౮.. ఏ ప్రకారము గాలి వీచనిచోట గల దీపము నిశ్చలముగనుండునో,ఆ ప్రకారము ఆత్మ ధ్యానమందు లగ్నమై యున్న యోగియొక్క స్వాధీనచిత్తము కూడ నిశ్చల స్థితిని పొంది యుండును ( కావున యోగిపుంగవుల నిశ్వలమనస్సునకు అట్టి దీపము యొక్క స్థితి ఉపమానముగ చెప్పబడింది). (6_34).
౯. అర్జునా ! నాకంటే ఇతరమైనది ఏదియును ఈ ప్రపంచమున ఒకింతైనను లేదు.దారమునందు మణుల వలె నాయందీ సమస్త ప్రపంచమున్ను కూర్చబడియున్నది...(7_7)
౧౦. అంతటను సంచరించునదియు,గొప్పదియునగు వాయువు సర్వకాలములందును ఆకాశమునందెట్లు నిలిచియున్నదో,అట్లే సమస్తభూతములున్ను నాయందున్నవని తెలిసికొనుము..
౧౧. ఓ అర్జునా ! ఈ శరీరము క్షేత్రమని చెప్పబడుచున్నది. మరియు దీనినితెలియువాడు క్షెత్రజ్ఞుడని విజ్ఞులు పేర్కొనుచున్నారు.(9_6)
౧౨. ఆతి సూక్ష్మమైయుండుటచేసర్వవ్యాపకమగు ఆకాశము దేనిచెతను అంట్బడక ఎట్లుండునో, అట్లే సర్వత్ర వ్యాపించియున్న ఆత్మ దెహాదులచే నంటబడక యుండును.(13_2)
౧౩. అర్జునా ! సూర్యుడొక్కడు సమస్తలోకము నెట్లు ప్రకాశింపజేయుచున్నాడొ, అట్లే క్షేత్రజ్ఞుడగు ఆత్మ దెహాది సమస్త క్షేత్రమును ప్రకాశింపజేయుచునాడు.(13_33)
౧౪. దేనికి వేదములు ఆలులుగానున్నవో అట్టి సంసార రూప అశ్వత్ధవృక్షము(రావి చెట్టు)ను, వేళ్ళుపైన కొమ్మలు క్రిందగా గలిగియున్నదిగను, బహుకాలముండునదిగను పెద్దలు చెప్పుదురు.. దానినెవరెరుగునో ఆతడు వేదమునెరింగిన వాడగును. (15_1)
౧౫ సంసారమను ఆ అశ్వత్ధ వృక్షము యొక్క కొమ్మలు గుణములచే వృద్ది నొందింపబడినవియు,విషయములను చిగుళ్ళుగలవియు నయి పైకిని,క్రిందకును వ్యాపించి యున్నవి. దానివేళ్ళు మనుష్యలోకమునందు కర్మసంబంధము గలవియై క్రిందికి గూడ విస్తరించి యున్నవి.(15_2)
౧౬. వాయువు _పుష్పములు మున్నగువాసన గల పదార్థముల నుండి బయలుదెరునపుడు, ఆయా పదార్ధముల నచటనె విడిచి అందలి గంధాణువుల నెట్లు తీసుకొనిపోవుచున్నదొ,అట్లే జీవుడు ఒక దేహమును వదలి మరియొక దేహమును పొందునపుడు శరీరమునచ్చ్టనే విడిచిపెట్టినను, దానియందుండు మనస్సు మొదలగు ఆరు ఇంద్రియములను, వాసనలను తీసుకొని వెడలుచున్నాడు.(15_8)
౧౭. నిప్పు పొగచే కప్పబడినట్లు సమస్త కర్మములున్ను(దృశ్యరూప)దోషము చేత కప్పబడియున్నవి.(18_48)
౧౮. ఓ అర్జునా ! ఈశ్వరుడు సమస్త ప్రాణులయొక్క హృదయస్థానమున నివసించి, యంత్రమున తగుల్కొన్నవారిని వలెవారినందరిని మాయచే తిప్పుచున్నాడు. ( 18_61)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

స్నేహంలో రకాలు

నాన్న మాట అమ్మకి వేదం