ఎవరిని చూసి , ఏ బంధుజనాన్ని చూసి మనసు వికలము కాబడుతుందో ఆ బంధుజనం ముందు అర్జునుని నిలబెట్టాడు శ్రీకృష్ణుడు.. ఎంత కఠినతరమైన అవస్థ అది ? గీతోపదేశమునకు క్షేత్రం అక్కడే తయారగుచున్నది . . ఇక్కడ మనస్సు అర్జునుడిగా , అరిషడ్వార్గాలు మనయొక్క బంధుజనంగా భావించినటులైన మన శరీరం గొప్ప యుద్ధక్షేత్రంగా మారుతుంది ..కౌరవులు అన్నివిశాలా పాండవులకు అపకారమే చేశారు .. వారికి దక్కవలసిన రాజ్యం లాక్కొని కూడా నానా హింసలకు గురి చేశారు .. బుద్ధినాశాత్ప్రణశ్యతి -బుద్ధి చేసినచో మనుష్యుడు చెడిపోవును,. నశించిపోవును అని గీతలో ఆ శ్రీకృష్ణపరమాత్ముడు చెప్పి ఉన్నాడు. ..దీనిని బట్టి ఎవరెవరి బుద్ధి శుద్ధత్వము లేక అవగుణాలతో కూడి ఉండునో,అట్టివారు జీవితరంగమున దుర్యోధనుని అపయశస్సు,అపజయం,వినాశం తప్పక పొందగలరు . ఇటువంటివారి సాంగత్యంలో ఉంది దుర్యోధనునికి ప్రియం చేయు వారందరూ యుద్ధరంగమున ఉన్నారు . పాపమును ప్రోత్సహించుట మహాపాపం . అందువల్ల దుర్యోధనుని వంటి దుర్భుద్ధి గల వారిని ఆశ్రయించడం గాని ,ఆతని పక్షాన గాని నిలవడం ఎప్పటికీ తగదు ..
నిద్రను జయించినవాడు, తమోగుణాన్ని నిర్జించిన వారు ఉత్తములుగా చెప్పబడతారు .
ఏ స్వజనమును చూసి అర్జునుడి మనసు వికలమైపోయిందో అట్టి స్వజనం ముందే శ్రీకృష్ణుడు అర్జునుని నిలబెట్టడం జరిగింది .
మహా శక్తివంతుడైన అ ర్జునుడు కూడా ఇక్కడ బంధు ప్రీతికి లొంగసాగాడు .. ఎంతటి శారీరిక బలం,శక్తి సామర్ధ్యాలు ఉన్నప్పటికీ మనసు అదుపులో లేనట్లైనా మనిషి ఒక్క క్షణంలో కృంగిపోగలడు అని రుజువు అవుతున్నది . మనసుకి చికిత్స చేయకపోతే శరీరం ఎంత అందమైనది అయినప్పటికీ ,ఎంత సౌష్టవం కలది అయినప్పటికీ జబ్బులకి గురి కాక తప్పదు
కాబట్టి ఆత్మజ్ఞానంతో ప్రవర్తించినప్పుడు మాత్రమే, మనసుని మన ఆధీనంలో ఉంచుకున్నప్పుడు మాత్రమే మనిషికి (జీవుడికి) నిరతిశయానందము , దుఃఖ్ఖ రాహిత్యము కలగజేయగలవు ..
ఇంతకుముందు మనోయోగ సాధనలో ఈ విషయాలు వివరించడం జరిగింది .
మానసిక వైరాగ్యం కలిగినప్పుడే మనిషి ఇటు ప్రాపంచికము మరియు ఆధ్యాత్మికంగా ఉన్నతి స్థితికి చేరగలడు ..
అరిషడ్వార్గాలతో చుట్టుముట్టబడిన పద్మవ్యూహం వంటి యద్దరంగాన్ని మనసు జయించినప్పుడు మాత్రమే మనిషికి మోక్షం లభించగలదు ..

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి