1970 వ సంవత్సరంలోశ్రీవిద్యాప్రకాశానందగిరి స్వాములవారి విరచిత, శ్రీ శుక బ్రహ్మాశ్రమము,శ్రీ కాళహస్తి వారు వెలుగు లోనికి తెచ్చిన గీతా మకరందము అనెడి ఒక మహా గ్రంధము ఈ మధ్య కాలంలో నాకు లభించింది... ఆ వివరంబెట్టిదనిన....... పుస్తకాభిలాష కాస్త మెండుగా ఉన్న నేను ఎక్కడికి వెళ్ళినా ముందు వెదుక్కునేది వాటి కోసమే.. మే నెలలో మా మరిది కుమార్తె పెళ్ళి సందర్భంగా మేము మా అత్తగారి ఇంటికి వెళ్ళడం జరిగింది..క్రితం సంవత్సరం అక్కడ ప్రసిద్ది చెందిన రఘునాధస్వామి ఆలయంలో ఒక ఆరు సంవత్సరాల వయసు గల ఒక చిన్న బాబుని చూడడం జరిగింది...వైభవ వేంకటేశ్వరుని చూసినంత ఆనందం అనుభవించాను..అంత ముద్దుగా, బొద్దుగా మొహంలో ఒక తేజస్సుతో మంచి అన్నమయ్య కీర్తనతో అందరినీ అలరించాడు.. మా తాతగారి మనుమడు పెద్దమ్మా అని చెప్పి ఆయన ప్రొఫెసర్ గా చెసి రిటైర్ అయ్యారు అని చెప్పింది..మంచి బుక్స్ ఎమైనా వుంటే తెచ్చిపెట్టమ్మా,చూసి ఇచ్చేస్తాను అని అడిగాను..అది సభ్యత కాదు,నేను స్వయంగా వెళ్ళాలి అని తెలిసినా,వెళ్ళలేని పరిస్థితి..అడిగినదే ఆలస్యం నాకు అప్పుడు దొరికిన పుస్తకం "శ్రీ యోగ వాశిష్టం"...చాలా పురాతన గ్రంధం..............ఏమి చెప్పను నా అనుభూతి...సాక్షాత్ ఆ శ్రీ రామ చంద్రులు నా దగ్గరగా వున్నంత
...... సమయాభావం...పూర్తిగా చదవలేను,పైపైన చూసి పంపుతూ ఒక మాట విన్నవించమన్నాను మా ఉషని నా తరపున...ఈ సారి వచ్చినపుడు వారిని తప్పకుండా దర్శించుకుంటానని...ఈ మే నెలలో అవకాశం రావడం, మేము వారి ఇంటికి వెళ్ళడం,,నా ధ్యాస ఆ పుస్తకం మీదే ఉన్నప్పటికీ అడగలేకపోయాను కాని, నాకు మరొ అపూర్వమైన గ్రంధం బహుకరించారు ఆయన..మరి ఆ ఆనందం ఏమని వర్ణించను? ? అందుకే మాటలలో చెప్పలేని దానిని మీ అందరితో ఈ విధంగా పంచుకోవాలనే నా చిన్న ప్రయత్నం సఫలం కావాలని ఆ శ్రీ కృష్ణా భగవానుణ్ణి వేడుకుంటూ....(యదాతదంగా,క్లుప్తంగా పరిచయం చెయ్యాలని నా ప్రయత్నం)....ముందుగా నాకు నేను..............

చేతోభృజ్గ భ్రమసి వృధా
భవమరుభూమౌ విరసాయామ్
పిబపిబ గీతామకరన్దమ్
యదుపతిముఖకమలభవాడ్యమ్

మనస్సను ఓ తుమ్మెదా! రసహీనమగు ఈ సంసార మరుభూమినందేల వ్యర్ధముగ సంచరించుచున్నావు ?( ఇక ఆ సంచారమును కట్టిపెట్టి) శ్రీకృష్ణపరమాత్మయొక్క ముఖపద్మము నుండి బయలుదేరిన శ్రేష్టమగు గీతామకరందమును పానము చేయుము.........................
"MESSAGE OF THE GEETA"

"BE FEARLESS
!"

క్లైబ్యం మాస్మగమః పార్ధ నైతత్త్వయ్యుపపద్యతే
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ట పరన్తప..

" ఓ అర్జునా ! అధైర్యమును (భయమును) పొందకుము. ఇట్టి పిరికితనం నీకు తగదు.. నీచమగు ఈ హృదయదౌర్బల్యమును విడనాడి లెమ్ము ! కర్తవ్యమునకు గడంగుము !!"
"If one reads this one sloka he gets all the merits of reading the entire GEETA; for in this one sloka lies embedded the whole message of the Geeta"
--------Swami Vivekananda.
ఈ రొజు గీతకు గల 18 పేర్లు పరిచయం చేస్తాను..

1. గీతా గంగాచ గాయత్రీ సీతా సత్యా సరస్వతీ
బ్రహ్మవిద్యా బ్రహ్మవల్లీ త్రిసంధ్యా ముక్తిగేహినీ.

2 అర్ధమాత్రా చిదానందా భవఘ్నీభ్రాన్తినాశినీ
వేదత్రయీ పర>>నన్తా తత్వార్ధ జ్ఞానమంజరీ,

3. ఇత్యేతాని జపేన్నిత్యం నరో నిశ్చలమానసః
జ్ఞానసిద్ధిం లభేఛ్ఛీఘ్రం తాధాన్తే పరమం పధమ్
1. గీత 2. గంగ 3. గాయత్రీ 4. సీత 5. సత్య 6. సరస్వతీ 7. బ్రహ్మవిద్య 8. బ్రహ్మవల్లి 9. త్రిసంధ్య
10. ముక్తిగేహిని 11. అర్ధ్మాత్ర 12. చిదానంద 13. భవఘ్ని 14. భ్రాన్తినాశిని 15. వేదత్రయి 16..పర
17. అనంత 18..తత్త్వార్ధజ్ఞానమంజరి.

ఈ పదునెనిమిది గీతా నామాలను ఎవరు నిశ్చలచిత్తులై సద జపించుచుండెనో అతనికి శీఘ్రముగ జ్ఞాన సిద్దియు,తుదకు పరమాత్మ పదప్రాప్తియు లభించును...
గీత యందు భీష్మపర్వంలో శ్రీకృష్ణమూర్తి 620 శ్లోకములను, అర్జునుడు 57 శ్లోకములను సంజయుడు 67 శ్లోకములను, ధృతరాష్టుడు 1 శ్లోకము చెప్పెను.(మొత్తం 745 శ్లోకములు) కాని ఇప్పుదు లోకములో వాడుకలో ఉన్న గీత యందు శ్రీ.కృష్ణుదు చెప్పినవి 574,అర్జునుడు 84, సంజయుడు 41,ధృతరాష్టుడు 1 శ్లోకములు (మొత్తం 700)చెప్పినట్లుగను కలదు .
వెరశి ఉపనిషత్తులను గోవులయొక్క సారమే భగవద్గీత అని ఇందు తెలుపబడినది..

నిర్మలబుద్ధితోగూడి,ధైర్యముతో మనస్సుని స్వాధీనపరచుకొని,శబ్దాది విషయములను,రాగద్వేషములను విడిచిపెట్టి,ఏకాంతస్థలవాసియై, మితాహారమును స్వీకరించుచు,శరీర వాజ్మనంబులను నియమించి,నిరంతరము ధ్యానయోగాభ్యాసమొనర్చుచు,వైరాగ్యమును లెస్సగ నాశ్రయించి, అహంకార బలదర్పములను,కామక్రోధములను,భోద్యవస్తు పరిగ్రహమును బాగుగ త్యజించివైచి,మమకార రహితుడై,శాంత స్వభావము కలిగియుండు మహనీయుడు పరబ్రహ్మ సాక్షాత్కారమునొందుటకు సమర్ధుడు అని జీవుడు ఏ విధముగ పరబ్రహ్మసాక్షాత్కారమును పొందగలడో ఆ సాధనలు మూడు శ్లోకాలలో సంక్షేపముగ చెప్పివైచెను.

1. బుద్ధ్యావిశుద్ధయా యుక్తో దృత్యా>>త్మానం నియమ్య చ
శబ్ధాదీన్విషయాం స్త్యక్త్వా రాగద్వేషౌవ్యుదస్య న్.
2.వివక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానసః
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః
3. అహంకార బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్
విముచ్య నిర్మమః శాన్తో బ్రహ్మభూయాయ కల్పతే.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

స్నేహంలో రకాలు

నాన్న మాట అమ్మకి వేదం