మనిషి సాంఘిక జీవి .  ఒంటరిగా .బ్రతకలేడు... వుదయం నిద్ర లేచినప్పటినుండి రాత్రి నిద్రకు వుపక్రమించే వరకూ ఏదో ఒక పనిలో నిమగ్నుడై వుంటాడు. అన్ని పనులూ ఒంటరిగా చేయ సాధ్యం కాదు. ఎవరో ఒకరి సాయం వుండాల్సిందే.. వుదాహరణకు న్యూస్పేపర్ కావాలి అంటే తెచ్చుకోగలము   కాని సమయం అనుకూలించనప్పుడు పేపర్ బాయ్ సహాయం తీసుకుంటాము . ఇలా మనకు వచ్చే ఉత్తరాలు, పాలు  ఇత్యాది   విషయాల్లో మనం అవతలి వారి మీద ఆధార పడాల్సిందే .. అవి  భౌతికానికి  సంబంధించిన పనులు .. మనసంటూ ఒకటి  వుందిగా... ఆలోచనల పుట్ట .. మరి ఆ పుట్ట ఒంటరిగా ఎలా వుండగలదు ?    చీమలో పాములో వుండాలి కదా ..     తోడు  లేకుండా వుండలేదు.... అందుకే ఏదో ఒక విషయమై నిత్యమూ మర్దన చేసుకుంటుంది..తనని తాను .. విషయం లేకుండా అది  వుండలేదు.  ఆ విషయం ఏదైనా కావచ్చు వ్యక్తి  కావచ్చు భగవంతుడి ధ్యాస  కావచ్చు.. ఏదైనా కావచ్చు ...ఒంటరిగా  మాత్రం వుండలేదు..


"స్నేహం"..... ఈ పదం అతి మధురం . భగవంతునిలా  కంటికి కనబడదు కాని ఎన్నో మాయలు చేస్తుంది గారడీలు చేస్తుంది. మనసుకు సంబంధించినదే, కాని భౌతికమైన  పాత్ర వహిస్తుంది ..
బంధాలు అనుబంధాలు  పేరిట నొక్క బడి వున్న  మన జీవితాలకు ఈ స్నేహం ఒక ఊరట ఇస్తుంది .  స్నేహం స్వేఛ్చని కోరుకుంటుంది   పక్షిలా ఎగరాలని అనుకుంటుంది.. నెమలిలా  ఆడాలని అనుకుంటుంది.  ప్రకృతిని ప్రేమిస్తుంది..  ఎంతటి వారినైనా పసి పాపలా మార్చుతుంది... నవ్వుతుంది   నవ్విస్తుంది..   ఏడిపిస్తుంది కూడా... చూసారా ,ఎన్ని రంగులు మారుస్తుందో .. కాని,  నిజమైన స్నేహం అడుగులు వేయిస్తుంది...నడక  నేర్పుతుంది...     

... తప్పటడుగులు వేస్తున్నప్పుడు మందలించి తన చేతిని అందిస్తుంది.. ఇదిగో ఇలా ...







                                అదీ నిజమైన స్నేహం  






 స్నేహం   తల్లి అవుతుంది . తండ్రి ప్రేమని అందిస్తుంది. గురువు అవుతుంది.  ఎప్పుడు ? సక్రమంగా వినియోగించుకున్నప్పుడు . భౌతికంగా  దగ్గర వున్నా, లేకున్నా తోడు వుంటుంది.. తనవారి క్షేమం కోరుకుంటుంది.
 
త్వమేవ మాతాచ,పితా త్వమేవ
 త్వమేవ బంధు, సఖా   త్వమేవ
త్వమేవ విద్యా  సకలం త్వమేవ
త్వమేవ సర్వం మమ  దేవదేవా

సర్వ కాల సర్వావయస్థల యందు నాకు తల్లియై,  తండ్రియై ,  బంధువై, గురువై , స్నేహితుడై అన్నింటా తానై నాకు తోడూ నీడగా వుండి, తాను  ప్రత్యక్షంగా వున్నాన్నన్న అనుభూతిని కలిగిస్తూ, నిజమైన స్నేహం అంటే ఏమిటో తెలిసేట్లు చేసిన  ఆ షిర్డీ సాయినాధుని నా నిజమైన స్నేహితునిగా  తలచి (మనసా, వాచా, కర్మణా)   పై వాక్యాలు వ్రాయగలిగాను..                                                          
                                                                                ( నిజమైన స్నేహానికి నిరూపణలు రేపటి రోజు )  

                                                                                                     

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం