ఇక్కడ రచయిత ప్రస్తుత సమాజం లో  మన జీవన విధానం ఎలా వుందో చెప్తూ  ఒక విషయం  ప్రస్తావించారు .---------రోగాలన్నింటికీ ఒకటే మందా ? అందరికీ  భగవద్గీతే దిక్కా ?జీవితంలో  దెబ్బ  తిన్నవారికి, నష్టపోయినవారికి, సంసారం నుండి పారి పోదలచిన వారికి   కావాలి గాని కళ్ళు , కాళ్ళు బాగానే   వున్న మాకెందుకు ? అని ఈ రకమైన ప్రశ్నలతో ఆధునికత అలవడిన ఎందఱో బాహాటం గానే విమర్శిస్తున్నారు ... ఇది నిజమేనా .. నిజం కాకపొతే మరేమిటి మన జాతికీ ఖర్మ ? ...........అని .............!
భగవద్గీత  అందరి కోసం... చూపు వున్న ప్రతివాడికి వెలుగు ఎలా అవసరమో,  శక్తి వున్న ప్రతి జీవికి భగవద్గీత శ్రవణం అవసరం అని కూడా చెప్పారు ...సూర్యుడి అవసరం లేని వాడిని బుద్దిహీనుడు అని, ప్రాణవాయువును తిరస్కరించే వాడిని మూర్ఖుడు అని అంటారని కూడా చెప్పారు .........మనం ఏ పని అయినా  ప్రయోజనం వుంటేనే  అన్నది జగమెరిగిన  సత్యం .. కనీసం ప్రయోజనం  కోసం అయినా ఆ భగవన్నామ స్మరణ చేయడానికి అవకాశం దొరికినట్లే కదా.............
   ఇక పరిష్కారం లేని  సమస్య అంటూ వుండదు.. ఒక   విషయాన్ని మనం సమస్యగా భావిస్తేనే అది మనకు పెద్ద తలనెప్పిగా మారుతుంది..   సమస్యగా   భావించకపోతే ఏ ఇబ్బందీ వుండదు . కానీ మనం మామూలు మనుషులం .. సమస్య అంటే సమస్యే ... అంత  తేలికగా  తీసుకోలేము మరి.. సమాజం లో  జీవించే ప్రతివారికి    
తారస పడే సమస్యలకు భగవద్గీత ఎలాంటి పరిష్కారం చూపిస్తుందో తెలుసుకోవాలనే కుతూహలంతో చదవడం మొదలుపెట్టిన రచయితకు ప్రతి శ్లోకం లో ,ప్రతి పదంలో సమస్యా పరిష్కారాలే ద్యోతక ద్యోతకమయ్యాయట ...అవే ఒక పుస్తకంగా మన ముందు వుంచారు రచయిత.. వున్నది   వున్నట్లుగా కాకపోయినా నా శైలిలో పరిచయం   చేసే ప్రయత్నం చేస్తాను .. పుస్తకం అంతా కాకపోయినా మనకు  ముఖ్యమైనవి వ్రాస్తాను....

సమస్య: -- ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా మనస్సుని ఆవరించి వున్న నిరుత్సాహం విడిచి పెట్టక, ధైర్యం సన్నగిల్లి   ఏ పని చేయాలన్నా ఏదో భయం ఏమైనా కీడు జరుగుతుందేమో అని ... బాగా క్రుంగి పోతున్నాను . పరిష్కారం ఏమిటి?   నేనేమి చేయాలి ?


                       క్లైబ్యం మాన్మ  గమః   పార్ధ ! నైతత్త్వయ్యుపపద్యతే !
                        క్షుద్రం  హృదయ దౌర్బల్యం త్యక్తోవత్తిష్ట పరంతప !


 పరిష్కారం :---   నిరుత్సాహం  కూడదు అర్జునా !   నీలోని శక్తి నీకు తెలియదు .. ఎన్నో విజయాలు సాధించిన నీవేనా  ఇలా  క్రుంగిపొయేది ? ధైర్యం తెచ్చుకో ..   హీనమైన పిరికి తనాన్ని వదిలేయి . దైవం మీద భారం వేసి , వుత్సాహం తో కర్తవ్య నిర్వహణకు నడుం బిగించు . తప్పక లక్ష్యాన్ని సాధిస్తావు ..

             (ప్రతి జీవిలో ఏదో  శక్తి అంతర్గతమై  వుంటుంది   ఆ  శక్తి  విలువ మనకు తెలియదు.. దానిని వెలికి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి గాని నిరుత్సాహపడకూడదు  )













                          .












 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం