మనకు తెలిసిన స్నేహాలు కొన్ని మాత్రమె..... చదువుకునేప్పుడు క్లాస్మేట్స్ , బెంచి మేట్స్ , రూం మేట్స్ , వుద్యోగం చేస్తుండగా కొలీగ్స్, మనం నివసించే ఇంటి ప్రక్కల వారు , ఇతరత్రా పరిచయస్తులు ఇలా ఎందఱో స్నేహితులు వుంటారు. మన నిత్య జీవితంలో ఈ స్నేహాల వల్ల సుఖ దుఖ్ఖాలు రెండింటినీ చూస్తాము అంటే అనుభవిస్తాము ఇది సహజం . కానీ నాకో సందేహం .......... దు:ఖ్ఖం కలిగించేది నిజమైన స్నేహం ఎలా అవుతుంది? స్నేహం ... వ్యక్తికి బలం కావాలి గాని, బలహీనత కాకూడదు. స్నేహం.... ఎటువంటి పరిస్థితులు అయినా ఎదుర్కునే శక్తి గలది కావాలి గాని , పరిస్థితులకు లొంగనిది గా వుండాలి. కొన్ని పరిస్థితులు మన కర్మ ల ఫలితాలే, మనం కోరి తెచ్చుకునేవే కాబట్టి అవి మనకి బరువుగా మారతాయి. స్నేహం మాత్రమె వాటిని ఆ బరువుని దూది పింజేలా తీసి వెయ గలదు.. " స్నేహం" అన్న పదం(బంధం ) యొక్క విశిష్టత చాలా గొప్పది అని మన పురాణాల ద్వారా కూడా తెలుసుకున్నాము... ఐతే, స్నేహంలో కూడా రకాలు వుంటాయి అని ఈ మధ్యనే తెలుసుకున్నాను. అవి సఫల, సుఫల, విఫల స్నేహాలు.......... పేర్లు చాలా బాగున్నాయి కదు .. మరి ఆ స్నేహాలు ఎలా వుంటాయో తెలుస
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి