గీ" అనగా త్యాగము, "త" అనగా తత్త్వజ్ఞానము...త్యాగమును,తత్త్వజ్ఞానమును భోధించునదే గీత అని మానవులందరు తెలుసుకొనవలయును.

మహాత్ములు తాము గంభీర తత్త్వములు జనసామాన్యము యొక్క హృదయమును నాటుటకొరకై పెక్కు దృష్టాంతములను వాడుచుందురు. తద్వారా క్లిష్ట భావాలు ఐనా జనులకు సులభముగ భోధపడుచుండును. గీత యందు శ్రీ కృష్ణమూర్తి ఇట్తిపద్దతినే అనుసరించి అనుపమ ఆధ్యాత్మిక తత్త్వములను చక్కటి సాదృశ్యముల ద్వా"గీ" అనగా త్యాగము, "త" అనగా తత్త్వజ్ఞానము...త్యాగమును,తత్త్వజ్ఞానమును భోధించునదే గీత అన రా భోధించుచు పోయెను..వారు తెలిపిన ఉపమానములు..............

౧.మనుజుడు పాత బట్టలను విడిచి ఇతరములగు క్రొత్తబట్టనెటుల ధరించుచున్నాడో; అట్లే ఆత్మయు పాత శరీరములను వదిలి క్రొత్త శరీరములను ధరించుచున్నది.

౨.సర్వత్ర జలముచే పరిపూర్ణమైన గొప్ప జలాశయము లభింప; అత్తరి స్వల్ప జలముతో గూడిన భావి మొదలగువానియందు మనుజునకెంత ప్రయోజనముండునో,అనుభవజ్ఞుడగు బ్రహ్మజ్ఞానికి సమస్తవేదములందును అంత ప్రయోజనమే ఉండును.

౩.తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకొనునట్లు,యోగి యగువాడు ఇంద్రియములను విషయముల యెపుడు మరలించుకొనునో అపుడాతని జ్ఞానము స్థిరమైనదిగా నగుచున్నది.

౪.జలముచే సంపూర్ణముగ నిండినదియు,స్థిరమైన ఉనికి గలదియునగు సముద్రమును నదులు మొదలగువాని ఉదకము లే ప్రకారము ప్రవేశించుచున్నవో, ఆ ప్రకారముగా సమస్తమైన కోరికలు ఏ బ్రహ్మనిష్ణునియందు ప్రవేశించి యణగిపోవుచున్నవో, అట్టి మహనీయుడే శాంతిని పొందునుగాని విషయాసక్తి కలవాడు కాదు.

౫.పొగచేత నిప్పు,దుమ్ముచె అద్దము,మావిచే గర్భమందలి శిశువు ఏలాగున కప్పబడియున్నవో ఆలాగున కామముచె ఆత్మజ్ఞానమును కప్పబడియున్నది.

౬.ఓ అర్జునా ! లెస్సగ మండుచున్న అగ్ని ఏ ప్రకారము కట్టెలను భస్మమొనర్చునో,ఆ ప్రకారమే జ్ఞానమను అగ్ని సమస్తకర్మలను భస్మమొనర్చివేయును.

౭.ఎవడు తాను చేయు కార్యములను పరమాత్మయందు సమర్పించి ఫలాసక్తిని విడిచి చేయునో, అట్టివానికి తామరాకునకు నీరంటనట్లు పాపములంటకుండెను.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

స్నేహంలో రకాలు

యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా....