గురువు అవసరమా అన్న మన సందేహానికి సమాధానంగా వేమన ఇలా వివరించాడు. ఆత్మలోని జ్యోతి యమరుగా లింగంబు తెలిసి చూడకున్న తేటపడదు అదియు గురువు లేక అబ్బునా తెలియంగా విశ్వదాభిరామ వినుర వేమా ! తాత్పర్యం : హృదయంలో తేజో రూపుడుగా వున్న పరమేశ్వరుని దర్శించడానికి సద్గురువు దగ్గర అభ్యాసం లేకుండగా సాధ్యపడదు. ఇంకా.........ఇలా చెప్పారు......... ఉడుగక క్రతువుల తపముల నడవుల తీర్ధముల తిరిగినంతనే ధరలో నోడయని కనుగొనజాలదు కడు ధీరత గురుడు తెలుపగలడిది వేమా ! తాత్పర్యం : ఎ మాత్రం విడిచి పెట్టకుండా యజ్ణ యాగాదులు , తపస్సు చేసి, అడవులలో తిరిగి తీర్ధయాత్రలకు వెళ్ళినప్పటికీ స్వామిని కనుగొన లేరు. ఆ పరమాత్మను చేరుకొనే విధానాన్ని గురువు మాత్రమే చెప్పగలడు. గురుని శిక్ష లేక గురుతెట్లు కలుగునో అజునికైన వాని యబ్బకైన తాళపు చెవి లేక తలుపెట్ట్లూడునో? విశ్వదాభిరామ వినుర వేమా ! తాత్పర్యం : తాళం చెవులు లేకుండా తలుపు ఏవిధంగా రాదో, అదే విధంగా గురువు ఉపదేశం లేకుండా, ఆత్మా జ్ఞానాన్ని బ్రహ్మ గాని ఆతని అబ్బ (తండ్రి ) గాని తెలుసుకోలేరు. గురువు లేక విద్య గురుతుగా దొరకదు నృపతి లేక భూమి ని...
నాన్న అన్నారు, "నేను లేకపోతే మీ అమ్మ ఎలా బ్రతుకుతుందో"అని. అమ్మ చెప్పింది, "మీ నాన్న కోసం మా పుట్టింటి తరపు అందరినీ వదిలేసాను" అని. ఆమెకు కోరికలు ఉండేవి. బుక్స్ చదువుతుంటే 'నేను ఒంటరిని అయిపోతాను 'అని ఆమె అలవాటు తన అలవాటు గా మార్చుకున్నారు నాన్న. కుట్లు, అల్లికలు వదిలి, అమ్మ జీవితం తనకే అంకితం చేసేలా మార్చుకున్నారు నాన్న. బంగారం ఎక్కడ ఉంటే ఆ భాగం కట్ చేసేస్తారు దొంగలు అని బోలెడు కధలు వినిపిస్తూ, పూలు మాత్రం కొని ఇచ్చి అమ్మకు జీవితాంతం పూలు పెడుతూనే ఉన్నారు నాన్న. నీకే నా జీవితం అంకితం అంటూ తన ప్రపంచం లో తాను నలుగురి లో మెసలుతూ, అమ్మ మౌనాన్ని అమ్మ ప్రపంచం గా బహుమతి ఇచ్చేసారు నాన్న . అమ్మ, నాన్న లేని అమ్మకి నేనే అన్నీ అనుకుంంటూనే అందరూ ఉండి,ఎవరూ లేనట్లు ఒంటరిని చేస్తారు నాన్న. నా మాటే శాసనం అని మాటల్లో అనకపోయినా, నేను చెప్పిందే వేదం అనేలా ఉంటారు నాన్న. జీవితపు చరమాంకంలో "నువ్వు చెప్పింది విని ఉండాల్సింది" అన్నారు నాన్న. అన్ని సంవత్సరాల జీవితం లో ఏం చెప్పిందని? ఉండడానికి ఒక స్వంత ఇల్లు, పిల్లల చదువులు, భవిష్యత్తు.. అంతేగా. అమ్మ జీవితం ముగిసే ...
మనకు తెలిసిన స్నేహాలు కొన్ని మాత్రమె..... చదువుకునేప్పుడు క్లాస్మేట్స్ , బెంచి మేట్స్ , రూం మేట్స్ , వుద్యోగం చేస్తుండగా కొలీగ్స్, మనం నివసించే ఇంటి ప్రక్కల వారు , ఇతరత్రా పరిచయస్తులు ఇలా ఎందఱో స్నేహితులు వుంటారు. మన నిత్య జీవితంలో ఈ స్నేహాల వల్ల సుఖ దుఖ్ఖాలు రెండింటినీ చూస్తాము అంటే అనుభవిస్తాము ఇది సహజం . కానీ నాకో సందేహం .......... దు:ఖ్ఖం కలిగించేది నిజమైన స్నేహం ఎలా అవుతుంది? స్నేహం ... వ్యక్తికి బలం కావాలి గాని, బలహీనత కాకూడదు. స్నేహం.... ఎటువంటి పరిస్థితులు అయినా ఎదుర్కునే శక్తి గలది కావాలి గాని , పరిస్థితులకు లొంగనిది గా వుండాలి. కొన్ని పరిస్థితులు మన కర్మ ల ఫలితాలే, మనం కోరి తెచ్చుకునేవే కాబట్టి అవి మనకి బరువుగా మారతాయి. స్నేహం మాత్రమె వాటిని ఆ బరువుని దూది పింజేలా తీసి వెయ గలదు.. " స్నేహం" అన్న పదం(బంధం ) యొక్క విశిష్టత చాలా గొప్పది అని మన పురాణాల ద్వారా కూడా తెలుసుకున్నాము... ఐతే, స్నేహంలో కూడా రకాలు వుంటాయి అని ఈ మధ్యనే తెలుసుకున్నాను. అవి...
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి