స్వేచ్చ కావాలి

ఈ వాక్యం ఒక స్నేహితురాలు ప్రస్తావించినపుడు నాకు ఆశ్చర్యం కలిగింది.. ఏమిటి ఈ కోరిక.. ఎందుకు అలా అనిపించింది? అని నాలో ఒక ప్రశ్నార్ధకం.........

ఏం స్వేచ్చ? అంత లోతైనదా ఈ పదానికి అర్థం? ఎలాంటి స్వేచ్చ కావాలి?

నా ఉద్దేశ్యంలో ...........

*మనసుకి, ఆకాశంలో ఎగిరే పక్షీ తేడా ఏముంది? పక్షి రెక్కలు విప్పి ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. .మనసు రెక్కలు తొడిగి ఎక్కడెక్కడికో పయనం మొదలిడుతుంది.

*మరి రెండింటికి పోలిక..........గాలికి వదిలామా ఆకాశమే నాది అంటాయి..మన చేతికి చిక్కనంటాయి..ఐన పయనం ఆగనంటాయి.

మనసుని మాత్రం పగ్గం వేయకపోతే

దారి తప్పిన భాటసారిలా అటు,ఇటు గమ్యం తెలియక

విల విల లాడుతూ రోదిస్తుంది....

ఏదయినా కావాలి అని అనుకునే ముందు "అది ఎందుకు కావాలి?" అన్న ప్రశ్న వేసుకోగలగాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

స్నేహంలో రకాలు

నాన్న మాట అమ్మకి వేదం