గురువు అవసరం ................
గురువు అవసరమా అన్న మన సందేహానికి సమాధానంగా వేమన ఇలా వివరించాడు. ఆత్మలోని జ్యోతి యమరుగా లింగంబు తెలిసి చూడకున్న తేటపడదు అదియు గురువు లేక అబ్బునా తెలియంగా విశ్వదాభిరామ వినుర వేమా ! తాత్పర్యం : హృదయంలో తేజో రూపుడుగా వున్న పరమేశ్వరుని దర్శించడానికి సద్గురువు దగ్గర అభ్యాసం లేకుండగా సాధ్యపడదు. ఇంకా.........ఇలా చెప్పారు......... ఉడుగక క్రతువుల తపముల నడవుల తీర్ధముల తిరిగినంతనే ధరలో నోడయని కనుగొనజాలదు కడు ధీరత గురుడు తెలుపగలడిది వేమా ! తాత్పర్యం : ఎ మాత్రం విడిచి పెట్టకుండా యజ్ణ యాగాదులు , తపస్సు చేసి, అడవులలో తిరిగి తీర్ధయాత్రలకు వెళ్ళినప్పటికీ స్వామిని కనుగొన లేరు. ఆ పరమాత్మను చేరుకొనే విధానాన్ని గురువు మాత్రమే చెప్పగలడు. గురుని శిక్ష లేక గురుతెట్లు కలుగునో అజునికైన వాని యబ్బకైన తాళపు చెవి లేక తలుపెట్ట్లూడునో? విశ్వదాభిరామ వినుర వేమా ! తాత్పర్యం : తాళం చెవులు లేకుండా తలుపు ఏవిధంగా రాదో, అదే విధంగా గురువు ఉపదేశం లేకుండా, ఆత్మా జ్ఞానాన్ని బ్రహ్మ గాని ఆతని అబ్బ (తండ్రి ) గాని తెలుసుకోలేరు. గురువు లేక విద్య గురుతుగా దొరకదు నృపతి లేక భూమి నియతి గాడు గురువు విద్యలేక గురుతర ద్విజుడౌనే ?
Another form of matter is energy. Energy, neither created nor destroyed...a famous equation E=MC^2
రిప్లయితొలగించండిఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే భగవంతుడు , శక్తి రూపాయ నమః
law of conservation of energy also is the answer to ur qstn madam.we r all finest sub atomic dust of that huge-roopaa
రిప్లయితొలగించండిపదార్థం తో పోల్చటమేమిటి. పదార్థమే భగవంతుడు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు భాస్కర్ గారు మరియు astrojoyd గారు, నాకు కావలసిన సమాధానం దొరికింది..రమ గారు, భగవంతుడు శక్తిస్వరూపుడు.. అందుకే ఆ శక్తిని కదలిక లేని పదార్థం తో పోల్చగలమా అని అన్నాను.పదార్థానికి శక్తి తోడైతేనే కదలిక ఏర్పడుతుంది కద..
రిప్లయితొలగించండి