పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2013లోని పోస్ట్‌లను చూపుతోంది

ఎవరు గొప్ప

 మనలో చాలా మందికి ఒక గొప్ప   సందేహం కలుగుతూ వుంటుంది . దేవుళ్లలో ఎవరు గొప్ప ?.. శివుడే గొప్ప ..కాదు,  విష్ణువే గొప్ప ...అదేమీ  కాదు శక్తి లేనిదే ఈ  ఇరువురూ దేనికీ   పనికి రారు అని ఇలాంటి వాదనలు  చూస్తూనే వుంటాము..   అసలు ఎవరిని పూజించాలి ? మనకెందుకు ఈ గందర గోళం ?  ఇది కేవలం హిందువులలో మాత్రమె కనబడుతుంది .. ఎందువల్ల ? ఆత్మ, పరమాత్మ ల తత్త్వం తెలిసిన మన పెద్దలు మనకు ఏమి తెలియ జెప్పాలనుకున్నారు.. మూలాన్ని వదిలేసి ఈ వాదనలు అవసరమా అని ఒక ప్రశ్న ..కానీ భగవద్ గీత లో నేను ఎవరిని పూజించాలి  అన్న సందేహానికి   ఒక శ్లోకం ద్వారా  ఆ కృష్ణ   పరమాత్మ  వివరించారు  ...........                  యే యదా మాం ప్రవద్యంతే తాంస్తదేవ భజామ్యహమ్ !                  మమ  వర్త్మానువర్తనే మనుష్యః పార్ధ సర్వశః !!                  యేప్య న్య   దేవతా భక్తా యజంతే శ్రద్ధ యాన్వితాః !                   తే పి  మా మేవ కౌన్తేయ !యజన్త్య విధిపూర్వకం !!      ఎవరు ఎవరిని  పూజించినా  చేరేది ఆ భగవంతునికే ... ఆయనను ఎవరు ఏ  రూపంలో పూజిస్తే , ఆ రూపం లోనే  పూజలు గ్రహిస్తాడు . తమలో ఎన్ని వైవిధ్యాలున్నా మానవులు ఆయన మార్గాన్నే ఆశ్
 కొన్ని సమస్యలు వచ్చినా , పరిష్కార మార్గం మన కళ్ళ ముందు కొద్ది దూరంలో  గోచరిస్తుంది.  వెంటనే ధైర్యం  తెచ్చుకుని ముందుకు సాగ గలుగుతాము . అన్నీ మనం అనుకున్నట్లు జరిగినా , భవిష్యత్తులో ఏమి జరగనుందో ముందే పసిగట్టగలిగినా, ఎదుటి వ్యక్తి  మనస్తత్వాన్ని పూర్తిగా గ్రహించగలిగిన  శక్తి కలిగియున్నా,.... మనమే దేవుళ్ళము   అని అనుకోవచ్చు.. ఇక ఆ పరమాత్మ తో మనకు పని ఏముంది  చెప్పండి..   అప్పుడు మనలో అహంకార పూరిత ప్రవర్తన అణువణువునా నిండి వుంటుంది ...జీవిని పుట్టించిన దేవుడు ఆ జీవికి తోడుగా  ఆకలినీ   పుట్టించాడు ..    ఎక్కడ సోమరిగా తయారౌతాడో   అని..కొన్ని కొన్ని స్మృతుల్ని , కొన్ని శక్తులని దూరం చేస్తాడు  అహంకారిగా తయారు కాకూడదు అని.. ఆ విధంగా ఎన్నో విధాల భగవంతుడు మనకు మేలు చేస్తున్నాడు కదా... మరి ఆ మేలుకి ప్రతిఫలం గా మనం ఏమి ఇస్తున్నాము అన్నది ఆలొచించాల్సిన  విషయం... అందుకే మనం  ప్రతి అడుగు ఆలోచించి వెయ్యాలి అని చెప్తారు పెద్దలు ..మనం అది ఆచరించము .. అందుకే మనకి ఇన్ని సమస్యలు.. ఐతే మరికొన్ని .వుంటాయి  విధి లిఖించిన సమస్యలు .. అవి మనం  తాత్కాలికంగా స్వాంతన చెందడం ద్వారా జీవించ గలము గానీ , శాశ్వతంగా దూర
  ఇక్కడ రచయిత ప్రస్తుత సమాజం లో  మన జీవన విధానం ఎలా వుందో చెప్తూ  ఒక విషయం  ప్రస్తావించారు .---------రోగాలన్నింటికీ ఒకటే మందా ? అందరికీ  భగవద్గీతే దిక్కా ?జీవితంలో  దెబ్బ  తిన్నవారికి, నష్టపోయినవారికి, సంసారం నుండి పారి పోదలచిన వారికి   కావాలి గాని కళ్ళు , కాళ్ళు బాగానే   వున్న మాకెందుకు ? అని ఈ రకమైన ప్రశ్నలతో ఆధునికత అలవడిన ఎందఱో బాహాటం గానే విమర్శిస్తున్నారు ... ఇది నిజమేనా .. నిజం కాకపొతే మరేమిటి మన జాతికీ ఖర్మ ? ...........అని .............! భగవద్గీత  అందరి కోసం... చూపు వున్న ప్రతివాడికి వెలుగు ఎలా అవసరమో,  శక్తి వున్న ప్రతి జీవికి భగవద్గీత శ్రవణం అవసరం అని కూడా చెప్పారు ...సూర్యుడి అవసరం లేని వాడిని బుద్దిహీనుడు అని, ప్రాణవాయువును తిరస్కరించే వాడిని మూర్ఖుడు అని అంటారని కూడా చెప్పారు .........మనం ఏ పని అయినా  ప్రయోజనం వుంటేనే  అన్నది జగమెరిగిన  సత్యం .. కనీసం ప్రయోజనం  కోసం అయినా ఆ భగవన్నామ స్మరణ చేయడానికి అవకాశం దొరికినట్లే కదా.............    ఇక పరిష్కారం లేని  సమస్య అంటూ వుండదు.. ఒక   విషయాన్ని మనం సమస్యగా భావిస్తేనే అది మనకు పెద్ద తలనెప్పిగా మారుతుంది..   సమస్యగా   భావించ

కృష్ణం వందే జగద్గురుం

చిత్రం
   ఈ రోజు  వుదయం భక్తి  ఛానల్ లో   మల్లాది వారి శ్రీ మద్భాగవతం ప్రవచనం లో ఒక జీవి అంటే (ప్రత్యేకంగా మానవ జన్మ)  ఏ విధంగా తల్లి గర్భం లో  పడిన నాటి నుండి ఏ ఏ రకాల అనుభవాలను గూడి వుంటుందో అత్యద్భుతంగా వివరించారు ... నిజంగా  విని  అందరూ తెలుసుకోవలసిన విషయం. తల్లి గర్భం లో పడిన నాటి నుండి  బయట పడే వరకూ మల మూత్రాదులు ,కఫ శ్లేష్మాలలో ఏ విధంగా తిరుగుతూ   ఎందుకురా ఈ జన్మ అని జీవి ఎలా విలపిస్తాడో కళ్ళకు కట్టినట్లు వివరించారు మల్లాది వారు.. గర్భం నుండి బయట పడేప్పుడు ఆ జీవి  మీద నీళ్ళు  కొట్టినప్పుడు ఏడిస్తే బ్రతికి వున్నట్లు మనం గుర్తిస్తాము. ఆ క్షణం లో ఆతని పూర్వ జన్మ స్మృతి పోయి ఏడుస్తాడు కాబోలు జీవుడు.... సరే , గర్భం లో మల మూత్రాదులలో తిరుగుతాడు అది తప్పని స్థితి..  బయటకు వచ్చిన   కూడా ఈ మాయా ప్రపంచం లో అలమటిస్తూ తిరుగుతుంటాడు అజ్ఞానం తో..ఏ మనుష్యుడు అయినా  ఏ    అయినా క్షణ మాత్రము కూడా కర్మను ఆచరింప కుండా వుండలేడు  .. కర్మలను ఆచరింప కుండా వుంటే  శరీర నిర్వహణం కష్ట తరము అవుతుంది అని భగవద్గీత లో  చెప్పబడినది .. ఐతే  కర్మలను  అని తెలియనట్టి స్థితి లో మానవుడు వుంటున్నాడు .అదీ దురదృష్ట కరం...

మనం ప్రశాంతంగా వున్నామా ?

ఆకాశం , భూమి , ,సూర్యుడు,  చంద్రుడు, మనం అంటే ...మానవులం.   సృష్టిలో ఎన్నో రకాల  జీవులు వున్నాయి . అందరికీ తెలిసిన విషయమే.. అన్ని జీవుల లోనికి మానవ జన్మ ఉత్కృష్టమైనది అన్న విషయం కూడా తెలిసినదే.. మిగిలిన జీవజాతులలో   లేని కొన్ని ప్రత్యెక లక్షణాలు వుండడమే ఆ వుత్క్రుష్టత కు కారణం.., వినడం ,చూడడం ,తినడం , నడవడం , పరుగులు పెట్టడం , పడుకోవడం ఇవన్నీ అన్ని  జీవ జాతుల లో సర్వ  సామాన్య మైన లక్షణం.. కానీ మానవుని ప్రత్యెక లక్షణం కర్మాచరణం, ఆలోచనా శక్తి కలిగి వుండడం.  ఆలోచనా శక్తి  ఎక్కడ నుండి వచ్చింది   అంటే మనసు నుండి అంటారు. మనసే  ఆలోచనల సమాహారం ఐనప్పుడు    ప్రత్యేకంగా ఆ శక్తి ఎక్కడ నుండి వచ్చింది  అని ప్రశ్న అవసరం లేదు కదా ... మానవులలో ఈ మనసు చేసే గారడీ అంతా,ఇంతా కాదు . ఆ మనసుని ఆధారం గా చేసుకునే  అల్లినా , కధలు వ్రాసినా ...నీకు మనసు లేదా అని చాలా ఈజీ గా అనేస్తాము .. కాని తలచుకుంటే  "అమ్మో, మనసు"  అనిపిస్తుంది...ఆలోచనలు ఒక్కటే కాదు , దయ ,జాలి ,ప్రేమించే హృదయం, కారుణ్యత ను కలిగి వున్న వాడు నిజమైన మానవుడు అనిపించుకుంటాడు ..ఇక అసలు విషయం లోనికి వస్తాను .. ఈ మనసు గారడీ వలలో  చిక్కుకున్న