అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఆనారోగ్య కారణాలు నన్ను ఏమీ వ్రాయనీయలేదు . అందుకే ఇంత గాప్

మరల మీతో మాట్లాడుతున్నందుకు ఆనందిస్తున్నాను 

ఈరోజు వుదయం   నాకు ఒక మెసేజ్ వచ్చింది . " నేను గుర్తు వున్నానా ? " అని ...  మిమ్మల్ని నేను గుర్తు పెట్టుకోడానికి మీరు చేసిన ఒక పది మంచి పనులు చెప్పండి అని అడిగాను.. "నా వల్ల  ముగ్గురి లైఫ్ సెటిల్ ఐంది   ఆ ముగ్గురికి జీవితాన్నిఇచ్చాను నేను", అని సమాధానం  ఇచ్చారు అవతలి వారు .ముగ్గురు సెటిల్ అయ్యారు బాగుంది ,,,సెటిల్ అవడానికి సహాయం చేసారు . బాగుంది  ఈ లైఫ్ ఇవ్వడం ఏమిటి నాకు అర్ధం కాలెదు.      
 "నేను" అని అంటున్నారు కదా . ఆ "నేను"  ఏమిటో చెప్పగలరా అని అడిగాను . "నేను అంటే మై సెల్ఫ్" అని సమాధానం ఇచ్చారు .. అదీ బాగానే వుంది . కాని నా మనసు  మౌనం వహించింది. తర్వాత మాట్లాడతాను అని చెప్పాను. .. మనసులో ఏదో గందర గోళం . ఎంతమంది రమణ మహర్షులు వుదయించినా , ఎందరు బాబాలు వుపదేశించినా మనం మనమే . మారము . మారడానికి ఇష్టపడం. 
ఎందుకు మారాలి ? మనమేమి దేవతలం  కాదు . మామూలు మనుషులం. మనకీ కోరికలు వుంటాయి. మనం పుట్టింది ఎందుకు ? అనుభవించాలి గాని వేదాంతం అవసరమా ? ఇవండి ప్రశ్నలు . సమాధానమూ వారి దగ్గరే.  తప్పొప్పులు  ఎంచ  నేనెంత  ఈశ్వరా ? 
     ఇది  ఒక  ఆధ్యాత్మిక చర్చగా  కొనసాగాలని నా  అభిలాష        
 

కామెంట్‌లు

  1. ఇది ఒక ఆధ్యాత్మిక చర్చగా కొనసాగాలని నా అభిలాష ....ఈ చర్చలో భాగంగానే ఈ క్రింది link ఇస్తున్నాను .వీలైతే చూడండి .
    https://docs.google.com/document/d/1q77UVYOMWSC9Ituh9qaXBNa8gb42tsEuugvueKna81s/edit?pli=1

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

స్నేహంలో రకాలు

నాన్న మాట అమ్మకి వేదం