పోస్ట్‌లు

జనవరి, 2013లోని పోస్ట్‌లను చూపుతోంది
చిత్రం
ఇక సుఫల స్నేహం గురించి .........శ్రీ కృష్ణుడు మరియు కుచేలుడు మధ్య గల స్నేహ  సంబంధం అందరికీ తెలిసినదే... అతి బీద బ్రాహ్మణుడు  కుచేలుడు తప్పని సరియై మిత్రుని వద్దకు వెళ్ళ  వలసి వచ్చినప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళలేక   అటుకులను  తీసుకుని  బయలు దేరాడు.. తన చిన్ననాటి స్నేహితుని  తన దగ్గరకు తీసుకుని ఎంతో   ప్రేమతో   ఆదరించి కుచేలుడు సమర్పించిన అటుకులను ప్రీతిగా ఆరగిస్తూ , నోరు తెరచి సహాయం అడగ కుండానే విషయాన్ని  గ్రహించిన   ఆ పరంధాముడు    కుచేలుని ఇంటిని సర్వైశ్వర్యాలతో నింపిన విషయం  మనకు తెలిసినదే.. అడగనిదే అమ్మైనా పెట్టదు  అన్న సామెతకు  ఇక్కడ చోటు లేదు. అడగకుండానే తన మిత్రుని పరిస్థితి గ్రహించి అన్ని వరాలను ఇచ్చిన ఆ పరమాత్మది సఫల స్నేహమే కదా . ఇక నర నారాయణు లైన   కృష్ణార్జునుల స్నేహం సుఫలమా  అన్నది పరిశీలిస్తే , అర్జునునికి ద్రౌపది , వులూచి ,చిత్రాంగద అన్న భార్యలు వున్నప్పటికీ ఆతని మీద నమ్మకంతో తన చెల్లెలు సుభద్ర ను ఇచ్చి  పెళ్లి చేసాడు .. యుద్ద భూమిలో రక్త సంబంధీకుల ను చూసి విచలితుడైన అర్జునునికి   తన విశ్వరూపం చూపించి, మరీ గీత  భోదించాడు.. సత్యం ఏమిటో తెలియజేశాడు.. అదీ  మంచి మిత్రున

స్నేహంలో రకాలు

మనకు తెలిసిన  స్నేహాలు   కొన్ని మాత్రమె..... చదువుకునేప్పుడు క్లాస్మేట్స్ , బెంచి మేట్స్ , రూం మేట్స్ , వుద్యోగం చేస్తుండగా కొలీగ్స్, మనం నివసించే ఇంటి  ప్రక్కల వారు , ఇతరత్రా పరిచయస్తులు ఇలా ఎందఱో స్నేహితులు వుంటారు. మన నిత్య జీవితంలో  ఈ స్నేహాల  వల్ల సుఖ దుఖ్ఖాలు రెండింటినీ చూస్తాము అంటే అనుభవిస్తాము ఇది సహజం . కానీ   నాకో సందేహం .......... దు:ఖ్ఖం కలిగించేది నిజమైన స్నేహం ఎలా అవుతుంది?  స్నేహం ...  వ్యక్తికి బలం కావాలి గాని, బలహీనత కాకూడదు. స్నేహం.... ఎటువంటి పరిస్థితులు అయినా ఎదుర్కునే శక్తి గలది కావాలి గాని , పరిస్థితులకు  లొంగనిది గా వుండాలి.  కొన్ని పరిస్థితులు మన   కర్మ ల ఫలితాలే, మనం కోరి తెచ్చుకునేవే కాబట్టి అవి మనకి బరువుగా మారతాయి.   స్నేహం మాత్రమె  వాటిని ఆ బరువుని దూది పింజేలా తీసి వెయ గలదు.. " స్నేహం"   అన్న  పదం(బంధం ) యొక్క  విశిష్టత చాలా గొప్పది అని మన పురాణాల   ద్వారా కూడా తెలుసుకున్నాము... ఐతే, స్నేహంలో కూడా రకాలు వుంటాయి అని ఈ మధ్యనే తెలుసుకున్నాను. అవి  సఫల, సుఫల, విఫల స్నేహాలు.......... పేర్లు చాలా బాగున్నాయి కదు .. మరి ఆ స్నేహాలు ఎలా వుంటాయో తెలుస
చిత్రం
 మనిషి సాంఘిక జీవి .  ఒంటరిగా .బ్రతకలేడు... వుదయం నిద్ర లేచినప్పటినుండి రాత్రి నిద్రకు వుపక్రమించే వరకూ ఏదో ఒక పనిలో నిమగ్నుడై వుంటాడు. అన్ని పనులూ ఒంటరిగా చేయ సాధ్యం కాదు. ఎవరో ఒకరి సాయం వుండాల్సిందే.. వుదాహరణకు న్యూస్పేపర్ కావాలి అంటే తెచ్చుకోగలము   కాని సమయం అనుకూలించనప్పుడు పేపర్ బాయ్ సహాయం తీసుకుంటాము . ఇలా మనకు వచ్చే ఉత్తరాలు, పాలు  ఇత్యాది   విషయాల్లో మనం అవతలి వారి మీద ఆధార పడాల్సిందే .. అవి  భౌతికానికి  సంబంధించిన పనులు .. మనసంటూ ఒకటి  వుందిగా... ఆలోచనల పుట్ట .. మరి ఆ పుట్ట ఒంటరిగా ఎలా వుండగలదు ?    చీమలో పాములో వుండాలి కదా ..     తోడు  లేకుండా వుండలేదు.... అందుకే ఏదో ఒక విషయమై నిత్యమూ మర్దన చేసుకుంటుంది..తనని తాను .. విషయం లేకుండా అది  వుండలేదు.  ఆ విషయం ఏదైనా కావచ్చు వ్యక్తి  కావచ్చు భగవంతుడి ధ్యాస  కావచ్చు.. ఏదైనా కావచ్చు ...ఒంటరిగా  మాత్రం వుండలేదు.. "స్నేహం" ..... ఈ పదం అతి మధురం . భగవంతునిలా  కంటికి కనబడదు కాని ఎన్నో మాయలు చేస్తుంది గారడీలు చేస్తుంది. మనసుకు సంబంధించినదే, కాని భౌతికమైన  పాత్ర వహిస్తుంది .. బంధాలు అనుబంధాలు  పేరిట నొక్క బడి వున్న  మన జీవితా

మధురం, మధురం

స్నేహం అంటే ఏమిటి ?  ఏమిటి ఈ పిచ్చి ప్రశ్న అంటారా ..... ఎన్నో సంవత్సరాల నుండి ప్రయత్నిస్తూ వున్నాను సరి ఐన   నిర్వచనం తెలుసుకోవడం కోసం ...... ఒకరి కొకరు చేతిలో  చేయి వేసుకుని సినిమాలు షికార్లు తిరగడం , బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం , గంటల తరబడి మాట్లాడుకోవడం . ఎక్కడికైనా దూరం   వెళ్ళాల్సి వస్తే  మిస్ అవుతామని  ఏడవడం .........  ఏదైనా మాట పట్టింపు వస్తే విడి పోవడం .......... ఒకరి మీద మరొకరు  ద్వేషం పెంచుకోవడం ........ ఇదే స్నేహం అంటే మాత్రం ఒప్పుకోవడం  లేదు  మనసు.... . చదువుకునే పిల్లలు ఐతే స్నేహం పేరున పెడదారులు  పడుతున్నారు ..అదా స్నేహమంటే ... వుహూ, మనసు అందుకూ అంగీకరించడం లేదు.... ఈ  విషయం మీదే మనసు కేంద్రీకరించాను ..సమాధానం దొరికింది . ఆ విషయాలు నెమ్మదిగా ప్రస్తావిస్తాను ... అందాకా ఈ విషయం పై ఎవరైనా స్పందించాలని అనుకుంటే వారికిదే నా ఆహ్వానం ......... మరచిపోయాను .. నా ఈ బ్లాగుకి పెట్టిన పేరు స్నేహానికి ఒక చిన్న జ్ఞాపిక.