పోస్ట్‌లు

  శర్మ  గారూ,, అయ్యా నమస్కారమ్.. మీ కబుర్లు మా మామయ్య గారిని   గుర్తు తెస్తున్నాయి .. ఆ సామెతలు మన జీవితాలకి , మన చుట్టూ తిరిగే జీవితాలకీ అద్దం   పడతాయి.. ధన్యవాదాలతో  

శివోహం .........

చిత్రం
  శంకరుడు అంటే  సంతోషం  కలిగించువాడు  అని వేదాలలో వివరింపబడినది...   గాలి ఏ విధముగా వ్యాపిస్తున్నదో ఆ విధముగా వ్యాపించే శక్తి "శం"  అక్షరమునకు కలదు. " శం" నామము ఆనందముతో నిండినది.   ఏదైనా శివాలయమునకు మనం వెళ్ళినప్పుడు  శివ నామ ఘోష మన మనసులో ఆనందాన్ని నింపివేస్తుంది .  అదే పెద్ద నిదర్శనం . "శం" అనే పదానికి చిదానందం అని కూడా అర్ధమ్. "కర" అనగా అందించేవాడు లేక చేకూర్చువాడు అని అర్ధమ్. నిత్యానందమును , సచ్చిదానందమును అద్వైతానందమును అందించువాడు శంకరుడు .శంకరుడు  కైలాసవాసి ... అర్ధనారీశ్వరుడు , వినాశాకారుడు, సృష్టికర్త ,శంకరుడు మూర్తి స్వరూపుడు ,  జటాజూటం , ఫాలభాగాన నెలవంక ,నుదుట  అగ్ని నేత్రం ,విభూతిదారణ ,రుద్రాక్షమాల , గజ చర్మదారుడు , త్రిశూలమ్, డమరుకం మొదలైన అలంకారాలతో ,ఆయుధాలతో విరాజిల్లుచున్నట్లు మనకు కనబడతాడు . అధర్వణ వేదంలో శివుని ఇలా స్తుతిస్తారు "ముఖాయతే పశుపతే  యాని చక్శూంచి తే భవత్వచే రూపాయ సంద్రుశే ప్రతీ చీనాయతే నమః అంగభ్యస్త ఉదయరాయ జిహ్వాయ అస్సాయ తే దద్యో గందాయతే నమః" దీని అర్ధం.. " ఓ పశుపతి; దేవా, శివా, మీ ముఖ...
 అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఆనారోగ్య కారణాలు నన్ను ఏమీ వ్రాయనీయలేదు . అందుకే ఇంత గాప్ మరల మీతో మాట్లాడుతున్నందుకు ఆనందిస్తున్నాను  ఈరోజు వుదయం   నాకు ఒక మెసేజ్ వచ్చింది . " నేను గుర్తు  వున్నానా ? " అ ని ...  మిమ్మల్ని నేను గుర్తు పెట్టుకోడానికి  మీరు చేసిన ఒక పది మంచి పనులు చెప్పండి అని అడి గాను.. "నా వల్ల   ముగ్గురి లైఫ్ సెటిల్ ఐంది     ఆ  ముగ్గురికి జీవితాన్నిఇచ్చాను నేను", అని సమాధానం   ఇచ్చారు అవతలి వారు .ముగ్గురు సెటిల్ అయ్యారు బాగుంది ,,,సెటిల్ అవడానికి సహాయం చేసారు . బాగుంది  .    ఈ లైఫ్ ఇవ్వడం ఏమిటి నాకు అర్ధం  కాలెదు.      .        "నేను" అని అంటున్నారు కదా . ఆ "నేను"  ఏమిటో చెప్పగలరా అని అడిగాను . "నేను అంటే మై సెల్ఫ్" అని సమాధానం ఇచ్చారు .. అదీ బాగానే వుంది . కాని నా మనసు  మౌనం వహించింది. తర్వాత మాట్లాడతాను అని చెప్పాను. .. మనసులో ఏదో గందర గోళం . ఎంతమంది రమణ మహర్షులు వుదయించినా , ఎందరు బాబాలు వుపదేశించిన...

భారతీయం: ఇంతకు ఇంతే

భారతీయం: ఇంతకు ఇంతే : మనం వుదయం లేచిన దగ్గర నుండి, "  భగవంతుడా!  ఏమిటి కష్టాలు" అని కనీసం పదిసార్లు అయినా అనుకుంటూ  వుంటాము.. అవి మనం కొని తెచ్చుకునేవి...

