గీతా స్వరూపము

ప్రపంచమున ఎన్నియో గీతలు కలవు. అష్టావక్ర గీత, అవధూత గీత, ఋభు గీత, బ్రహ్మగీత, వసిస్టగీత,గణేశగీత,హనుమద్గీత,పరాశరగీత,హరితగీత,శివగీత,హంసగీత,భిక్షుగీత,కపిలగీత,దేవీగీత మున్నగు అగణితములైన గీతలు విశ్వసాహిత్యమున వెలయుచున్నను,భగవద్గీత యొక్క దానికే గీత యను నామము చక్కగ రూడీపడినది. గీతది మాతృహృదయము..ఒక గ్రంధము మాత్రమే కాదు. సజీవచైతన్యమూర్తి..గీత కల్పవృక్షము వంటిది..ఉఅపనిషత్సారము గీత..గీత ఒక యజ్ఞము..గీతా జ్ఞానము అనంతము.. భారత సర్వస్వము గీత.ఆధ్యాత్మ వాజ్మయమున ముముక్షువులకు ప్రస్థానత్రయ(దశోపనిషత్తులు,భగవద్గీత,బ్రహ్మసూత్రములు) మిళితము..గీత నిత్యజీవితసంగిని.. శొకరాహిత్యము,ఆనందప్రాప్తియే గీతా లక్ష్యము. గీతయందు సర్వయోగసమన్వయము, సర్వ భూతదయసమత్వము, కనిపిస్తాయి..త్యాగము, సన్యాసమునకు భాష్యము...యోగము,తపస్సులకు అద్దం పత్తినది. మానవుని దేవునిగ మార్చివేయగల శక్తిస్థోమతలు గీతాభోధకు గలవు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం