమండీ, మేము అంటే మగవారు కుటుంబం కోసం ఏమీ చేయడం లేదా అని మన వార్లు ప్రశ్నించవచ్చు కద.. బోలెడంత చేస్తారండి.. అదీ వివరిస్తాను..) ఇదండి అసలు సంగతి.. కోరుకోవడం,,ఆశించడం.... ఇవి స్త్రీని మానసికంగా బలహీనురాలిని చేస్తున్నాయి...అలా కాకుండా తన ప్రేమను అందరికీ పంచుతూ, తను ఏమి ఆశించకుండా వుండగల్గితే ??ఈ ప్రశ్నకు సమాధానం మీకే వదిలేస్తున్నాను..
అసలు కుటుంబం లేని వ్యవస్థ వూహించుకొగలమా? మరి ఎందుకు ఈ అస్తవ్యస్త ఘటనలు?? స్త్రీ తోడు లేని పురుషుడు, పురుషుడి అండ లేని స్త్రీ మనోభావనలు ఎలా వుంటాయి ?? ఒంటరి జీవితాన్ని ఎంతవరకు లాగగలరు? ఎప్పటికప్పుడు మన జీవితాల్లో సంభవించే కొత్త కొత్త మార్పులు మనకి ఒక అర్ధవంతమైన జీవనాన్ని అందిస్తాయనడంలో ఎమైనా సందేహమా....
నిన్ననే ఒక ఆర్టికల్ చదివాను.......సాక్షి సిటీ ఎడిషన్ లో..."కొనసాగుతున్న గృహిణి న్యాయపోరాటం"...
తనను భర్త ఇంట్లోకి అనుమతించాలని కోరుతూ ఒక గృహిణి ధర్నా...ఆమెకు మహిళా సంఘాలు,స్థానిక మహిళలు అండగా నిలిచారు... భర్త తప్పుడు అభియోగాలు మోపి విడాకులు అడుగుతూ ఆమెని పిల్లలతో సహా బయటకు తరిమేసాడు...ఇదండీ..కారణం ఏదైనా కావచ్చు...నచ్చితే కాపురాలు,నచ్చకపోతే విడి ఆకులు....ఇక్కడ భార్య తప్పొప్పుల గురించి గాని,భర్త తప్పొప్పుల గురించి గాని నేను ప్రస్తావించను.. కాని ఎందుకిలా జరుగుతుంది అని మాత్రమే ప్రశ్నిస్తున్నాను.. మనసులు కలవలేదా...అంటే పెళ్ళై,పిల్లలు పుట్టిన తర్వాత ఆ ప్రశ్న ఎదురవుతుందా ? పెళ్ళిళ్ళు సరదా సరదా గానే చేసుకుంటారు కద..లక్షల లక్షల కట్నాలు,, సరదా సరదా వేడుకలూ,,హనీమూన్లు,, అహా,ఒహో జీవితం కాస్తా కొనాళ్ళకి మూన్నాళ్ళ ముచ్చటగా ఎందుకు మారుతుందీ ?

ఐతే నాదొక ప్రశ్న........బలవంతంగా బయటకి గెంటబడ్డ ఓ భార్య, ఎవరో ఒకరి సహకారంతో మరల భర్త దగ్గరకి చేరితే.... ఒకరిమీద మరొకరికి ప్రేమ పెరుగుతుందా ? జవాబు ఒక్కటే... మరి ఎవరు బలి అవుతారు మధ్యలో.... పిల్లలే కద.....అలా అని తేలికగా వదిలేస్తే ఆ పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత ఇలాంటి ఘటనలు వారి జీవితంలో ఎదురవ్వవని ఎమైనా గ్యారంటీ వుందా ? ఇదండీ... కుటుంబాన్ని బట్టి సమాజం , సమాజాన్ని బట్టి దేశం.......... అన్నారు కద.. మరి ఇంటిని సరిదిద్దుకోలేని ఒక స్త్రీ గాని,పురుషుడు గాని సమాజాన్ని ఏం ఉద్దరిస్తారండి....ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనల్ని నిద్రపోనియ్యవండి..అలా అని చూస్తూ చూస్తూ ఒకరికి అన్యాయం జరుగుతుందేమో అన్న భాధ..

అందుకే నేనంటాను "జీవో ఔర్ జీనేదో"........స్త్రీ ఐనా, పురుషుడు ఐనా తమ తమ మానసిక స్వేచ్చాలోకంలో(అది ఒక ఏకాంతమయ జీవితం, ఎదుటివారికి ఎలాంటి ఇబ్బంది కల్గించని ఆనందమయ లోకం) విహరిస్తూ ఒకరికొకరుగా జీవిస్తూ ప్రపంచదేశాల్లో ఉత్తమ సంస్కృతికి మారు పేరుగా నిలిచిన మన భారతదేశం లో పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవుదాము..
"ఒకరు ప్రసాదించినది స్వేచ్చ కాదు.. మనంతట మనం ఫీల్ అయ్యేది,,మనకు మాత్రమే పరిమితమయ్యేది,, ఇది మనది అన్పించేది మాత్రమే స్వేచ్చ".. అదే కావాలి మనకు..అటువంటి ఫీల్ లేని ఆస్తులెందుకు ?

© Rukmini Devi J
mmanindarkumarTwitter:ACMWCTRss:mk

2 వ్యాఖ్యలు:

  1. బాగా రాసారు..తక్కువ పోస్టులో ఎక్కువ చర్చించారేమో అనిపించింది..

    ReplyDelete
  2. dhanyavaadaalu siva garu..ardham chesukune manasunte idi chalu kadu..

    ReplyDelete