ఇంతకు ఇంతే

మనం వుదయం లేచిన దగ్గర నుండి, "  భగవంతుడా!  ఏమిటి కష్టాలు" అని కనీసం పదిసార్లు అయినా అనుకుంటూ  వుంటాము.. అవి మనం కొని తెచ్చుకునేవి అని తెలుసుకోలేక , తెలిసినా కొన్నింటిని తప్పించుకోలేం అని తెలుసు కాబట్టి ... మన కర్మల  ఫలాలే అవి..  కర్మ యోగం గురించి ఇంతకు ముందే వివరించడం జరిగింది కాబట్టి ఆ సబ్జెక్ట్ టచ్ చేయను గాని ,  దానం అనెడి   కర్మయొక్క ఫలం ఎలా వుంటుంది అన్నది ఒక చిన్న కధ ద్వారా  తెలియజేస్తాను        ఒకానొక  రాజ్యాన్ని పరిపాలించే రాజు గారికి పుత్ర  సంతానం కావాలని యజ్ఞ యాగాదులు చేయించగా అదృష్ట వశమున పుత్ర సంతానం కలిగినది.   కాని, దురదృష్ట వశాత్తు రాజుకి  జన్మించిన కుమారుడు మూగవాడయ్యెను. ఐతే,  ఆనాటి నుండి ఆ రాజ్యం లోని బ్రాహ్మణులకి కష్టములు మొదలైనవి. ..బ్రాహ్మణులు లోప భూయిష్టమైన యజ్ఞమును చేయుట వలన తన  కుమారుడు మూగ వాడు  అయినాడని  రాజు అభిప్రాయ పడెను  .. అందుచే ఆ రాజు శైవులైన బ్రాహ్మణులను గుండు గొరిగించి విభూతి  రేఖలు పెట్టించి గాడిద ప...
సర్వేజనా   సుఖినో భవంతు      మనం తెల్లవారి  నిద్ర  లేచిన దగ్గర నుండి  రాత్రి నిద్రకు వుపక్రమించే వరకూ    ఎన్నో చెయ్యాలని అనుకుంటాము .   అనుకున్న   పనులు    అన్నీ పూర్తీ కావచ్చు లేదా కాక పోవచ్చు . పూర్తి  ఐతే సంతోష పడతాము లేదంటే   ఏదో విచారం మనల్ని కమ్ముకుంటుంది . ఇది అందరికీ  కాక పోవచ్చు కాని కొందరికి ఇలా జరుగుతూ వుండవచ్చు. ఐతే ఏ   పనిలో విజయం సాధించాలన్నా అది మన సంకల్ప శక్తి మీద   ఆధార పడి  వుంటుంది. ఆ సంకల్ప శక్తి  ఏమిటి ?  అన్న విషయం మరో సారి వివరిస్తాను. ఈరోజు ఈ మధ్య కాలంలో మా కుటుంబానికి  అత్యంత మధురానుభూతిని కలిగించిన రెండు విషయాలు ప్రస్తావిస్తాను .  నేను సామాన్యంగా రద్దీ ఎక్కువ వున్న  ప్రదేశాలకు అది ఎంతటి   ప్రాముఖ్యత   కలిగినదైనా  లేదా ఎంత  పర్వదినం అయినా   అడుగు పెట్టడానికి సాహసించను..   వూపిరి ఆడనట్లు వుంటుంది.  హాయిగా ఇంటిలో ప్రశాంతంగా  టి . వి లో    చూసుకోవచ్చు కదా...

ఎవరు గొప్ప

 మనలో చాలా మందికి ఒక గొప్ప   సందేహం కలుగుతూ వుంటుంది . దేవుళ్లలో ఎవరు గొప్ప ?.. శివుడే గొప్ప ..కాదు,  విష్ణువే గొప్ప ...అదేమీ  కాదు శక్తి లేనిదే ఈ  ఇరువురూ దేనికీ   పనికి రారు అని ఇలాంటి వాదనలు  చూస్తూనే వుంటాము..   అసలు ఎవరిని పూజించాలి ? మనకెందుకు ఈ గందర గోళం ?  ఇది కేవలం హిందువులలో మాత్రమె కనబడుతుంది .. ఎందువల్ల ? ఆత్మ, పరమాత్మ ల తత్త్వం తెలిసిన మన పెద్దలు మనకు ఏమి తెలియ జెప్పాలనుకున్నారు.. మూలాన్ని వదిలేసి ఈ వాదనలు అవసరమా అని ఒక ప్రశ్న ..కానీ భగవద్ గీత లో నేను ఎవరిని పూజించాలి  అన్న సందేహానికి   ఒక శ్లోకం ద్వారా  ఆ కృష్ణ   పరమాత్మ  వివరించారు  ...........                  యే యదా మాం ప్రవద్యంతే తాంస్తదేవ భజామ్యహమ్ !                  మమ  వర్త్మానువర్తనే మనుష్యః పార్ధ సర్వశః !!         ...
 కొన్ని సమస్యలు వచ్చినా , పరిష్కార మార్గం మన కళ్ళ ముందు కొద్ది దూరంలో  గోచరిస్తుంది.  వెంటనే ధైర్యం  తెచ్చుకుని ముందుకు సాగ గలుగుతాము . అన్నీ మనం అనుకున్నట్లు జరిగినా , భవిష్యత్తులో ఏమి జరగనుందో ముందే పసిగట్టగలిగినా, ఎదుటి వ్యక్తి  మనస్తత్వాన్ని పూర్తిగా గ్రహించగలిగిన  శక్తి కలిగియున్నా,.... మనమే దేవుళ్ళము   అని అనుకోవచ్చు.. ఇక ఆ పరమాత్మ తో మనకు పని ఏముంది  చెప్పండి..   అప్పుడు మనలో అహంకార పూరిత ప్రవర్తన అణువణువునా నిండి వుంటుంది ...జీవిని పుట్టించిన దేవుడు ఆ జీవికి తోడుగా  ఆకలినీ   పుట్టించాడు ..    ఎక్కడ సోమరిగా తయారౌతాడో   అని..కొన్ని కొన్ని స్మృతుల్ని , కొన్ని శక్తులని దూరం చేస్తాడు  అహంకారిగా తయారు కాకూడదు అని.. ఆ విధంగా ఎన్నో విధాల భగవంతుడు మనకు మేలు చేస్తున్నాడు కదా... మరి ఆ మేలుకి ప్రతిఫలం గా మనం ఏమి ఇస్తున్నాము అన్నది ఆలొచించాల్సిన  విషయం... అందుకే మనం  ప్రతి అడుగు ఆలోచించి వెయ్యాలి అని చెప్తారు పెద్దలు ..మనం అది ఆచరించము .. అందుకే మనకి ఇన్ని సమస్యల...
  ఇక్కడ రచయిత ప్రస్తుత సమాజం లో  మన జీవన విధానం ఎలా వుందో చెప్తూ  ఒక విషయం  ప్రస్తావించారు .---------రోగాలన్నింటికీ ఒకటే మందా ? అందరికీ  భగవద్గీతే దిక్కా ?జీవితంలో  దెబ్బ  తిన్నవారికి, నష్టపోయినవారికి, సంసారం నుండి పారి పోదలచిన వారికి   కావాలి గాని కళ్ళు , కాళ్ళు బాగానే   వున్న మాకెందుకు ? అని ఈ రకమైన ప్రశ్నలతో ఆధునికత అలవడిన ఎందఱో బాహాటం గానే విమర్శిస్తున్నారు ... ఇది నిజమేనా .. నిజం కాకపొతే మరేమిటి మన జాతికీ ఖర్మ ? ...........అని .............! భగవద్గీత  అందరి కోసం... చూపు వున్న ప్రతివాడికి వెలుగు ఎలా అవసరమో,  శక్తి వున్న ప్రతి జీవికి భగవద్గీత శ్రవణం అవసరం అని కూడా చెప్పారు ...సూర్యుడి అవసరం లేని వాడిని బుద్దిహీనుడు అని, ప్రాణవాయువును తిరస్కరించే వాడిని మూర్ఖుడు అని అంటారని కూడా చెప్పారు .........మనం ఏ పని అయినా  ప్రయోజనం వుంటేనే  అన్నది జగమెరిగిన  సత్యం .. కనీసం ప్రయోజనం  కోసం అయినా ఆ భగవన్నామ స్మరణ చేయడానికి అవకాశం దొరికినట్లే కదా.............    ఇక ప...

కృష్ణం వందే జగద్గురుం

చిత్రం
   ఈ రోజు  వుదయం భక్తి  ఛానల్ లో   మల్లాది వారి శ్రీ మద్భాగవతం ప్రవచనం లో ఒక జీవి అంటే (ప్రత్యేకంగా మానవ జన్మ)  ఏ విధంగా తల్లి గర్భం లో  పడిన నాటి నుండి ఏ ఏ రకాల అనుభవాలను గూడి వుంటుందో అత్యద్భుతంగా వివరించారు ... నిజంగా  విని  అందరూ తెలుసుకోవలసిన విషయం. తల్లి గర్భం లో పడిన నాటి నుండి  బయట పడే వరకూ మల మూత్రాదులు ,కఫ శ్లేష్మాలలో ఏ విధంగా తిరుగుతూ   ఎందుకురా ఈ జన్మ అని జీవి ఎలా విలపిస్తాడో కళ్ళకు కట్టినట్లు వివరించారు మల్లాది వారు.. గర్భం నుండి బయట పడేప్పుడు ఆ జీవి  మీద నీళ్ళు  కొట్టినప్పుడు ఏడిస్తే బ్రతికి వున్నట్లు మనం గుర్తిస్తాము. ఆ క్షణం లో ఆతని పూర్వ జన్మ స్మృతి పోయి ఏడుస్తాడు కాబోలు జీవుడు.... సరే , గర్భం లో మల మూత్రాదులలో తిరుగుతాడు అది తప్పని స్థితి..  బయటకు వచ్చిన   కూడా ఈ మాయా ప్రపంచం లో అలమటిస్తూ తిరుగుతుంటాడు అజ్ఞానం తో..ఏ మనుష్యుడు అయినా  ఏ    అయినా క్షణ మాత్రము కూడా కర్మను ఆచరింప కుండా వుండలేడు  .. కర్మలను ఆచరింప కుండా వుంటే  శరీర నిర్వ...