ధ్యానమార్గం



సామాన్యం గా మనం చిన్నపిల్లలనుండి పెద్దవారి వరకూ అడిగే కామన్ ప్రశ్న...."పెద్ద ఐతే ఏం చదువుదామని అనుకుంటున్నావు ? లేదా ఏం చేద్దామనుకుంటున్నావు"  అని.. కద...ప్రశ్న ఎలా అడిగినా దాని అర్ధం ఒక్కటే.. లక్ష్యం...అంటే "నీ లక్ష్యం ఏమిటి" అని అడగడం అన్నమాట.. మళ్ళీ ఇంకో ప్రశ్న కూడా వేస్తాము. "నీ లక్ష్యసాధనకు ఏం చేస్తావు" అని.  చిన్నపిల్లలైతే అలా చదువుతాను, ఇలా చదువుతాను అని తమ ప్రణాళిక చెప్తారు. పెద్దవాళ్ళు ఐతే వారి ఆలోచనలు పంచుకుంటారు. కద. ..సహజంగానే మనం మెచ్చుకుంటాము..మరి మనం చదువుకుని, ఉద్యోగాలు చేసి మనల్ని మనం బ్రతికించుకోవడానికి ఇన్ని ప్రణాళికలు అవసరం ఐనప్పుడు, మనల్ని జీవింపజేసుకోవడానికి ఇంకెన్ని ప్రణాళికలు అవసరం అవుతాయి.. ఏమిటిది, బ్రతకడం, జీవించడం అని వేరు, వేరుగా చెప్తున్నారు అంటున్నారా ? ఒక మొక్కకి నీరు పోస్తే అది బ్రతుకుతుంది. కాని దానికి ఎండ వేడిమి, ఇతరత్రా మినరల్స్ దొరికితే పూలూ. పళ్ళతో మన మనసుల్ని పులకరింపజేస్తుంది..ఆనందభరితుల్ని చేస్తుంది కద.  ఇలాంటి ఎన్నో మొక్కలు, వృక్షాలు ప్రకృతికి జీవం పోస్తాయి కద. నా మాటల్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి.. బ్రతకడానికి, జీవించడానికి తేడా తెలుస్తుంది..అలానే మన ఈ శరీరానికి కావలసినవి అందించడం ద్వారా మనం బ్రతుకుతున్నాము, మన హృదయాంతరాళంలో దాగి వున్న ఆనందాన్ని వెలికి తీయడం తెలుసుకుని జీవిస్తున్నాము..మరి ఈ ఆనందం ఏమిటి? మనం రోజూ సినిమాలు చూస్తూనో, మనకి కావల్సినవి పొందడం ద్వారానో ఆనందంగానే వున్నాము కద అని అనుకుంటున్నారు కద.. అది మనం సాదించామన్న ఒక తృప్తికి నిదర్శనం మాత్రమే. అసలైన ఆనందం వేరే వుంది.. అది నీలోనే వుంది.. ఆ విషయం తెలుసుకునే మార్గమే ధ్యానమార్గం..

చాలామందికి ఒక సందేహం.. ధ్యానం అంటే ఏమిటి? అని.. ..  ధ్యానం అంటే ఒక చీకటి గదిలో కూర్చుని కళ్ళు మూసుకుని వుండడం, ఏదైనా అనుభవాలు కలిగితే మనం గొప్ప వాళ్ళం అవుతాము కద అంటారా.....కాదు... అది సమాధానం కాదు.. ధ్యానం అంటే ఏకాగ్రత... మనం ఏకాగ్రతతో ఏం చేసినా అది ధ్యానమే అవుతుంది..ధ్యాస పెట్టడం.. దేనిమీద.. ఏదో ఒక పదార్ధం మీద.. అది భగవంతుడు ఐనా కావచ్చు లేదా మరేదైనా కావచ్చు..(మహర్షులు ఎంతో తపస్సు చేసి ఈనాడు మనకు అందించిన వరం ధ్యానం అని నేను చెప్పగలను..వారు అతి కఠినత్వంతో సాధించినది మనకి చాలా సులువు పద్దతి అయ్యింది.

బుద్ధభగవానుడికి భోదివృక్షం క్రింద జ్ఞానోదయం అయ్యింది అని మాత్రమే చదువుకుంటాము.. ఏం జ్ఞానోదయం అయ్యింది అన్నది మనకి ధ్యానం ద్వారా మాత్రమే తెలుస్తుంది.. వీలు దొరికినట్లైన "దమ్మపదం" అన్న పుస్తకం చదవడానికి ప్రయత్నించండి..)

ప్రతి మనిషిలో ఒక శక్తి వుంటుంది. ప్రకృతిలో అప్రతిఘట శక్తులు వుంటాయి. మనిషి తనను తాను తెలుసుకుని, తనలోని శక్తిని వెలికిదీసి ప్రకృతికి బానిసలుగా వుండు తత్త్వముని ప్రతిఘటించడానికి దోహదపడే శక్తియే ధ్యానం అని తెలిపారు మహర్షులు..

ఇప్పుడు అసలు రహస్యానికి వద్దాము.. గౌతమబుద్ధుడికి కలిగిన జ్ఞానం ఏమిటి అంటే ఒక కధనం విన్నాము..ఆయన ఒకనాడు భోది వృక్షం క్రింద కూర్చుని ఎన్నో శ్రమలకోర్చినా ఈ జీవన రహస్యం అంతుబట్టడం లేదని విచారిస్తూ కళ్ళుమూసుకుని కూర్చున్నారట.. చాలాసేపటి తర్వాత ఒక్కసారిగా
ఆయన దృష్టి తనలో జరుగుతున్న ఉచ్చ్వాస,నిశ్వాసాల మీదకు వెళ్ళిందట. . ఒక తలంపు.. ఈ శ్వాస ఆగిపోతే ?.. మనిషి ఒక శవమే కద. మనిషి జీవనాధారమైన శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఆయన అందరికీ వివరించసాగారట.. మనిషి తన శ్వాస మీద ధ్యాస పెట్టడమే " ధ్యానం"...అని ఉద్భోదించారు మహర్షులు.

కొందరు భగవంతుని నామస్మరణ ఏకాగ్రతతో చేస్తారు.. కొందరు వంటలు ఏకాగ్రతతో చేస్తారు..అదీ ధ్యానమే..కాని, మన శ్వాస మీద ధ్యాస పెట్టడం అనేది మనలోని శక్తిని మనకు తెలుపుతుంది.ఐతే ఈ ధ్యానం ఎలా చెయ్యాలి అంటే.......ఒక ప్రశాంతమైన ప్రదేశంలో చెయ్యాలి అని చెప్పడం జరిగింది..ప్రశాంతత కోసమే కద ధ్యానం చేస్తున్నాము..మరి ఈ రణగొణ ద్వనుల మధ్య ప్రశాంతమైన ప్రదేశం ఎక్కడ దొరుకుతుంది అని
కలవరపడకుండా, మన ఇంటిలో గాని, దగ్గరలో ఏదైనా ధ్యాన మందిరం వుంటే అక్కడకు వెళ్ళి గాని ధ్యానం చేసుకోవచ్చు..

ధ్యానం చేసే పద్దతి............ధ్యానం చేయబోయే ముందు మంచినీళ్ళు త్రాగాలి...పద్మాసనమ్ గాని. సుఖాసనం గాని ఎలా అనుకూలంగా వుంటే అలా   పూర్తిగా సర్దుకుని కూర్చున్న తర్వాత నిదానంగా కళ్ళు మూసుకోవాలి.. నెమ్మదిగా ఊపిరి పీలుస్తూ, వదులుతూ మన ధ్యాస కేవలం మన శ్వాసమీద పెట్టాలి. కళ్ళుమూసుకున్న వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోయాను అన్న భ్రమలో వుండకూడదు. ఎందుకంటే మనం కళ్ళుమూసుకుని కూర్చున్న తర్వాత మన కళ్ళముందు ఎన్నో ఆలోచనల ప్రవాహం సాగుతూ వుంటుంది.
మరెలా.. ? వాటిని కట్ చేస్తూ వుండాలి.. ఒక ఆలోచన వచ్చింది..మనం ఎటో వెళ్ళిపోతుంటాము. వెంటనే తెలివి తెచ్చుకుని కట్ చెయ్యాలి. ఇలా నెమ్మదిగా సాధన చేస్తూ వుంటే, అసలు ఆలోచనలు రాని స్థితికి చేరుకుంటాము.. అదే "శూన్య స్థితి"..  ఈ సూన్య స్థితి గురించి తర్వాత వివిరిస్తాను.

  శ్వాస ఆడితే మనం. లేకుంటే శవం. శవంలా మారకుండా వుండే మార్గం లేదు గాని, బ్రతికినన్ని రోజులూ జీవచ్చవంలా కాకుండా జీవంతో వుండే మార్గం "ధ్యానమార్గం".

హృదయాంతరాళాల్లో దాగి ఉన్న నిజమైన ఆనందాన్ని వెలికిదీసే మార్గమే "ధ్యానం".. ఆధ్యాత్మిక మార్గాన సులభంగా పయనింపజేసే మార్గం ధ్యానం.
హాయిగా ప్రాపంచికంగా గడపకుండా ఈ ధ్యానం ఏమిటి అని ప్రశ్నించేవాళ్ళని చాలా మందిని చూసాను.
 ఆధ్యాత్మికత అంటే "నిన్ను నీవు మరచిపో" అని కాదు, "నిన్ను నీవు తెలుసుకో" అని చెప్తున్నారు మహాత్ములు .
"పూసల గొలుసు లేదా వజ్రాల గొలుసు రెండూ మెడకు అందాన్ని ఇస్తాయి. ఆ రెండింటి మద్య విలువలలో తేడాని గుర్తించడం మానినప్పుడు మానవుడు ఏ గొలుసు వేసుకున్నా ఆనందం గానే వుంటాడు", అని వివేకానందుల ఉవాచ..

ఇదే విషయం శాకాహార, మాంసాహారాల గురించి కూడా వర్తింపజేసుకోవచ్చు..ఏది తింటే మన ఆరోగ్యానికి మంచిదో గుర్తుంచుకుని తింటామో అలానే మన జీవితం ఎలా వుంటే మనం ఆనందంగా వుంటామో గమనించాల్సిన విషయం..అందువల్ల మాంసాహారం ధ్యానం చేయనీయదు అన్న సందేహం కాకుండా అందరమూ ధ్యానమార్గాన ప్రయాణించడానికి అర్హులమే.. పయనం సాగించేప్పుడు మనిషి తన ఆహారపుటలవాట్లు తన అదుపులోనికి తెచ్చుకోగలడు అన్నది వాస్తవం.

బ్రతకడానికి తింటున్నాము గాని, తినడానికి బ్రతకడం లేదు అని గుర్తించడం ఆధ్యాత్మిక ప్రయాణానికి గుర్తు.

మానవుని, భగవంతుని కలిపే వారధిగా ధ్యానాన్ని వర్ణించారు పెద్దలు.
తన చుట్టూ వున్న ప్రాపంచిక ప్రలోభములు, ఆందోళనలతో సతమతమవుతూ వుండే మానవుడు ప్రశాంతతను కోరుకుంటాడు.

బంధాలలో బందీ ఐతే కష్టాలు..

బంధాలను విడిపించుకుంటే శాంతి సుఖాలు.

ముక్తి, ఆనందం, అంతర్గత శాంతి.. ఇవన్నీ పొందే మార్గం.........."ధ్యానం"

అందుకే ప్రతి ఒక్కరినీ నేను ఒక ప్రశ్న అడుగుతాను....మీ లక్ష్యం ఏమిటి ? అని....చాలా మంది నా పిల్లల్ని బాగా చదివించాలని, నేను పేద ప్రజలకు సాయం చెయ్యాలి అని.. ఇలాంటి కోరికలు. తమ తమ ఆశయాలూ ఎన్నో చెప్పారు.. నాకు వీటిలో సరిఐన సమాధానం దొరకలేదు.

నా యీ ఆర్టికల్ చదివే ప్రతి ఒక్కరినీ ఇదే ప్రశ్న అడుగుతున్నాను.....స్పందిస్తారని ఆశిస్తాను.. నాలాంటి ఎందరికో మార్గదర్సకులు అవుతారని ఆశిస్తున్నాను.

మీ లక్ష్యం ఏమిటి?

ముక్తి, మోక్షం లాంటివి అంత తేలికగా దొరికేవి కావు. అందువల్ల బాగా ఆలోచించి మీ సమాధానం చెప్తారని ఎదురుచూస్తుంటాను..   

నా లక్ష్యం నాకు తెలుసు గనక ధైర్యంగా ఈ ప్రశ్న అడుగుతున్నాను..

మీకు వీలు kudirinappuDu ఒక యోగి ఆత్మకధ... పరమహంస యోగానంద pustakam, హిమాలయ యోగులు..స్వామీ రామ వ్రాసిన  పుస్తకాలు చదవగలరు..

కామెంట్‌లు

  1. రుక్మిణిదేవి గారు మీరు ధ్యానం గురించి చాలా బాగా రాసారు. బుద్ధభగవానుడికి భోదివృక్షం క్రింద జ్ఞానోదయం అయ్యింది. నాకూ మీరు రాసిన ధ్యానం ద్వారా జ్ఞానోదయం అయ్యింది. నేను ఈరోజు నుంచి ధ్యానం చేద్దామని అనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  2. లక్ష్మి గారూ, ధన్యురాలిని.. ధన్యవాదాలండి..

    రిప్లయితొలగించండి
  3. ఎందుకంటే మనం కళ్ళుమూసుకుని కూర్చున్న తర్వాత మన కళ్ళముందు ఎన్నో ఆలోచనల ప్రవాహం సాగుతూ వుంటుంది.
    మరెలా.. ? వాటిని కట్ చేస్తూ వుండాలి.. ఒక ఆలోచన వచ్చింది..మనం ఎటో వెళ్ళిపోతుంటాము. వెంటనే తెలివి తెచ్చుకుని కట్ చెయ్యాలి. ఇలా నెమ్మదిగా సాధన చేస్తూ వుంటే, అసలు ఆలోచనలు రాని స్థితికి చేరుకుంటాము
    ---------
    meditation చేసేటప్పుడు మన ఆలోచనలు మన మనస్సులో మూవీ
    లాగా కదులు తూ వుంటాయి. వాటిని ఆపక్కరలేదు. వాటంతట అవే ఆగి పోతాయి అంటారు. ధ్యానానికి ఇది ఇంకో మార్గమా. తెలుపగలరు.

    రిప్లయితొలగించండి
  4. చాలా చక్కని ప్రయత్నంచేస్తున్నారు.ఇది ఖచ్చితంగా పదిమందికి మేలుచేస్తుంది.

    రిప్లయితొలగించండి
  5. ధ్యానం చెయ్యాలనే కోరిక భగవంతుడి కృప ఉన్న కొద్దిమందికే కలుగుతుంది. ధ్యానం చెయ్యటం గొప్ప పని, కాని అది సంతు మహాత్ములు చెప్పిన విధముగా చేస్తే జీవితం సార్ధకం అవుతుంది. నా ఈ టపా మీద ఒక లుక్కేయండి. http://arogya.blogspot.com/2011/01/blog-post_397.html

    రిప్లయితొలగించండి
  6. ధ్యానం చేస్తున్నపుడు ఆలోచనల ఒరవడి ఇబ్బంది పెట్టని స్థితికి చేరడమన్నది చాలా గొప్ప విషయం.. ఆ స్థితికి చేరుకోవడానికి ఎంతో సాధన అవసరం... మంచి భక్తి గీతాలు సన్నని ధ్వనితో వింటూ కూడా ధ్యానం చేయవచ్చు. అది ఉత్తమమైనది..మురళీ గానం లాంటి మ్యూజిక్ కూడా ఇందులో ఒక భాగమే.. ధ్యానమ్ అల్పకాలికముగాను, ఎగుడు దిగుడు గాను, అంతరాయములతోను, శ్రమతో కూడినది గాను వుంటుంది..మనస్సు ఒక పట్టాన ఏకాగ్రము కాదని, ఐతే మొక్కవోని ధైర్యముతో , ఆకుంఠిత దీక్షతో అభ్యాసం చేస్తే ధ్యానాభ్యాసి ఉన్నతోన్నత దశలను అందుకుంటాడు అని రమణ మహర్షి ఉపదేశసారం.. పేరుపేరునా మీ అందరికీ నా ధనవాదాలు తెలుపుకుంటున్నాను..

    రిప్లయితొలగించండి
  7. మీ టపా ఆలస్యంగా చూసాను. చాల మంచి ప్రయత్నం.
    కొనసాగించండి.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం