పోస్ట్‌లు

ఆగస్టు, 2016లోని పోస్ట్‌లను చూపుతోంది
ఎవరిని చూసి , ఏ బంధుజనాన్ని చూసి మనసు వికలము కాబడుతుందో ఆ బంధుజనం ముందు అర్జునుని నిలబెట్టాడు శ్రీకృష్ణుడు.. ఎంత కఠినతరమైన అవస్థ అది ? గీతోపదేశమునకు క్షేత్రం అక్కడే తయారగుచున్నది . . ఇక్కడ మనస్సు అర్జునుడిగా , అరిషడ్వార్గాలు మనయొక్క బంధుజనంగా భావించినటులైన మన శరీరం గొప్ప యుద్ధక్షేత్రంగా మారుతుంది ..కౌరవులు అన్నివిశాలా పాండవులకు అపకారమే చేశారు .. వారికి దక్కవలసిన రాజ్యం లాక్కొని కూడా నానా హింసలకు గురి చేశారు .. బుద్ధినాశాత్ప్రణశ్యతి -బుద్ధి చేసినచో మనుష్యుడు చెడిపోవును,. నశించిపోవును అని గీతలో ఆ శ్రీకృష్ణపరమాత్ముడు చెప్పి ఉన్నాడు. ..దీనిని బట్టి ఎవరెవరి బుద్ధి శుద్ధత్వము లేక అవగుణాలతో కూడి ఉండునో,అట్టివారు జీవితరంగమున దుర్యోధనుని అపయశస్సు,అపజయం,వినాశం తప్పక పొందగలరు . ఇటువంటివారి సాంగత్యంలో ఉంది దుర్యోధనునికి ప్రియం చేయు వారందరూ యుద్ధరంగమున ఉన్నారు . పాపమును ప్రోత్సహించుట మహాపాపం . అందువల్ల దుర్యోధనుని వంటి దుర్భుద్ధి గల వారిని ఆశ్రయించడం గాని ,ఆతని పక్షాన గాని నిలవడం ఎప్పటికీ తగదు .. నిద్రను జయించినవాడు, తమోగుణాన్ని నిర్జించిన వారు ఉత్తములుగా చెప్పబడతారు . ఏ స్వజనమును చూసి అర్జునుడి

మహాభారతయుద్ధం

సేనయోరుభయోర్మధ్యే రధం స్థాపయా మీ>చ్యుత. యావదేతాన్నిరీక్షే>హం  యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా  సహా యోద్ధవ్యమస్మిన్  రణసముద్యమే . అర్జునుడు - ఓ కృష్ణా ! ఈ యుద్ధారంభమునందు నేనెవరితో పోరుసల్పవలయునో , అట్టి ఈ యుద్ధాభిలాషులను ఎచటినుండి నేను చక్కగా జూడగల్గుదునో రెండు సేనల   మధ్య అచ్చోట నా రధమును నిలబెట్టుము . అని శ్రీకృష్ణ పరమాత్మునితో చెప్పెను . వ్యాఖ్య - శత్రువులతో తలపడుటకు ముందుగా, శత్రు పక్షమున ఎందరు కలరో ,ఎవరెవరు కలరో, వారందరూ ఏ ప్రకారముగా ఉన్నారో అంతయు గమనించుట ఉత్తమ యోధుని లక్షణము . కనుకనే అర్జునుడు వారలను చక్కగా చూచుటకై రధమును ఉభయ సేనల మధ్యకు తీసుకు పొమ్మని శ్రీకృష్ణునికి చెప్పెను .. నేను అనబడు ఈ ఆత్మ కు ఉపాధి కల్పించిన ఈ శరీరం మనకు దేవాలయం . దానిని ఒక యుద్ధరంగం గా కూడా చిత్రీకరించవచ్చును .. యుద్ధరంగం మధ్యలో అంటే పద్మవ్యూహంలో నిలబడిన ఆత్మ తన చుట్టూ అల్లబడిన,నిలబెట్టబడిన సైనికులను ఏ విధంగా ఛేదించుకుని పరమాత్మను చేరగలదో ఆ యుద్ధమే మహాభారత యుద్ధం  ..ఆత్మను పంచపాండవ స్వరూపంగా భావిస్తే , అరిషడ్వార్గాలు అనబడే కౌరవులు  ఆ ఆత్మను చుట్టి అనుక్షణం నరకం చూపిస్తూ  ఉంటాయి అనడంలో ఏ మాత్రం