స్నేహంలో రకాలు

మనకు తెలిసిన  స్నేహాలు   కొన్ని మాత్రమె..... చదువుకునేప్పుడు క్లాస్మేట్స్ , బెంచి మేట్స్ , రూం మేట్స్ , వుద్యోగం చేస్తుండగా కొలీగ్స్, మనం నివసించే ఇంటి  ప్రక్కల వారు , ఇతరత్రా పరిచయస్తులు ఇలా ఎందఱో స్నేహితులు వుంటారు. మన నిత్య జీవితంలో  ఈ స్నేహాల  వల్ల సుఖ దుఖ్ఖాలు రెండింటినీ చూస్తాము అంటే అనుభవిస్తాము ఇది సహజం . కానీ   నాకో సందేహం .......... దు:ఖ్ఖం కలిగించేది నిజమైన స్నేహం ఎలా అవుతుంది? 
స్నేహం ...  వ్యక్తికి బలం కావాలి గాని, బలహీనత కాకూడదు. స్నేహం.... ఎటువంటి పరిస్థితులు అయినా ఎదుర్కునే శక్తి గలది కావాలి గాని , పరిస్థితులకు  లొంగనిది గా వుండాలి.  కొన్ని పరిస్థితులు మన   కర్మ ల ఫలితాలే, మనం కోరి తెచ్చుకునేవే కాబట్టి అవి మనకి బరువుగా మారతాయి.   స్నేహం మాత్రమె  వాటిని ఆ బరువుని దూది పింజేలా తీసి వెయ గలదు..
" స్నేహం"   అన్న  పదం(బంధం ) యొక్క  విశిష్టత చాలా గొప్పది అని మన పురాణాల   ద్వారా కూడా తెలుసుకున్నాము... ఐతే, స్నేహంలో కూడా రకాలు వుంటాయి అని ఈ మధ్యనే తెలుసుకున్నాను.
అవి  సఫల, సుఫల, విఫల స్నేహాలు.......... పేర్లు చాలా బాగున్నాయి కదు .. మరి ఆ స్నేహాలు ఎలా వుంటాయో తెలుసుకుందామా ..............
" మంచి స్నేహం కలకాలం నిలబడడానికి  ఇద్దరు స్నేహితుల మధ్య  ఒకరి మీద మరొకరికి నమ్మకం ,విశ్వాసం ఏంతో అవసరం " అని   తెలియచెప్పే  కధ చెప్తూ  అది ఏ  రకమైన స్నేహమో విశ్లేషించారు పెద్దలు ..
  పాండవుల పై విరోధం పెంచుకున్న దుర్యోధనుడు సూత పుత్రునిగా పేరు పొందిన కర్ణుని చేరదీసాడు. కర్ణునిలోని అపారమైన ప్రావిణ్యత  దుర్యోధనుని ఆకట్టుకుంది .. క్రమేణా ఇద్దరి లోనూ మంచి స్నేహం చోటు  చేసుకుని దుర్యోధనుని ఆంతరంగిక వ్యవహారాలలో కర్ణుడు ప్రధాన పాత్ర పోషించాడు.. దుర్యోధనుడు భార్యా సమేతుడై వున్నప్పటికీ చొరవగా ఆ గది లోనికి వెళ్ళగలిగిన అంతటి  స్నేహం పెంపొందినది ..   ఒక దినం అత్యవసర కార్యార్దిఐ కర్ణుడు దుర్యోధనుని అంతః పురం  లోనికి నేరుగా వెళ్లి పోయాడు .. అక్కడ దుర్యోధనుడు లేడు . ఆతని భార్య భానుమతీ దేవి తన పరిచారిక తో కలసి చదరంగం ఆట లో నిమగ్నురాలై వుంది..  భానుమతీ దేవి మంచం మీద కూర్చుని , పరిచారిక  ఒక  నిలబడి ఆడుతున్నారు.. అకస్మాత్తుగా  తన గదిలోనికి వచ్చిన కర్ణుని చూసి ,ఆసనం చూపి తన ఆటలో నిమగ్నురాలైంది భానుమతీ దేవి.. కర్ణుడు వారిద్దరి  ఆట ను పరికించసాగాడు..  ఆటను ఆసక్తిగా గమనిస్తున్న  కర్ణుడు పరిచారిక  ఓడి పోయే దశకు చేరుకునే సరికి అనుకోకుండా పరిచారిక ప్రక్కగా జరిగి ఆమె తరపున ఎత్తులు వేయడం మొదలు పెట్టాడు. ఇంతలో దుర్యోధనుని అడుగులు చప్పుడు వినిన భానుమతీ దేవి   భర్త రాకకై  ఎదురు వెళ్ళడానికి గబాల్న మంచం మీద  దిగి గుమ్మం వైపుగా వెళ్ళడానికి నియుక్తురాలు ఐంది .. తాను ఓడిపోతున్న దన్న వుక్రోశంలో ఆటను వదిలి వెళ్తుందేమో అన్న భావనతో కర్ణుడు తనకు తెలియకుండానే ఆమె నడుముకి వున్న వడ్డాణం పట్టుకుని లాగడంతో ఆ వడ్డాణం వూడి కర్ణుని చేతి లోనికి వచ్చింది.. వడ్డాణానికి  వున్న వజ్ర వైడూర్యాలు గది అంతటా  చెల్లా  చెదురుగా పడిపోయాయి ...