Content

Thursday, August 23, 2012

ఓం శ్రీ గురుభ్యోన్నమః 

ఓం శ్రీ మహా గణాధిపతయే నమః 

నూతన అధ్యాయం మొదలు పెట్టేటపుడు సహజంగా తలచుకునే నామాలను తలుస్తూ ..బ్లాగ్ లో  మరల ఇంత త్వరగా వ్రాయడం మొదలు పెడతానని, వ్రాయ గలనని అనుకోలేదు .. మనలోని భావాలు లేదా ఆలోచనలు ఎవరితో అయినా పంచుకోవడం సహజం ..అలా చేయలేనప్పుడు ఒక పేపర్ మీదో లేక ఒక diary  లోనో వ్రాసుకోవడం చాలా మందికి అలవాటు .. ఆ చాలా మందిలో నేనూ వున్నాను ..ఈ మధ్య  కాలంలో గత కొంత కాలంగా నేను ఇల్లు, భర్త, పిల్లలు, అత్తమామలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు ఇలాంటి భాద్యతల మీద తప్ప ఇక ఇతర వ్యాపకాల మీద అంటే పుస్తకాలు చదవడం గాని ఏమైనా వ్రాయడం గాని లాంటి పనులు చేయలేక పోయాను ..   ఒక రోజు విశ్రాంతి తీసుకోవడం కోసం మంచం మీద చేరిన నా మనసులో ఒక ఆలోచన మొదలైంది .. అది నన్ను నేను కోల్పోతున్నాను అని ...కోల్పోవడం అంటే కోరికలు గాని, అసూయా ద్వేషాల వంటి వి గాని కాదు ..నా పుస్తక pathanam, భగవన్నామ స్మరణ జరుగుతున్నా ఒక స్థితిని అంటే ఒక సహజ స్థితిని కోల్పోయానని అనిపించింది ..
ఆ సమయంలో సాధకుడు అనే మన ఆధ్యాత్మిక బ్లాగర్ నాకు ఒక సూచన ఇవ్వడం జరిగింది .. ఆచరించడానికి ప్రయత్నిస్తానని చెప్పడం , ఇదిగో ఈ రోజు మరల బ్లాగ్ ప్రపంచం లోనికి మరల అడుగు పెట్టడం జరిగింది .. అందరికి నా హృదయ పూర్వక నమస్కారములు ...


© Rukmini Devi J
mmanindarkumarTwitter:ACMWCTRss:mk

2 వ్యాఖ్యలు:

  1. మీ పునరాగమనమును స్వాగతిస్తున్నాను.
    మీరు బ్లాగ్ లో వ్రాయడం మరల ప్రారంభించడం చాలా చాలా ఆనందముగా ఉంది.

    ReplyDelete