నాన్న మాట అమ్మకి వేదం
నాన్న అన్నారు, "నేను లేకపోతే మీ అమ్మ ఎలా బ్రతుకుతుందో"అని.
అమ్మ చెప్పింది, "మీ నాన్న కోసం మా పుట్టింటి తరపు అందరినీ వదిలేసాను" అని.
ఆమెకు కోరికలు ఉండేవి. బుక్స్ చదువుతుంటే 'నేను ఒంటరిని అయిపోతాను 'అని ఆమె అలవాటు తన అలవాటు గా మార్చుకున్నారు నాన్న.
కుట్లు, అల్లికలు వదిలి, అమ్మ జీవితం తనకే అంకితం చేసేలా మార్చుకున్నారు నాన్న.
బంగారం ఎక్కడ ఉంటే ఆ భాగం కట్ చేసేస్తారు దొంగలు అని బోలెడు కధలు వినిపిస్తూ, పూలు మాత్రం కొని ఇచ్చి అమ్మకు జీవితాంతం పూలు పెడుతూనే ఉన్నారు నాన్న.
నీకే నా జీవితం అంకితం అంటూ తన ప్రపంచం లో తాను నలుగురి లో మెసలుతూ, అమ్మ మౌనాన్ని అమ్మ ప్రపంచం గా బహుమతి ఇచ్చేసారు నాన్న .
అమ్మ, నాన్న లేని అమ్మకి నేనే అన్నీ అనుకుంంటూనే అందరూ ఉండి,ఎవరూ లేనట్లు ఒంటరిని చేస్తారు నాన్న.
నా మాటే శాసనం అని మాటల్లో అనకపోయినా, నేను చెప్పిందే వేదం అనేలా ఉంటారు నాన్న.
జీవితపు చరమాంకంలో "నువ్వు చెప్పింది విని ఉండాల్సింది" అన్నారు నాన్న. అన్ని సంవత్సరాల జీవితం లో ఏం చెప్పిందని?
ఉండడానికి ఒక స్వంత ఇల్లు, పిల్లల చదువులు, భవిష్యత్తు.. అంతేగా.
అమ్మ జీవితం ముగిసే క్షణములో "నాకే గనక ఒక స్వంత ఇల్లు ఉండి ఉంటే " ఆ మాటకి నా హ్రుదయం. పొగిలి పొగిలి ఏడ్చింది..
విన్నారా ఎవరైనా.. వినబడదు.. కన్నీళ్ళ కారితే కద.
గుండెలోనే ఆవిరైపోయాయి కద.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి