Content

Tuesday, September 7, 2010

రెండుగంటలముందు మా ఇంట్లో అద్దెకి ఉన్న ఆమె మా ఇంటికి వచ్చారు.. ఒరిస్సా వాస్తవ్యులు....
భర్త సేల్స్ ఎక్జిక్యూటివ్ ఏదో మెడికల్ కంపెనీలో... భర్త తన ఉద్యోగధర్మంలో భాగంగా ఆయా వూర్లు తిరగాలి.. పైగా రెండున్నర సంవత్సరాలకొకసారి ట్రాన్స్ఫర్లు...ఈమె, తన రెండవ తరగతి చదువుతున్నకుమారుడు
ఇంట్లో వుంటారు.. ఆమెతో మాట్లాడుతున్నంత సేపూ శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీత భొధిస్తున్నట్లు అన్పించింది.... నా అనుభవాలు ఇంచుమించు అవే ఐనప్పటికి (ఒక స్త్రీగా) నేను నోరు మెదపకుండా తను చెప్పేది నవ్వుతూ వింటూ వున్నాను.. నిజంగా అనుభవాలు మనిషికి పరిపక్వతనిస్తాయి అన్నదానికి ఆమె ఒక ఉదాహరణ...ఒరిస్సాలో ఒక మారుమూల పల్లెటూరులో జన్మించి పెళ్ళి చేసుకుని అత్తవారింట అడుగుపెట్టిన ఆమె అక్కడి వారి భొజన అలవాట్ల గురించి మాట్లాడుతూ,, బాబీ,, వెజ్ నుండి నేను నాన్_వెజ్ లొ పడ్డాను..ఐనప్పటికీ వారి ఇచ్చానుసారం నేను నాన్_వెజ్ వండడం అలవాటు చేసుకున్నాను..ఆడవారు ఎప్పుడూ బయటికి రాని సంస్కృతి మా అత్తవారింట్లో... నేను నా ఇంటిపనుల కోసం బయటకు వెళ్ళడం,పసి పిల్లవాడు జలుబు చేసినా జ్వరం వచ్చినా ఎవరో ఒకరి సాయంతో పరుగులు పెట్టడం, తప్పలేదు.. ఆక్షేపణ తెలిపిన మా మామగారికి డైరెక్టు గా నేను చెప్పకపోయినా మా అత్తగారితో నా పరిస్థితి వివరింపజేసాను.. ఇంట్లో ఏమీ లేని సమయంలో నేను బయటకు వెళ్ళకపోతే మీ అందరి ఆకలి ఎలా తీర్చగలను అని?తర్వాత్తర్వాత నా పరిస్ఠితి అర్ధం చేసుకున్నమావాళ్ళు నన్ను ఏమి అనడం మానేసారు....ఏమీ తెలియని ఒంటరితనం నాకు అన్నీ నేర్పింది... ప్రకృతి అన్నీ నేర్పుతుంది మనకి......... ఇవన్నీ నాకు తెలిసిన విషయాలు ఐనప్పటికీ అమృతం తింటున్నట్లు వింటూ కూర్చున్నాను....బాబీ,ఆడవాళ్ళు,మగవాళ్ళు అన్న వ్యత్యాసం తల్లిగా మనమే చూపిస్తాము. అది నాన్న,ఇదినాన్న అంటూ కూర్చున్నదగ్గరనుండీ పడుకునేవరకూ అన్ని సౌకర్యాలూ అమర్చుతాము..అదే ఆడపిల్ల ఐతే ఇంకో ఇంటికి వెళ్ళాల్సినదానివి,మాకు చెడ్డపేరు అని మరీ వంచడానికి ప్రయత్నం చేస్తాము...తప్పు మనం చేస్తాము.. నింద వాళ్ళమీద వేస్తాము..ఏం తన షూస్ తను పాలిష్ చేసుకుని,స్టాండులో అమర్చుకునేట్లు మనం అలవాటు చెయ్యలేమా?? ఒకగ్లాసు మంచినీళ్ళు తెచ్చుకుని త్రాగేటట్లు అలవాటు ఎందుకు చెయ్యలేము?ఇలా పెంచిన మనం మళ్ళీ వాళ్ళతో పొట్లాడడం ఎందుకు.....

ఇలా సాగిందండీ సంభాషణ..(అంతా హిందీలో)...నిజంగా నిజం...తల్లి కొడుకుకి ఒక ఉన్నత స్థానం ఇస్తుంది..నాకు తెలిసిన ఒక డెబ్బై ఏళ్ళ మాష్టారు ఒంటరిగా వుంటారు.."ఎందుకు ఇలా, మీ భార్యను తెచ్చుకోవచ్చుకద" అని అడిగాను...ఆ వయసులో ఆయనకి ఏమి జరిగినా దిక్కు ఎవరూ ఉండరని.....నా కంటే కొడుకు ఎక్కువయ్యాడు. "నాతోరా" అని అడిగాను. కొడుకుకి కోడలు కి తన అవసరం ఎక్కువ ఉంది కాబట్టి రాను అంది. ఉండనీ, "..అన్నారు సింపుల్ గా. .ఇది ఈనాటి విషయమా...తరతరాలనుండి మన నరాల్లో పాతుకుపోయినది.. మరి ఇప్పుడు ఎన్ని పోరాటాలు సాగించినా, ఎన్ని కలలు కన్నా ఎక్కడి నుండో ఆకాశం నుండి రాత్రికి రాత్రి దిగివస్తుందా సమానత్వం ???నిజం చెప్పండి,కొడుకులంటే ప్రాణం పెట్టని తల్లులెవరయినా వున్నారా? కాని అదే కొడుకులు తమ తల్లిని అనాధగా రోడ్డుమీద వదిలి వెళ్ళిపోయిన సంఘటనలు ఎన్నో.. కూతురు వేరే ఇంటికి వెళ్ళిపోయింది కాబట్టి తను వున్నా లేనట్లే అనుకుంటారా ఇటువంటి సమయాలలో...మరో ముఖ్యవిషయం...కొడుకులు వంతులు వేసుకుని వదిలివేసిన తల్లి ఏంచెయ్యాలో తెలియక అయోమయస్థితిలో వున్నప్పుడు అల్లుడు,కూతురు మేమున్నామని ముందుకొస్తే,
ఆస్థికోసం మాత్రమే తల్లిని చూస్తున్నారని నిందలు వేసిన ఒక ప్రబుద్దుడు ఈ మధ్యే కనిపించాడు.. అప్పుడు మా వారు.........తను ఏడవలేడు,, ఇంకొకరిని ఏడవనీయని ఘటం ఇది అని మరో మాట అన్నారు..............................అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినానివ్వదు అంటారు..ఈ లాంటి సామెతలు ఎలా వెలుగులోనికి వచ్చాయో ఇప్పుడు అర్ధమవుతుందని....
అందుకే...అడుగుతున్నాను..........ఇప్పుడు చెప్పండి....కేవలం ఆస్థులు, డబ్బు వీటిలొ మాత్రమే సమానత్వం కావాలా?? దాని బదులు "ఆడవారిని చిన్నచూపు చూడవద్దు...గౌరవించండి..గుడిలో అమ్మవారికి రెండు చేతులు జోడించి మనస్పూర్తిగా నమస్కరిస్తాము..ఇంటిలోని ఆడవారికి నమస్కారములు అక్కర్లేదు..మర్యాదనివ్వండి..బయటివారితో వెకిలిగా ప్రవర్తించకండి...భగవంతుడిచ్చిన అందాన్ని కాపాడుకోండి. వారి మనసెరిగి ప్రవర్తించండి.".....అనుకుంటే..............ఇది చాలండి...........తల్లి పాలిచ్చి పెంచుతుంది.. కష్టం కలగకుండా కాపాడుతుంది..సపర్యలు చేస్తుంది.. వయసు పైబడిన తర్వాత తన కొడుకు బాగోగులకై మరొక స్త్రీ (తల్లి) చేతిలో పెడుతుంది... ఇది ఇంతే...ఇలా చక్రం తిరుగుతూనే ఉంటుంది.
మార్పు వుండదు... మార్పు మనస్థత్వాలలో ఉంటుంది.. పెరిగే కొలది మారుతుంటుంది...ఏమి జరిగినా,ఎన్ని మార్పులు వచ్చినా స్త్రీ, స్త్రీయే....... ఎన్ని కష్టాలు వచ్చినా,,ఏ బంధం లో ఐనా అందంగానే ఉంటుంది, ఈ ప్రకృతి లా............ కద....

© Rukmini Devi J
mmanindarkumarTwitter:ACMWCTRss:mk

1 వ్యాఖ్యలు: