పోస్ట్‌లు

ఏప్రిల్, 2018లోని పోస్ట్‌లను చూపుతోంది

తిరస్కృతి

నిర్ణయం మనదే  .....  సున్నితంగా తిరస్కరించడం - మనం మనకి ఎంత శక్తి వుందో అంత మేరకే వినియోగించుకోగలగడం ,చేయలేని పనిని మృదువుగా తిరస్కరించడం ముఖ్యం . There is no substitute for hardwork.. కష్టపడి పని చేయగలగడం ఒక అదృష్టం .. కానీ వారానికి ఒకసారి విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యమైన అంశం .. తిరిగి కోల్పోయిన శక్తిని సంపాదించుకోగలము ... పిల్లలను చూసి నేర్చుకోవలసినవి ఎన్నో... అన్నింటికన్నా నాకు నచ్చిన విషయం " వాచీ " ని ఒకరోజు మన దగ్గర లేకుండా గడపగలగడం .. అది సాధ్యమే .. ఐతే, మొబైల్ లేకుండా ఒక్క గంట గడపగలగడం ---- చాలా పెద్ద విషయం ఈరొజుల్లొ.. రాబిన్ శర్మ ఈ పుస్తకం వ్రాసిన రోజుల్లో మొబైల్ వుండి  వుండదు కదా .. చిన్న పిల్లలు అల్లరి చేయకుండా వుండాలి అనుకునే పేరెంట్స్ వాళ్ళ చేతుల్లో ఒక మొబైల్ ఇచ్చెస్తున్నారు.. వీడియో గేమ్స్ కి అలవాటు  చేస్తున్నది  కూడా   తల్లిదండ్రులు మాత్రమే .. ప్రతి ఒక్క విషయానికీ లాభనష్టాలను భేరీజు వేస్తుంటాము మనం .. మొబైల్ వాడకం వల్ల లాభం కన్నా నష్టాలు ఎక్కువగా వున్నాయి అని నెత్తి నోరూ కొట్టుకుంటున్నా పట్టించుకోము .. అందుకే అన్నది మార్పు కావాలి అని. ఎటువంటి మార్పు కావాలి
ప్రశ్న అవసరం....    సమాజ సేవకు  డబ్బు  అవసరమా అని ప్రశ్న ... డబ్బు మనిషి  కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతుంది .. అది ఒక సపోర్ట్ ...  వుద్యోగం స్త్రీ తన భాద్యతలను మరింత సంతృప్తి కరంగా పూర్తి  చేయడానికి దోహద పడుతుంది   మా ఇంటికి అద్దెకు ఇల్లు కావాలి అని ఒకామె వచ్చారు .. తనని తాను    పరిచయం చేసుకుంటూ ఒక సమాజ సేవకురాలిగా చెప్పుకున్నారు ..నేను చాలా చాలా సంతోషం ఫీల్ అయ్యాను ... అంతలో  తనతో వచ్చిన హేల్పర్    " అవునమ్మా ,  మాకు ఏది అవసరం  వున్నా అమ్మగారి దగ్గరకు పరుగెడతాము ... మాకు ఇళ్ళు  కాలిపోయినప్పుడు కూడా ఏంతో  సహాయం చేసారు.. నెల నెలా సమయానికి వడ్డీ కట్టేస్తే చాలు అసలు నెమ్మది మీద ఇవ్వవచ్చు . తొందర పెట్టరు---- "   అని ఆమె గురించి గొప్పగా చెప్పింది ... నాకు  నుండి నీరు కారిపోయినట్లు ఐపోయింది .. ఇప్పటికీ  మరచిపోలేను అ మాటలు .. సమాజ సేవ అంటే వడ్డీ వ్యాపారమా  ???????     పేరుకు పేరు , ఆదాయానికి ఆదాయం ........   పేద ప్రజలు  నూతిలో కప్పలా  ..............