గురువు అవసరం ................

గురువు అవసరమా అన్న మన సందేహానికి సమాధానంగా వేమన  ఇలా వివరించాడు.

ఆత్మలోని జ్యోతి యమరుగా లింగంబు
తెలిసి చూడకున్న తేటపడదు
అదియు గురువు లేక అబ్బునా తెలియంగా
విశ్వదాభిరామ వినుర వేమా !

తాత్పర్యం  : హృదయంలో తేజో రూపుడుగా వున్న పరమేశ్వరుని దర్శించడానికి సద్గురువు దగ్గర అభ్యాసం లేకుండగా సాధ్యపడదు.

ఇంకా.........ఇలా చెప్పారు.........

ఉడుగక క్రతువుల తపముల
నడవుల తీర్ధముల తిరిగినంతనే ధరలో
నోడయని కనుగొనజాలదు
కడు ధీరత గురుడు తెలుపగలడిది వేమా   !

తాత్పర్యం : ఎ మాత్రం విడిచి పెట్టకుండా యజ్ణ యాగాదులు , తపస్సు చేసి, అడవులలో తిరిగి తీర్ధయాత్రలకు వెళ్ళినప్పటికీ స్వామిని కనుగొన లేరు. ఆ పరమాత్మను చేరుకొనే విధానాన్ని గురువు మాత్రమే చెప్పగలడు.
గురుని శిక్ష లేక గురుతెట్లు కలుగునో
అజునికైన వాని యబ్బకైన
తాళపు చెవి లేక తలుపెట్ట్లూడునో?
విశ్వదాభిరామ వినుర వేమా !

తాత్పర్యం : తాళం చెవులు లేకుండా తలుపు ఏవిధంగా  రాదో, అదే విధంగా గురువు ఉపదేశం లేకుండా, ఆత్మా జ్ఞానాన్ని బ్రహ్మ గాని ఆతని అబ్బ (తండ్రి ) గాని తెలుసుకోలేరు.

గురువు లేక విద్య గురుతుగా దొరకదు
నృపతి లేక భూమి నియతి గాడు
గురువు విద్యలేక గురుతర ద్విజుడౌనే ?
విశ్వదాభిరామ వినుర వేమా !

తాత్పర్యం : రాజు లేనిదే రాజ్య పరిపాలన సాగనట్లే గురువు లేకుండా విద్య లభించదు . కనుక సరయిన గురువు, సరయిన విద్య లేక బ్రహ్మజ్ఞాని ఎలా అవుతాడు  ?

ఛాయనోసగు జెట్లు  సాధువు బోధలు
అడిగి దారిని జేరబడయవచ్చు
అత్తునిట్టు దాత నడిపోవు నిది రాదు
విశ్వదాభిరామ వినుర వేమా !

తాత్పర్యం: చెట్టు తన దగ్గరకు వచ్చిన వానికే నీడ ఇస్తుంది. దూరంగా వెళ్ళిపోయినా వారికి ఆ చెట్టు నీడను ఇవ్వలేదు. అదేవిధంగా గురువు తనకు సన్నిహితంగా వున్న శిష్యునికి విద్యనూ బోదించగలడు గాని, దూరంగా వెళ్ళిపోయినా వారికి బోధలు చెయ్యలేరు. జ్ఞానాన్ని సంపాదించ దలచిన వారు గురువుకి దగ్గరగా వుండాలి అని భావం . 

వాక్కు నందు  గురువే వాక్ర్రుతాను గురువు
చీకటి నటు గురుడు చిక్కి యుండు
 అఖిలమునకు గురువే యాధామై యుండు
విశ్వదాభిరామ వినుర వేమా! 

తాత్పర్యం:  మనం మాట్లాడే మాటలలో గురువు యొక్క శక్తి వుంటుంది .. అదేవిధంగా మనం మాట్లాడే శక్తి లోను గురువు యొక్క ప్రభావం ఉంటుంది. మనలోని అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టడానికి కూడా గురువే ఆధారం. లోకంలో ఎ పని చెయ్యాలన్నా గురువే ఆధారమై ఉంటాడు. అందు వలన  గురువు లేనిదే ఎ శక్తీ లేదు ...

విన్నారుగా. . అదండీ గురువు ప్రభావం మనపై ... 

కామెంట్‌లు

 1. మీ blog కూడా ఒక చెట్టులా కన్పిస్తుంది

  నేను మొన్న ఈ మధ్యనే ఒక మొక్కను నాటాను చూడగలరు కాసంత నీళ్ళు కుడా పోయగలరు

  http://paramapadasopanam.blogspot.com/

  శ్రీ గురుభ్యోన్నమః

  రిప్లయితొలగించండి
 2. అశోక్ గారు, నిజమే ... ఒక గురువు అవసరం .. మనల్ని సన్మార్గంలో పయనింప జేయడానికి.... అప్పుడే పుట్టిన పసిపాప నుండి, కురు వృద్దుల వరకు , ఈ భూమి , ఆకాశం, ప్రకృతి , ఎండా, వాన, చలి, నదులు, సముద్రాలు ........ వీటన్నింటినుండి ఏదో ఒక విశేషం మనకు దొరుకుతుంది ..
  నేర్చుకుంటూ జీవనం సాగించడమే గొప్పదనం ... అవి అన్నీ మనకు సహజ గురువులు ...ప్రయత్నించండి ...

  గాయత్రి గారు , జై గురుదేవ ..
  మీ పరమ పద సోపానం తప్పక చూస్తానండి ... మమ్మల్ని ఆధ్యాత్మిక మెట్లు ఎక్కిస్తారని aashistoo ..
  ధన్యవాదాలతో --

  రిప్లయితొలగించండి
 3. 1. మనస్సు: ఇది సంకల్ప వికల్పాలను చేస్తుంది. ఇది బాగుంది, అది బాగుంది అని సంకల్పిస్తుంది. తర్వాత ఇది తగిందా ,కాదా అనే అనుమానాలతో, సంశయాలతో, అల్లకలలోలంగా, ఆశానిరాశాలతో, ఊగిసలాడడం అనేటువంటి వికల్పాలతో నిలుస్తుంది.

  2. బుద్ధి: ఆయా పదార్థాల స్వరూప స్వభావాలను, ధర్మాలను గత అనుభవాల సహాయంతో నిశ్చయాభిప్రయానికి వచ్చి చేయవలసిన పనిని నిర్ణిస్తుంది, ప్రణాలికలను తయారు చేస్తుంది.

  3. అహంకారం: తర్వాత నేను జీవించటానికి తెలివితేటలతో తెలివిగా నడవగలుగుతున్నాను అని భావన చేసేదే అహంకారం. కార్యానికి సంబందించిన సందేహం నాకే కలిగింది, దాని నివృత్తి కూడ నేనే చేసుకున్నాను, దాని వల్ల వచ్చిన ఫలితాన్ని కూడ నేనే అనుభవించాను అనే వాటిని ఆపాదించుకుంటూ ప్రతి పనిమీద ఒకరకమైన సంతోషాన్ని పొందుతూ గర్వాన్ని ప్రకటిస్తూ అహంభావాన్ని అనుభవించే దాన్నే ‘అహంకారం’ అంటారు. నేను, నాది అనే అహాన్ని వ్యక్తం చేస్తూ జీవించే విధానాన్నే అహంకారం అన్నారు. అహంకారంలో తనను తాను అభిమానించుకొనే గుణం ప్రధానంగా ఉంటుంది.

  4. చిత్తం అంటే ప్రయోజనన్నే చింతిస్తుంది.ఏదైనా విషయాన్ని స్మరించేటప్పుడు మనస్సు, బుద్ధి, అహంకారాలతో కుడి వాటిని పర్యవేక్షిస్తూ రాబోయే వాటికి సలహాలిస్తూ, అభిమాన విషయాలను ఎల్లవేళలా జ్ఞాపకం పెట్టుకుంటూ వాటి జ్ఞానంతో సక్రమంగా నడిచేటట్లు చేసేదే చిత్తం.

  అందువలన సహజ సిద్దమైన మనస్సుయొక్క చంచలత్వాన్ని తొలగిస్తే మిగిలిన పనులన్నీ బుద్ది నిర్వహించ గలుగుతుంది. మనం ఎప్పుడైతే ఆత్మ జ్ఞానాన్ని గ్రహిస్తామో అప్పుడు మనసు తన యొక్క చంచలత్వం తొలగిపోతుంది, అప్పుడు మనసు నిర్మలమవుతుంది. ఆ నిర్మలమైన మనస్సే మనకు సాధనలో ఉపకరిస్తూ ఆ పరమాత్మ స్వరూపునిని హృదయంలో మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది.

  రిప్లయితొలగించండి
 4. 1. మనస్సు: ఇది సంకల్ప వికల్పాలను చేస్తుంది. ఇది బాగుంది, అది బాగుంది అని సంకల్పిస్తుంది. తర్వాత ఇది తగిందా ,కాదా అనే అనుమానాలతో, సంశయాలతో, అల్లకలలోలంగా, ఆశానిరాశాలతో, ఊగిసలాడడం అనేటువంటి వికల్పాలతో నిలుస్తుంది.

  2. బుద్ధి: ఆయా పదార్థాల స్వరూప స్వభావాలను, ధర్మాలను గత అనుభవాల సహాయంతో నిశ్చయాభిప్రయానికి వచ్చి చేయవలసిన పనిని నిర్ణిస్తుంది, ప్రణాలికలను తయారు చేస్తుంది.

  3. అహంకారం: తర్వాత నేను జీవించటానికి తెలివితేటలతో తెలివిగా నడవగలుగుతున్నాను అని భావన చేసేదే అహంకారం. కార్యానికి సంబందించిన సందేహం నాకే కలిగింది, దాని నివృత్తి కూడ నేనే చేసుకున్నాను, దాని వల్ల వచ్చిన ఫలితాన్ని కూడ నేనే అనుభవించాను అనే వాటిని ఆపాదించుకుంటూ ప్రతి పనిమీద ఒకరకమైన సంతోషాన్ని పొందుతూ గర్వాన్ని ప్రకటిస్తూ అహంభావాన్ని అనుభవించే దాన్నే ‘అహంకారం’ అంటారు. నేను, నాది అనే అహాన్ని వ్యక్తం చేస్తూ జీవించే విధానాన్నే అహంకారం అన్నారు. అహంకారంలో తనను తాను అభిమానించుకొనే గుణం ప్రధానంగా ఉంటుంది.

  4. చిత్తం అంటే ప్రయోజనన్నే చింతిస్తుంది.ఏదైనా విషయాన్ని స్మరించేటప్పుడు మనస్సు, బుద్ధి, అహంకారాలతో కుడి వాటిని పర్యవేక్షిస్తూ రాబోయే వాటికి సలహాలిస్తూ, అభిమాన విషయాలను ఎల్లవేళలా జ్ఞాపకం పెట్టుకుంటూ వాటి జ్ఞానంతో సక్రమంగా నడిచేటట్లు చేసేదే చిత్తం.

  అందువలన సహజ సిద్దమైన మనస్సుయొక్క చంచలత్వాన్ని తొలగిస్తే మిగిలిన పనులన్నీ బుద్ది నిర్వహించ గలుగుతుంది. మనం ఎప్పుడైతే ఆత్మ జ్ఞానాన్ని గ్రహిస్తామో అప్పుడు మనసు తన యొక్క చంచలత్వం తొలగిపోతుంది, అప్పుడు మనసు నిర్మలమవుతుంది. ఆ నిర్మలమైన మనస్సే మనకు సాధనలో ఉపకరిస్తూ ఆ పరమాత్మ స్వరూపునిని హృదయంలో మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది.

  రిప్లయితొలగించండి
 5. గురువు సాక్షాత్‌ పరబ్రహ్మస్వరూపుడు. కనుక భగ వంతుని దర్శించే మార్గం గురుశుశ్రూష వల్ల కలుగుతుంది. అందుకనే, ‘గురుర్భ్‌హ్మ, గురుర్విష్ణుః, గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్‌ పరబ్రహ్మ , తసై్మఃశ్రీగురవే నమః’ అని గురువుని పరమేశ్వరునిగా భావించాలన్నారు.అయితే పుట్టిన ప్రతి మనిషికీ ప్రధమ గురువు తల్లి. బుల్లి బుల్లి పదాలు నేర్పుతూ, అవి పలుకుతుంటే విని ఆనందపరవశి అవుతుంది. బుడి బుడి అడుగుల్లో తప్పటడుగుపడి, పడిపోకుండా చిటికిన వేలితో నడిపిస్తుంది. 

  రిప్లయితొలగించండి
 6. పరబ్రహ్మ స్వరూప అనంత స్వరూపం.దేనిని వాక్కు తెలుపలేదో,దేనిచే వాక్కు ప్రకటితమవుతుందో, అదే బ్రహ్మమని తెలుసుకో. దేనిని మనస్సు గ్రహింపజాలదో ,ఏది మనస్సును గ్రహిస్తుందో , అదే బ్రహ్మం. ఏది కళ్ళకు కనపడదో , ఏది ద్రుష్టిని చూస్తుందో , అదే బ్రహ్మం. దేనిని చెవులు వినజాలవో, ఏది శ్రవనాన్ని వింటుందో అదే బ్రహ్మం. ఏది ఘ్రాణంచే ప్రకటితం కాజాలదో, దేనిచే ఆఘ్రాణం ప్రకటితం అవుతుందో అదే బ్రహ్మం. ,

  రిప్లయితొలగించండి
 7. తల్లి గొప్పదే...గురువే. కానీ ప్రేమ స్వరూపిణి. క్రమ శిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించలేదు. ఆ తరువాత క్రమంలో తండ్రి. తండ్రి కాస్త కఠినంగా వున్నా పుత్ర వాత్సల్యంతో ఏమీ అనలేడు...తరువాత గురువు. వాత్సల్యం తక్కువ క్రమ శిక్షణ ఎక్కువ....తప్పుజేసినప్పుడు వేలు ఎత్తి చూపి అవసరమైతే దండించి సక్రమమైన మార్గంలో పెట్టేవాడు గురువు....తల్లిదండ్రులు ఈ జన్మకు కావలసిన జ్ఞానాన్ని ఇచ్చే వాళ్లు....గురువు అసలు జన్మే లేకుండా చేసే వాడు....గురువు భాధ్యత గురుతరమైనది.....ఎవరితో పోల్చలేనిది, మార్చలేనిది, నింపలేనిది. అది తెలుసుకొని మసలుకోవాలి మనం...గురువు గురవే....

  రిప్లయితొలగించండి
 8. తల్లి గొప్పదే...గురువే. కానీ ప్రేమ స్వరూపిణి. క్రమ శిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించలేదు. ఆ తరువాత క్రమంలో తండ్రి. తండ్రి కాస్త కఠినంగా వున్నా పుత్ర వాత్సల్యంతో ఏమీ అనలేడు...తరువాత గురువు. వాత్సల్యం తక్కువ క్రమ శిక్షణ ఎక్కువ....తప్పుజేసినప్పుడు వేలు ఎత్తి చూపి అవసరమైతే దండించి సక్రమమైన మార్గంలో పెట్టేవాడు గురువు....తల్లిదండ్రులు ఈ జన్మకు కావలసిన జ్ఞానాన్ని ఇచ్చే వాళ్లు....గురువు అసలు జన్మే లేకుండా చేసే వాడు....గురువు భాధ్యత గురుతరమైనది.....ఎవరితో పోల్చలేనిది, మార్చలేనిది, నింపలేనిది. అది తెలుసుకొని మసలుకోవాలి మనం...గురువు గురవే....

  రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా....

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...