మనం నాటిన విత్తనం భూమిలోనికి తన  వెళ్ళు జోప్పిస్తూ కాండాన్ని భూమి పైకి పంపి శాఖోప శాఖలుగా ఎలా ఐతే పెరిగి ఆకులు, పూవులు, కాయలు, పండ్లతో ప్రకృతిని రంజింప జేస్తుందో    , అదే విధంగా ధర్మం అనే విత్తనం మన మనసులో నాటితే తన సందేశాలతో మనలని వుద్ధరిస్తూ, తద్వారా మనలో నుండి మన చుట్టూ వున్నవారిలో తన శాఖలను విస్తరింపజేసి సమాజ కల్యాణానికి మార్గం వేస్తుంది..
మనం తినే తిండి మన కోసం, మనం చేసే పూజలు మన కోసం, , కాని మనం పాటించే ధర్మాలు మనలనే కాక, మన చుట్టూ వున్న వారిని కూడా సరియిన మార్గం లో నడిపిస్తాయి అనడంలో ఎ మాత్రం సందేహం లేదు ..
రోజూ మన ప్రస్తావనలో ధర్మం గురించి వచ్చే మాటలు ఇలా వుంటాయి .
౧.  ధర్మంగా ఆలోచించాలి మరి .(మంచిగా వుండాలి )
౨. ఇదేమన్నా ధర్మంగా వుందా ? ( ఇదేమన్నా న్యాయంగా వుందా )
౩. ధర్మం చెయ్యండి బాబూ...( భిక్షమెత్తుకునే వారి భాషలో )...అంటే మనం వేసే రూపాయి, అర్ధ రూపాయి గురించి కాక మరేదో అర్ధం స్పురిస్తుంది  కదా..
౪. నా ధర్మం నేను నిర్వర్తించాను  (కర్తవ్యమ్ )
౫. ధర్మంగా నడుచుకోవాలి.
ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, ఎప్పుడు అధర్మం పెచ్చు పెరిగిపోతుందో, ఎప్పుడు రాక్షసులు క్రూరులై  మితిమీరి పోతారో, ఎప్పుడు దేవతలు దైన్యం పాలవుతారో    , అప్పుడు నేను సత్కులీనుల ఇంట పుట్టి ధర్మ రక్షణ చేస్తూ వుంటాను. తెలుపు, ఎరుపు, నలుపు, పసుపు, ఈ నాలుగు రంగుల్లో.. నాలుగు యుగాల్లోనూ చరిస్తూ ధర్మ స్థాపన చేస్తూ వుంటాను ...శ్రీ కృష్ణ పరమాత్మ ....
ఒకనాడు ధర్మరాజు మార్కండేయునితో  కలియుగంలో సమస్త ధర్మాలూ లోపిస్తాయని అంటారు. అదేమిటో సెలవివ్వమని "  అడుగగా, మార్కండేయుడు ఇలా చెప్తాడు............
కృత యుగంలో ధర్మం నాలుగు పాళ్ళు వుంటుంది .త్రేతా యుగంలో ధర్మం మూడు పాళ్ళు వుంటుంది . ద్వారప యుగంలో రెండు పాళ్ళు మాత్రమె వుంటుంది .కలియుగంలో ధర్మం కరువు ఐపోయి కేవలం ఒక్క పాలు మాత్రమె వుంటుంది.
ప్రధానంగా  కలియుగంలో ప్రజల మధ్య సత్యం క్షీణిస్తుంది. సత్యం క్షీణించడం వల్ల ఆయువు తగ్గిపోతుంది . ఆయువు తరగడంతో విద్యలూ తగ్గిపోతాయి. విద్యలు తగ్గడంతో అజ్ఞానం అధికం అయిపోతుంది. అజ్ఞానం వల్ల   లోభం పట్టుకుంటుంది. లోభం వల్ల కామం, కామం వల్ల   క్రోధం, క్రోధంతో  విరోధాలు పెచ్చు రేగుతాయి. సర్వ వర్గాల వాళ్ళు కలహాలు పెంచుకుంటారు.
ఒకరి అదుపులో ఒకరు వుండరు. అధర్మం పెచ్చు పెరుగుతుంది.  సత్యం వధ, ధర్మం చెర .......  
పరిస్థితులు తిరగ బడతాయి.. బ్రాహ్మలు జపం, తాపం, నియమం, స్వాధ్యాయము విడిచి పెడతారు. శూద్రులు మంచి తపస్సంపన్నులు అవుతారు. దేశాలు అరాచకం పాలవుతాయి. అధర్మంతో నిండిపోతాయి...
సాదు చరిత్ర గలవారు దుర్గతుల పాలు అవుతారు.
ఇలా ఎన్ని విషయాలనో కలియుగంలోని అధర్మపు స్థితిని మన కళ్ళకు కట్టినట్లు వివరించాడు మార్కండేయం మహా ముని.
కలియుగం అంతం అయ్యేముందు ధర్మమన్నది పేరు కైనా ఎక్కడా కనబడదు అని చెప్పాడు ..
నిజమే, కృత, త్రేతా, ద్వాపర యుగాలలో మనం జన్మించక పోయినా కలియుగంలో పూర్తి  అధర్మంతో నిండి పోయిందని అనుకుంటూ వున్న ఈ యుగంలో ధర్మాన్ని నిలబెట్టడానికి ఎందఱో ప్రయత్నిస్తున్నా ,ముందు వివరించినట్లు ఒక పాలు కూడా కనిపించడం లేదు. అందుకే వుదయం నిద్ర లేస్తూనే ఏది ధర్మం? అన్న ప్రశ్న మన మనస్సులో మెదులుతూ వుంటుంది.
ధర్మం అందంగా వుంటుంది ---మన కంటికి కనబడనిది.
సత్యం వల్ల   ధర్మం నిలబడుతుంది ---సత్యమూ మన కంటికి కనబడనిదే  ...
అసత్యం వున్న చోట ధర్మం నిలబడదు అంతటా అసత్యమే చీకటిలా అలుముకుంటుంది కాబట్టి.
ధర్మం అనేక విధాల సూక్ష్మంగా  వుంటుంది ---మనకు వెదికి  పట్టుకునే సమయం వుండదు ..
సత్యమే ధర్మం, ధర్మమే సత్యం...
కౌశిక మహా మునికి ధర్మ పాలుడు అనే కటిక  వృత్తి  చేసుకునే వాడు ధర్మం గురించి భోదించాడు... ఆ కధ  గురించి మరోసారి తెలుసుకుందాము ..
                                                                                        ( సశేషం )

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా....

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...