ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్షలు

చాలామంది తమను తాము పరిచయంచేసుకొనేటప్పుడు ఏదో ఒక ప్రత్యేకత అంటే నేను సింపుల్,షార్ప్,యాక్టివ్ ఇలా తమ తమ వ్యక్తిత్వాలను ప్రతిబింబించేలా చేస్తారు.. మరి కొందరు గురించి మంచి లేదా వేరే ఏ ఇతర భావం ఐనా తమకు కన్పించింది లేదా అనిపించింది తమ తమ పరిచయ సంధర్భాల్లో మీరు పలానా,అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం, ఇలాంటి భావాలతో.... ఆ వ్యక్తి తమను ఎంతగా ఇన్స్పైర్ చేసారు......కొద్దిపాటి కావచ్చు లేదా ఎక్కువ మోతాదులో కావచ్చు..... పరిచయం తీరు ఇలా వుంటుంది కద.. ఇంతకీ నేను ఈ ఉపోద్ఘాతం ఎందుకు మొదలు పెట్టాను అనుకుంటున్నారా? నాకు చాలా మొహమాటం అన్ని విషయాల్లో.. నా ముందు ప్రొఫైల్ లో నన్ను నేను అస్తమిస్తున్న సూర్యుని తో పోల్చుకున్నాను..మరల ఉదయం వుంటుంది కదా అన్నారు పద్మ కళ గారు..అందుకే నేను నేనే అన్నాను.. . తెలుగు బ్లాగ్ మొదలు పెట్టి రెండు సంవత్సరాలు ఐన సరిగా నడపలేకపోయాను.సమయాభావం మరియు మరికొన్ని కారణాల వలన .. జ్యోతి గారు మంచి బ్లాగర్ అని తెలిసినా ఆమె ను కాంటాక్ట్ చేయగలిగే అవకాశం దొరకడం నా అదృష్టం అని భావిస్తూ,ఆమె సహకారం తో మరల బ్లాగ్గింగ్ మొదలుపెట్టాను..వారిద్దరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరో విషయం ,,అన్ని బంధాల్లోకి గొప్పది ఎవరితోనూ అంటే తల్లి దండ్రులు,సోదర సోదరిమణులతోను పంచుకోలేని విషయాలను పంచుకోగలిగే బంధం ఇది అని ఎంతో ఉన్నత స్థానం కల్పించిన బంధం....స్నేహ బంధం..అటువంటి బంధానికి(ప్రేమికుల రోజు, రిపబ్లిక్ డే, మదర్స్ డే లాగ) ఒకరోజు ప్రత్యేకంగా కేటాయించి స్నేహం యొక్క ఔన్నత్యం తెలియజేస్తున్నందుకు అభినందనలతో........

ప్రతి ఒక్కరికీ నా ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్షలు......
....

కొస మెరుపు: స్నేహం ఆంటే ఏమిటో,,దాని విలువ ఏమిటో నాకు తెలియదని
మా భారతిగారు నన్ను చాలా చాలా తిడుతూ వుంటారండి... ఎవరైనా చెప్పగలరా?

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

స్నేహంలో రకాలు

నాన్న మాట అమ్మకి వేదం