మనం ప్రశాంతంగా వున్నామా ?

ఆకాశం , భూమి , ,సూర్యుడు,  చంద్రుడు, మనం అంటే ...మానవులం.   సృష్టిలో ఎన్నో రకాల  జీవులు వున్నాయి . అందరికీ తెలిసిన విషయమే.. అన్ని జీవుల లోనికి మానవ జన్మ ఉత్కృష్టమైనది అన్న విషయం కూడా తెలిసినదే.. మిగిలిన జీవజాతులలో   లేని కొన్ని ప్రత్యెక లక్షణాలు వుండడమే ఆ వుత్క్రుష్టత కు కారణం.., వినడం ,చూడడం ,తినడం , నడవడం , పరుగులు పెట్టడం , పడుకోవడం ఇవన్నీ అన్ని  జీవ జాతుల లో సర్వ  సామాన్య మైన లక్షణం.. కానీ మానవుని ప్రత్యెక లక్షణం కర్మాచరణం, ఆలోచనా శక్తి కలిగి వుండడం.  ఆలోచనా శక్తి  ఎక్కడ నుండి వచ్చింది   అంటే మనసు నుండి అంటారు. మనసే  ఆలోచనల సమాహారం ఐనప్పుడు    ప్రత్యేకంగా ఆ శక్తి ఎక్కడ నుండి వచ్చింది  అని ప్రశ్న అవసరం లేదు కదా ... మానవులలో ఈ మనసు చేసే గారడీ అంతా,ఇంతా కాదు . ఆ మనసుని ఆధారం గా చేసుకునే  అల్లినా , కధలు వ్రాసినా ...నీకు మనసు లేదా అని చాలా ఈజీ గా అనేస్తాము .. కాని తలచుకుంటే  "అమ్మో, మనసు"  అనిపిస్తుంది...ఆలోచనలు ఒక్కటే కాదు , దయ ,జాలి ,ప్రేమించే హృదయం, కారుణ్యత ను కలిగి వున్న వాడు నిజమైన మానవుడు అనిపించుకుంటాడు ..ఇక అసలు విషయం లోనికి వస్తాను .. ఈ మనసు గారడీ వలలో  చిక్కుకున్న మానవుడు కష్టాల పాలు ఎందుకు అవుతున్నాడు.. ఎందుకు దుఖ్ఖితుడు అవుతున్నాడు అంటే క్షణ మాత్రం లో విచక్షణా శక్తిని ,  జ్ఞానాన్ని లొంగ దీసుకునే శక్తి మనసుకి వుంది. అంత బలమైనది కాబట్టే ఈ నేరాలూ ,ఘోరాలూ ప్రపంచం లో చోటు చేసుకుంటున్నాయి ..మనది మాయా  మోహిత జీవన గమనం .. ఈ గమనం లో ఎన్నో సమస్యలు , ఏదో అశాంతి , ఆదుర్దా, ఆందోళన....మన  ఇంద్రియాలు మన అదుపులో వుండవు. మనసు  ఆధీనం లో వుంటాయి. అది ఎలా ఆడిస్తే అలా  ఆడతాయి .. మెదడు కి వున్న శక్తి ఆ క్షణం లో గుర్తు రాదు ఎవరికీ.. అసలు మన శరీరాన్ని నియంత్రించేది మెదడు ఐతే మనం మాత్రం మనసుకి   లొంగిపోతుంటాము...  అందుకే ఇన్ని అనర్ధాలు అని మాత్రం గ్రహించం.. పుడతాము ,,పెరుగుతాము,  ఈ లోకం విడిచి పెట్టి వెళ్లిపోతాము . ఇదొక చక్రం . ఈ చక్రంని  సాఫీగా తిరగనీయక నిత్యం ఏదో  సమస్య  సృష్టించు కుంటాము... ఆ చక్రం లో ఇరుక్కు పోతాము.. అందుకే ఎన్నో   ప్రశ్నలు మనలో వుదయిస్తూ వుంటాయి.. ఆ ప్రశ్నలకు జవాబు సరియైన సమయంలో మనకు అవసరం అనుకున్న సమయంలో  దొరకక ఇబ్బంది పడుతూ వుంటాము .. చాలా కాలం క్రిందట మీ సమస్యలకు భగవద్గీత పరిష్కారం అన్న పుస్తకం నా చేతికి వచ్చింది .. పరిచయం  చేయాలి అనిపించి నా ఈ చిన్న ప్రయత్నం నాతొ పాటు అవసరం పడిన వారికి  ఎవరికైనా వుపయోగ పడగలదు అన్న ఆలోచన ...................................           









          

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం