పోస్ట్‌లు

సెప్టెంబర్, 2015లోని పోస్ట్‌లను చూపుతోంది
చిత్రం
విఘ్నేశ్వరా ! సమస్త జీవులకు ఆధారభూతుడగు ఆ పరమశివుని పుత్రుడవు ..పార్వతీ తనయుడవు ,  కరుణామూర్తివి .. నిరంతరం మా చిత్తము సర్వకాల సర్వావస్థల యందు నీ పాదారవిందముల యెడ నిమగ్నమై , అచంచలమైన భక్తితో కూడి యుండి, మనో వాక్కాయ కర్మలచే మా వలన ఎవరికీ అపకారం జరగకుండునట్లు ను, నిర్మలమైన మనస్సును కూడి వుండి  నిరంతరం నీ ధ్యానములో వుండి ,జ్ఞాన సంపత్తిని కలిగి వుండే సామర్ధ్యములను  కలిగించువాడవై మమ్ము ఆశీర్వదించి మా యెడ దయ చూపుమయా తండ్రీ .......      వ్యాఖ్యను జోడించు                                            సర్వేజనా సుఖినోభవంతు  

ప్లాటినం వుదయం ..........

మనిషే మనిషికి శత్రువు........... అని  పదే పదే మన చుట్టూ జరిగే సంఘటనలు మనకి నిత్యం గుర్తు చేస్తుంటాయి .  మనలని కదిలించేస్తుంటాయి .. మనసులు వికలమై పోతుంటాయి .. మన పరంగా కావచ్చు లేక ఇతరుల పరంగా కావచ్చు .. ఆఫ్ట్రాల్ మనం మనుషులమే ... ఇటువంటి సంఘటనలు మన కొత్త వుదయాన్ని ఆనందంగా మార్చవు .. కానీ మార్చుకోవాలి . మనం ఆ సామర్ధ్యాన్ని పెంచుకోగలగాలి .. అందుకే నిద్రలేవగానే మన అరచేతులు చూసుకోమని ,దైవాన్ని ప్రార్ధిస్తూ లేవమని ఇలా ఎన్నో జాగ్రత్తలు చెప్తూ వుంటారు పెద్దలు.. వాటిని కొట్టి పారేయలెము. నిన్నటి ఆనందకర ఘటనలు మనల్ని ఈరోజు కూడా సంతోషంగా వుంచగలవు గలవు గాని, విషాదకర సంఘటనలు  మనల్ని కొన్నిరోజులు కలచివేస్తాయి .. అది మన అనారొగ్యానికి దారితీస్తుంది కూడా   . అందుకే కొత్తరోజును ఆనందంగా ఆహ్వానించండి అన్న కాన్సెప్ట్ ఈ పుస్తకంలో కనిపిస్తుంది . నిద్ర లేచిన మొదటి 30  నిమిషాలను ప్లాటినం గా రచయిత  వర్ణించారు .. ఆ మొదటి 30 నిమిషాల ప్రభావం మనం గడపబోయే రోజు మొత్తం మీద ప్రతి క్షణం ఎంత విలువతో గడుపుతారు అన్న దానిపై ఆధారపడి వుంటుంది అని తెలిపారు .. ఇది నిజమే అనడానికి ఒక చిన్న వుదాహరణ ... మా ప్