పోస్ట్‌లు

డిసెంబర్, 2011లోని పోస్ట్‌లను చూపుతోంది

ఓ అందమైన కల .

చిత్రం
రెండు చేతులూ చాచాను నిన్ను నా chetullo పెడుతున్నప్పుడు ఎవరో ఒక ప్రత్యెక అతిధి మా ఇంటి లోనికి అడుగు పెట్టిందన్న భావన ...... నీకు అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అన్న తపనతో మా paapa పరుగులు   .......... పాలతో తడిచిన నీ ముద్దు ముద్దు పెదిమలను నాలికతో తుడుచుకుంటూ వుంటే అది ఓ అపురూపమైన ఫీలింగ్ ... నీ మెడలోని మువ్వలు మా ఇంటికి సందడి అనుకున్నాము .. ఇది నాది, అంటా నాదే అన్నట్లు ఇంటి చుట్టూ పరుగులు పెడుతుంటే     మురిపెంగా చూసుకున్నాము .. మాలో ఒక భాగమై , మాతో పాటు నువ్వూ అనుకున్నాము ....... నీ kanti మెరుపులు మా ఇంటికే అందాలని అనుకున్నాము .. నీ నవ్వు మాకు పూల జల్లులు ... నీ చేష్టలు మాకు పాఠాలు అనుకున్నాము .. నీ హావ భావాలు మాకు గురువులు ... నువ్వు అలిగిన వేల మరి మరి నీ ముఖం చూస్తూ నవ్వుకున్నాము .... ఒంటరిగా వదిలి వెళ్లామని, తలుపు తీసిన మరుక్షణం నీ కోపాన్ని తట్టుకునేందుకు సిద్ధమై లోపలి అడుగు పెట్టె వాళ్లము నవ్వుకుంటూనే ......... ఆ కోపంతోనే కాబోలు శాశ్వతంగా మమ్మల్ని విడిచి వెళ్లావు .. ఎందుకు వచ్చినట్లు ? ఎందుకు వెళ్ళినట్లు  ?  (ఈ నెల పదకొండవ తారీఖున దేహ త్యాగం చేసి ,మమ్మల్ని వదిలి