ఈ హటాత్  పరిణామానికి  నివ్వెర పోయిన భానుమతీ దేవి అలా విగ్రహం లా నిలబడి పోయింది.. అంతలోనే  లోనికి అడుగిడిన దుర్యోధనుడు నివ్వెరపాటుతో నిలబడి వున్న తన భార్యను, తత్తర పాటుతో వున్న తన మిత్రుని చూసి  వంగి ,  క్రింద పడిన వజ్రాలను ఏరి తన భార్య దోసిలిలో పోసి , తన  చేతులూ  జోడించి..........  " నా మిత్రుని ద్వారా  తెలియక తప్పు జరిగి పోయింది కాబట్టి   ఆతనిని మన్నించండి   మహారాణీ    "............ అని వేడుకున్నాడు..
 ................
అదండీ నిజమైన స్నేహం అంటే.. ఈ రకమైన స్నేహాన్ని (దుర్యోధనుని స్నేహాన్ని ) సఫల స్నేహం అంటారు..
కానీ, కర్ణుని స్నేహాన్ని   విఫల స్నేహం గా    పేర్కొనడం జరిగింది.. కారణం...?
ఇద్దరు  మిత్రులలో ఒకరు తప్పు చేస్తున్నప్పుడు  మరొకరు  మందలించాలి.  తప్పుని సరిజేయ ప్రయత్నించాలి. కానీ కర్ణుడు దుర్యోధనుడు తప్పులు చేసిన ప్రతీసారీ ఆతనిని ప్రోత్సహించాడు తప్ప మందలించ లేదు సరికదా తానూ కూడా ఆ తప్పులకు చేయూతనిచ్చాడు.. ఫలితం  కురుక్షేత్ర యుద్దంలో ఒంటరి వాడయ్యాడు ...ఆనాడు తన ప్రాణ మిత్రుడైన దుర్యోధనుడు సరికదా కౌరవ పాండవులలో ఎవరూ  సహాయం చేయ లేక పోయారు అందువల్ల కర్ణుని స్నేహం విఫల స్నేహంగా పేర్కొన బడింది.             .   
       

           .            

కామెంట్‌లు

  1. కర్ణుని స్నేహాన్ని విఫల స్నేహం గా పేర్కొనడం జరిగింది annaru kada? E Grandham lo perkonabadindo kastha reference isthara?

    రిప్లయితొలగించండి
  2. manchi prashna. aite, idi oka charcha.. nenu pustakamlo chadivindi kaadu. aa charchalo bahusaa garikapaati vaaru anukuntaa, chaalaa andamaina vivaranato, vishleshistoo cheppaaru.. ika viphala sneham ani enduku annaaro meekoo telisi wuntundi. simple reason cheptaanu-- ganjaayi vanamlo okka tulasi mokka tho polchi choodandi.. mee medhassuki pani pettandi amri .. inko vishayam tulasi vanamlo okka ganjaayi mokka gurinchi koodaa aalochinchandi.. samaadhaanam meeku chaalaa baagaa ardham awutundi. meelo vishleshanaa shakti inkaa perugutundi.. thanking you....

    రిప్లయితొలగించండి
  3. aite ee prashna dwaaraa meeru naa post lo dorlina tappulu sarididde avakaasham kalpinchinatlu aindi..thank you..

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

నాన్న మాట అమ్మకి వేదం