కొన్ని సమస్యలు వచ్చినా , పరిష్కార మార్గం మన కళ్ళ ముందు కొద్ది దూరంలో  గోచరిస్తుంది.  వెంటనే ధైర్యం  తెచ్చుకుని ముందుకు సాగ గలుగుతాము . అన్నీ మనం అనుకున్నట్లు జరిగినా , భవిష్యత్తులో ఏమి జరగనుందో ముందే పసిగట్టగలిగినా, ఎదుటి వ్యక్తి  మనస్తత్వాన్ని పూర్తిగా గ్రహించగలిగిన  శక్తి కలిగియున్నా,.... మనమే దేవుళ్ళము   అని అనుకోవచ్చు.. ఇక ఆ పరమాత్మ తో మనకు పని ఏముంది  చెప్పండి..   అప్పుడు మనలో అహంకార పూరిత ప్రవర్తన అణువణువునా నిండి వుంటుంది ...జీవిని పుట్టించిన దేవుడు ఆ జీవికి తోడుగా  ఆకలినీ   పుట్టించాడు ..    ఎక్కడ సోమరిగా తయారౌతాడో   అని..కొన్ని కొన్ని స్మృతుల్ని , కొన్ని శక్తులని దూరం చేస్తాడు  అహంకారిగా తయారు కాకూడదు అని.. ఆ విధంగా ఎన్నో విధాల భగవంతుడు మనకు మేలు చేస్తున్నాడు కదా... మరి ఆ మేలుకి ప్రతిఫలం గా మనం ఏమి ఇస్తున్నాము అన్నది ఆలొచించాల్సిన  విషయం... అందుకే మనం  ప్రతి అడుగు ఆలోచించి వెయ్యాలి అని చెప్తారు పెద్దలు ..మనం అది ఆచరించము .. అందుకే మనకి ఇన్ని సమస్యలు.. ఐతే మరికొన్ని .వుంటాయి  విధి లిఖించిన సమస్యలు .. అవి మనం  తాత్కాలికంగా స్వాంతన చెందడం ద్వారా జీవించ గలము గానీ , శాశ్వతంగా దూరం చేయలేము ..చెప్పడం  చాలా తేలిక.  ఆచరణలో పెట్టడం కష్టం అన్న మాట సర్వ సాధారణం ఐపోయింది.. ఆ సాధారణమైన వాఖ్య గా తయారైన మాటను ప్రత్యేకంగా భావించి నేను ఆచరించ గలను అన్న దృఢ సంకల్పం తో ముందుకు సాగే శక్తిని కోరుకోవాలి మనం .    .  యుగాలు మారిపోతున్నాయి , తరాలు అంతరించి పోతున్నాయి . ఈనాడు వున్నవి మరునాడు   కనిపించడం లేదు... ఈ సత్యాలు అందరికీ తెలుసు , కానీ మాయ మనచుట్టూ క్రమ్మి వుంది . అందుకే ఈ నాడు ప్రపంచం అంతా వ్యాకులత తో , ఆందోళనల తో నిండి వుంది .. మనం బాగుంటే , సమాజం బాగుంటుంది.. ఒక్క సత్ప్రవర్తన కల యజమాని వుంటే కుటుంబం హాయిగా వుంటుంది .. అటువంటి కుటుంబాన్ని  ఆదర్శం గా తీసుకుని మరో నాలుగు కుటుంబాలు బాగుతాయి. కొన్ని  కుటుంబాలు ఒక సమాజం, కొన్ని సమాజాలు ఒక దేశం. అప్పుడు ఆ  ఆదర్శంగా తీసుకుని మరికొన్ని దేశాలు...ఇలా క్రమేణా ఈ విశ్వం అంతా  మంచితో నిండిపోతుంది...ఆహా.......... ఎంత అందంగా వుంది ఆ వూహ ............  ఎక్కడో  విన్నాను.........    జహా  ధర్మ్  హై , వహా సత్య్ నహీ రహేగా ....
జహా సత్య్ హై ,వహా ధర్మ్ కీ  జరూరత్ హీ నహీ హై  .. అంటే ఒక్కోసారి జన హితం కోసం అసత్యం చెప్పినా అది ఆ సమయం లో సత్యమే(ధర్మమే ) అవుతుంది అంటారు..  సత్యం వున్నచోట ధర్మాన్ని గురించిన ఆలోచన  అవసరం లేదు అని అంటారు.

సమస్య :--జరిగే  ప్రతి   సంఘటనకు మానసికంగా ఎంతో   బాధపడుతుంటాను.. ఉపకారులైనా , అపకారులైనా అందరి గురించి నాకెందుకో విపరీతమైన ఆవేదన .. మరణించిన వారు పోయారు అని,  వున్నవారు సరిగా లేరే అని వ్యధ.  దీనికి పరిష్కారం ఏమిటి ?

పరిష్కారం :---   అశోచ్యానన్వశోచంత్వం   ప్రజ్ఞావాదాంశ్చ భాష సే !
                         గతానూనగాతానూన్శ్చ   నానుశోచంతి పండితాః !!


                         నీది కేవలం మానసిక దౌర్బల్యం . ఎవరిని గురించి నిజంగా బాధపడాలో , ఎవరిని గురించి బాధ పడనక్కర లేదో నిర్ణయించుకో లేక పోతున్నావు .  వివేకం గలవారేవ్వరూ మరణించిన వారి గురించి  గాని, జీవించి వున్న వారి గురించి గాని  బాధపడరు . దేని కంటే లోకంలో ప్రతి వ్యక్తీ తన పాప  పుణ్యాలను అనుభవిస్తూ వుంటాడు . ఇతరులు  ఎవరైనా  బాధపడినా వారి సుఖ దు:ఖ్ఖాల్లో  ఎలాంటి మార్పూ  రాదు.. అది దైవ లీల . కావున నీవు ఏదో సాధించ గలనని బాధ పడడం అర్ధం లేని పని .  ...






















  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం