పోస్ట్‌లు

జులై, 2011లోని పోస్ట్‌లను చూపుతోంది

గురువు అవసరం ................

గురువు అవసరమా అన్న మన సందేహానికి సమాధానంగా వేమన  ఇలా వివరించాడు. ఆత్మలోని జ్యోతి యమరుగా లింగంబు తెలిసి చూడకున్న తేటపడదు అదియు గురువు లేక అబ్బునా తెలియంగా విశ్వదాభిరామ వినుర వేమా ! తాత్పర్యం  : హృదయంలో తేజో రూపుడుగా వున్న పరమేశ్వరుని దర్శించడానికి సద్గురువు దగ్గర అభ్యాసం లేకుండగా సాధ్యపడదు. ఇంకా.........ఇలా చెప్పారు......... ఉడుగక క్రతువుల తపముల నడవుల తీర్ధముల తిరిగినంతనే ధరలో నోడయని కనుగొనజాలదు కడు ధీరత గురుడు తెలుపగలడిది వేమా   ! తాత్పర్యం : ఎ మాత్రం విడిచి పెట్టకుండా యజ్ణ యాగాదులు , తపస్సు చేసి, అడవులలో తిరిగి తీర్ధయాత్రలకు వెళ్ళినప్పటికీ స్వామిని కనుగొన లేరు. ఆ పరమాత్మను చేరుకొనే విధానాన్ని గురువు మాత్రమే చెప్పగలడు. గురుని శిక్ష లేక గురుతెట్లు కలుగునో అజునికైన వాని యబ్బకైన తాళపు చెవి లేక తలుపెట్ట్లూడునో? విశ్వదాభిరామ వినుర వేమా ! తాత్పర్యం : తాళం చెవులు లేకుండా తలుపు ఏవిధంగా  రాదో, అదే విధంగా గురువు ఉపదేశం లేకుండా, ఆత్మా జ్ఞానాన్ని బ్రహ్మ గాని ఆతని అబ్బ (తండ్రి ) గాని తెలుసుకోలేరు. గురువు లేక విద్య గురుతుగా దొరకదు నృపతి లేక భూమి నియతి గాడు గురువు విద్యలేక గురుతర ద్విజుడౌనే ?

Hari OM Hari OM Sai OM Sai OM - Shirdi Sai Bhajan

చిత్రం
హరి ఓం, హరి ఓం, సాయి ఓం, సాయి ఓం, భజన చేద్దాం రండి.  

గురు పౌర్ణమి శుభాకాంక్షలు ...................

అందరికి నమస్కారం.... మనిషి పుట్టుకతో అన్నీ నేర్చుకుని రాడు.  కొందరికి స్వతహాగా నేర్చుకునే శక్తి వుంటే, మరి కొందరికి ఎదుటి వారిని చూసి నేర్చుకునే శక్తి వుంటుంది. ఉదయం లేచిన దగ్గర నుండి, రాత్రి నిద్రించే వరకూ ప్రక్క వారి సహాయం అవసరమౌతుంది. అది మాట సహాయం కావచ్చు లేదా పని సహాయం.... ఎందుకంటే మనిషి ఒంటరి జీవితం గడపలేదు.  అలానే ఎవరి సహాయం లేకుండా అస్సలు బ్రతకలేడు. పుట్టిన మరుక్షణం నుండి మాతా పితరుల      ఆధ్వర్యంలో, యవ్వనంలో జీవిత భాగస్వామి సహచర్యంలో     , వృద్ధాప్యంలో తన బిడ్డల అండలో కాలం గడిపేస్తాడు.  ఓనమాలు అమ్మ ఒడిలో నేర్చుకుంటే, అ ఆ లు బడిలో నేర్చుకుంటాడు . ఇలా ఎవరో ఒకరి  సహకారంతో జీవన పయనం సాగిస్తాడు . కాని అదే జీవితాన్ని ఎటువంటి  మార్గంలో, ఎలా  నడిపించాలి అన్నమీమాంస ను ఒక్క గురువు మాత్రమే తీర్చగలడు.  మనలో ఎన్నో సందేహాలు. వాటిలో ముఖ్యమైనది గురువుని గురించిన సందేహం. అందుకే ఈ గురుపౌర్ణమి సందర్భంగా నాకు మరియు మరికొందరి సందేహ నివృత్తి కోసం చిన్ని ప్రయత్నం మా అత్యంత ఆప్తురాలు భారతి గారి సహకారంతో......... ముందుగా మనలో కదలాడే కొన్ని ప్రశ్నలు ............  గురువులనగా ఎవరు? .గురువులను

భారతీయం: Tirupati Ghat Road

భారతీయం: Tirupati Ghat Road : "Tirupati Ghat Road , a photo by Arun Sundar on Flickr. ఏడుకొండల వాడా..వెంకట రమణా.... తిరుమల తిరుపతి... అత్యధ్బుతమైన ఆధ్యాత్మిక కేంద్రం......"

Tirupati Ghat Road

చిత్రం
Tirupati Ghat Road , a photo by Arun Sundar on Flickr. ఏడుకొండల వాడా..వెంకట రమణా.... తిరుమల తిరుపతి... అత్యధ్బుతమైన ఆధ్యాత్మిక కేంద్రం... గొప్ప పేరు పొందిన యాత్రాస్థలం... వెంకటేశ్వర స్వామి  దర్శనం కోసం మేము బస్సు లో ప్రయాణం చేస్తున్నప్పుడు, అకస్మాత్తుగా క్రిందకి చూసి అమ్మో అనుకుని ముందు  బాట వైపు దృష్టి సారించాను.. సామాన్యంగా ప్రతి యాత్రికుడు చేసే పనే అదే.. ఐతే నాలో ఏవో భావాలు... మన  వెనుకగా వున్న లోయ ప్రదేశం మన గతం ఐతే, ముందున్న బాట మన గమ్యాన్ని సూచిస్తుంది అన్న ఆలోచన..  మనం కూర్చున్న బస్సు మన వర్తమానం... గతం మనకు గతుకుల లోయను చూపిస్తుంది.. భవిష్యత్తు మనలో ఆశ ను రేకెత్తిస్తుంది.. ముందు ముందు అంతా  మంచే జరుగుతుంది అన్న ఆశ... అందుకే గతం గతః అన్న సూక్తిని గుర్తు పెట్టుకుని, మనం ఎ  స్థితిలో వున్నామో గమనిస్తూ,చిన్న చిన్న తుఫానుల తాకిడికి తట్టుకుని నిలబడే  వృక్షాల్లా ముందుకు సాగాలి.. అయినా మనం ఆకాశాన ఎగిరే పక్షుల కన్నా బలమైన వాళ్ళం.......కదా... వాటిని  మించిన కష్టాలా మనవి ????????    

ఏడుకొండల వాడా..వెంకట రమణా