సేనయోరుభయోర్మధ్యే రధం స్థాపయా మీ>చ్యుత.
యావదేతాన్నిరీక్షే>హం యోద్ధుకామానవస్థితాన్
కైర్మయా సహా యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే .
అర్జునుడు - ఓ కృష్ణా ! ఈ యుద్ధారంభమునందు నేనెవరితో పోరుసల్పవలయునో , అట్టి ఈ యుద్ధాభిలాషులను ఎచటినుండి నేను చక్కగా జూడగల్గుదునో రెండు సేనల మధ్య అచ్చోట నా రధమును నిలబెట్టుము . అని శ్రీకృష్ణ పరమాత్మునితో చెప్పెను .
వ్యాఖ్య - శత్రువులతో తలపడుటకు ముందుగా, శత్రు పక్షమున ఎందరు కలరో ,ఎవరెవరు కలరో, వారందరూ ఏ ప్రకారముగా ఉన్నారో అంతయు గమనించుట ఉత్తమ యోధుని లక్షణము . కనుకనే అర్జునుడు వారలను చక్కగా చూచుటకై రధమును ఉభయ సేనల మధ్యకు తీసుకు పొమ్మని శ్రీకృష్ణునికి చెప్పెను ..
"నేను" అనబడు ఈ ఆత్మ కు ఉపాధి కల్పించిన ఈ శరీరం మనకు దేవాలయం . దానిని ఒక యుద్ధరంగం గా కూడా చిత్రీకరించవచ్చును .. యుద్ధరంగం మధ్యలో అంటే పద్మవ్యూహంలో నిలబడిన ఆత్మ తన చుట్టూ అల్లబడిన,నిలబెట్టబడిన సైనికులను ఏ విధంగా ఛేదించుకుని పరమాత్మను చేరగలదో ఆ యుద్ధమే మహాభారత యుద్ధం ..ఆత్మను పంచపాండవ స్వరూపంగా భావిస్తే ,అరిషడ్వార్గాలు అనబడే కౌరవులు ఆ ఆత్మను చుట్టి అనుక్షణం నరకం చూపిస్తూ ఉంటాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు . ఒక్కో సమయంలో నిండు సభలో ద్రౌపదిని వివస్త్రగా నిలబెట్టినట్లు , మనలను కూడా అంటే మన ఆత్మను కూడా నలుగురిలో వివస్త్రగా అనగా అవమానింపబడే రీతిలో కూడా చేయగలదు .. అంత బలమైనది ఈ కౌరవ సేన .. తదుపరి అరిషడ్వార్గాలనబడే కౌరవులపై విజయం సాధించి పరమాత్మను చేరుకోవడం ఎలా అన్న విషయం ...

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి