ఒక్కోసారి పరిస్థితులు మన చేయిదాటిపోతున్నాయి అని అన్పించినప్పుడు, ఏదో అసహాయత మనలో కనబడుతుంటుంది...అలాంటప్పుడు మనలో ఎన్నో ప్రశ్నలు ఇది ఇలా వుంటేనే బాగుంటుందా, ఇలా చేస్తేనే బాగుంటుందా అని.. అవి పిచ్చి ప్రశ్నలు అని నేను అనుకోను.. అలాంటివాటిలో ఇదొకటి.. .మా మామయ్యా గారి అమ్మాయిని రీసెంట్ gaa తన retirement డబ్బు ఆంతా పెట్టి కట్నం,అత్తా, ఆడపడుచు laanchanaalalo చాలా గ్రాండ్ గా చేసారు.....ఎందుకంటే అబ్బాయి తరపువారు చాలా గొప్ప background మరి...పేరు గొప్ప, వూరు....ఈ సామెతలు ఎలా వస్తాయో ఇప్పుడు అర్ధం అవుతుంది..........అమ్మాయిని అబ్బాయి పట్టించుకోడు.తిన్నావా, లేవా అడగడు....తెల్లవారేవరకూ ఇంటికి చేరడు..కొన్ని రోజులు ఇంటిమోహమే చూడడు..ఇంట్లో అత్తా మామల సతాయింపు...కూరలో ఉప్పెక్కువైందని.. అదని,ఇదని వంకలు..భార్యని మాత్రం తల్లిని చేసాడు..అత్తగారింటికి vaste A.C. లో తప్ప padukodani అప్పటికప్పుడు arrange చేసారు..అదేమని అడిగితే, "పెళ్లి ఐతే బాగు పడతాడని పెళ్లి చేసాము" అని అత్తవారింటి సమాదానం...అమ్మాయి పుట్టింట్లో,, తల్లిదండ్రులు కన్నీటితో, అబ్బాయి రోడ్లు పట్టుకుని వుద్యోగం సద్యోగం లేక..ఇలా వున్నాయండి కాపురాలు.....అసలు పెళ్లి కి అర్ధమే మార్చేస్తున్నారు కదండీ...ఇప్పుడు మా అమ్మాయి పెళ్ళికి ఎదుగుతుంటే చాలా,చాలా భయం gaa వుంది...అందుకే అడుగుతున్నాను..ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా.........తప్పుగా అర్ధం చేసుకోనంటే.......పూర్వపు పెళ్ళికి అర్ధం మార్చేసిన ఈ సమాజం లో, ఒకరికొకరు తోడుగా వుండలేని, రక్షణ కల్పించుకోలేని,,ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించని ఈ మానవ సంబంధాలలో,,
ఏంటో అట్టహాసంగా పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నామన్న తల్లిదండ్రుల రక్తపు ధారల త్యాగం వృధాగా pravahimpajestunna ఈ లోకంలో.......పెద్దలకు దూరంగా ఏదో సాధించాలన్న తాపత్రయం లో పడి తమ,తమ అస్తిత్వాలనే కోల్పోతున్న ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నిస్తున్నాను....
మానవత్వపు విలువలు మర్చిపోయి ప్రవర్తిస్తున్న వారికి మాత్రమె సుమా..దయచేసి అర్ధం చేసుకోండి......"
" అటువంటి పెళ్ళిళ్ళు అవసరమా???

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

స్నేహంలో రకాలు

నాన్న మాట అమ్మకి వేదం