పోస్ట్‌లు

ఎవరు గొప్ప

 మనలో చాలా మందికి ఒక గొప్ప   సందేహం కలుగుతూ వుంటుంది . దేవుళ్లలో ఎవరు గొప్ప ?.. శివుడే గొప్ప ..కాదు,  విష్ణువే గొప్ప ...అదేమీ  కాదు శక్తి లేనిదే ఈ  ఇరువురూ దేనికీ   పనికి రారు అని ఇలాంటి వాదనలు  చూస్తూనే వుంటాము..   అసలు ఎవరిని పూజించాలి ? మనకెందుకు ఈ గందర గోళం ?  ఇది కేవలం హిందువులలో మాత్రమె కనబడుతుంది .. ఎందువల్ల ? ఆత్మ, పరమాత్మ ల తత్త్వం తెలిసిన మన పెద్దలు మనకు ఏమి తెలియ జెప్పాలనుకున్నారు.. మూలాన్ని వదిలేసి ఈ వాదనలు అవసరమా అని ఒక ప్రశ్న ..కానీ భగవద్ గీత లో నేను ఎవరిని పూజించాలి  అన్న సందేహానికి   ఒక శ్లోకం ద్వారా  ఆ కృష్ణ   పరమాత్మ  వివరించారు  ...........                  యే యదా మాం ప్రవద్యంతే తాంస్తదేవ భజామ్యహమ్ !                  మమ  వర్త్మానువర్తనే మనుష్యః పార్ధ సర్వశః !!         ...
 కొన్ని సమస్యలు వచ్చినా , పరిష్కార మార్గం మన కళ్ళ ముందు కొద్ది దూరంలో  గోచరిస్తుంది.  వెంటనే ధైర్యం  తెచ్చుకుని ముందుకు సాగ గలుగుతాము . అన్నీ మనం అనుకున్నట్లు జరిగినా , భవిష్యత్తులో ఏమి జరగనుందో ముందే పసిగట్టగలిగినా, ఎదుటి వ్యక్తి  మనస్తత్వాన్ని పూర్తిగా గ్రహించగలిగిన  శక్తి కలిగియున్నా,.... మనమే దేవుళ్ళము   అని అనుకోవచ్చు.. ఇక ఆ పరమాత్మ తో మనకు పని ఏముంది  చెప్పండి..   అప్పుడు మనలో అహంకార పూరిత ప్రవర్తన అణువణువునా నిండి వుంటుంది ...జీవిని పుట్టించిన దేవుడు ఆ జీవికి తోడుగా  ఆకలినీ   పుట్టించాడు ..    ఎక్కడ సోమరిగా తయారౌతాడో   అని..కొన్ని కొన్ని స్మృతుల్ని , కొన్ని శక్తులని దూరం చేస్తాడు  అహంకారిగా తయారు కాకూడదు అని.. ఆ విధంగా ఎన్నో విధాల భగవంతుడు మనకు మేలు చేస్తున్నాడు కదా... మరి ఆ మేలుకి ప్రతిఫలం గా మనం ఏమి ఇస్తున్నాము అన్నది ఆలొచించాల్సిన  విషయం... అందుకే మనం  ప్రతి అడుగు ఆలోచించి వెయ్యాలి అని చెప్తారు పెద్దలు ..మనం అది ఆచరించము .. అందుకే మనకి ఇన్ని సమస్యల...
  ఇక్కడ రచయిత ప్రస్తుత సమాజం లో  మన జీవన విధానం ఎలా వుందో చెప్తూ  ఒక విషయం  ప్రస్తావించారు .---------రోగాలన్నింటికీ ఒకటే మందా ? అందరికీ  భగవద్గీతే దిక్కా ?జీవితంలో  దెబ్బ  తిన్నవారికి, నష్టపోయినవారికి, సంసారం నుండి పారి పోదలచిన వారికి   కావాలి గాని కళ్ళు , కాళ్ళు బాగానే   వున్న మాకెందుకు ? అని ఈ రకమైన ప్రశ్నలతో ఆధునికత అలవడిన ఎందఱో బాహాటం గానే విమర్శిస్తున్నారు ... ఇది నిజమేనా .. నిజం కాకపొతే మరేమిటి మన జాతికీ ఖర్మ ? ...........అని .............! భగవద్గీత  అందరి కోసం... చూపు వున్న ప్రతివాడికి వెలుగు ఎలా అవసరమో,  శక్తి వున్న ప్రతి జీవికి భగవద్గీత శ్రవణం అవసరం అని కూడా చెప్పారు ...సూర్యుడి అవసరం లేని వాడిని బుద్దిహీనుడు అని, ప్రాణవాయువును తిరస్కరించే వాడిని మూర్ఖుడు అని అంటారని కూడా చెప్పారు .........మనం ఏ పని అయినా  ప్రయోజనం వుంటేనే  అన్నది జగమెరిగిన  సత్యం .. కనీసం ప్రయోజనం  కోసం అయినా ఆ భగవన్నామ స్మరణ చేయడానికి అవకాశం దొరికినట్లే కదా.............    ఇక ప...

కృష్ణం వందే జగద్గురుం

చిత్రం
   ఈ రోజు  వుదయం భక్తి  ఛానల్ లో   మల్లాది వారి శ్రీ మద్భాగవతం ప్రవచనం లో ఒక జీవి అంటే (ప్రత్యేకంగా మానవ జన్మ)  ఏ విధంగా తల్లి గర్భం లో  పడిన నాటి నుండి ఏ ఏ రకాల అనుభవాలను గూడి వుంటుందో అత్యద్భుతంగా వివరించారు ... నిజంగా  విని  అందరూ తెలుసుకోవలసిన విషయం. తల్లి గర్భం లో పడిన నాటి నుండి  బయట పడే వరకూ మల మూత్రాదులు ,కఫ శ్లేష్మాలలో ఏ విధంగా తిరుగుతూ   ఎందుకురా ఈ జన్మ అని జీవి ఎలా విలపిస్తాడో కళ్ళకు కట్టినట్లు వివరించారు మల్లాది వారు.. గర్భం నుండి బయట పడేప్పుడు ఆ జీవి  మీద నీళ్ళు  కొట్టినప్పుడు ఏడిస్తే బ్రతికి వున్నట్లు మనం గుర్తిస్తాము. ఆ క్షణం లో ఆతని పూర్వ జన్మ స్మృతి పోయి ఏడుస్తాడు కాబోలు జీవుడు.... సరే , గర్భం లో మల మూత్రాదులలో తిరుగుతాడు అది తప్పని స్థితి..  బయటకు వచ్చిన   కూడా ఈ మాయా ప్రపంచం లో అలమటిస్తూ తిరుగుతుంటాడు అజ్ఞానం తో..ఏ మనుష్యుడు అయినా  ఏ    అయినా క్షణ మాత్రము కూడా కర్మను ఆచరింప కుండా వుండలేడు  .. కర్మలను ఆచరింప కుండా వుంటే  శరీర నిర్వ...

మనం ప్రశాంతంగా వున్నామా ?

ఆకాశం , భూమి , ,సూర్యుడు,  చంద్రుడు, మనం అంటే ...మానవులం.   సృష్టిలో ఎన్నో రకాల  జీవులు వున్నాయి . అందరికీ తెలిసిన విషయమే.. అన్ని జీవుల లోనికి మానవ జన్మ ఉత్కృష్టమైనది అన్న విషయం కూడా తెలిసినదే.. మిగిలిన జీవజాతులలో   లేని కొన్ని ప్రత్యెక లక్షణాలు వుండడమే ఆ వుత్క్రుష్టత కు కారణం.., వినడం ,చూడడం ,తినడం , నడవడం , పరుగులు పెట్టడం , పడుకోవడం ఇవన్నీ అన్ని  జీవ జాతుల లో సర్వ  సామాన్య మైన లక్షణం.. కానీ మానవుని ప్రత్యెక లక్షణం కర్మాచరణం, ఆలోచనా శక్తి కలిగి వుండడం.  ఆలోచనా శక్తి  ఎక్కడ నుండి వచ్చింది   అంటే మనసు నుండి అంటారు. మనసే  ఆలోచనల సమాహారం ఐనప్పుడు    ప్రత్యేకంగా ఆ శక్తి ఎక్కడ నుండి వచ్చింది  అని ప్రశ్న అవసరం లేదు కదా ... మానవులలో ఈ మనసు చేసే గారడీ అంతా,ఇంతా కాదు . ఆ మనసుని ఆధారం గా చేసుకునే  అల్లినా , కధలు వ్రాసినా ...నీకు మనసు లేదా అని చాలా ఈజీ గా అనేస్తాము .. కాని తలచుకుంటే  "అమ్మో, మనసు"  అనిపిస్తుంది...ఆలోచనలు ఒక్కటే కాదు , దయ ,జాలి ,ప్రేమించే హృదయం, కారుణ్యత ను కలిగి వున్న వాడు ని...
చిత్రం
ఇక సుఫల స్నేహం గురించి .........శ్రీ కృష్ణుడు మరియు కుచేలుడు మధ్య గల స్నేహ  సంబంధం అందరికీ తెలిసినదే... అతి బీద బ్రాహ్మణుడు  కుచేలుడు తప్పని సరియై మిత్రుని వద్దకు వెళ్ళ  వలసి వచ్చినప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళలేక   అటుకులను  తీసుకుని  బయలు దేరాడు.. తన చిన్ననాటి స్నేహితుని  తన దగ్గరకు తీసుకుని ఎంతో   ప్రేమతో   ఆదరించి కుచేలుడు సమర్పించిన అటుకులను ప్రీతిగా ఆరగిస్తూ , నోరు తెరచి సహాయం అడగ కుండానే విషయాన్ని  గ్రహించిన   ఆ పరంధాముడు    కుచేలుని ఇంటిని సర్వైశ్వర్యాలతో నింపిన విషయం  మనకు తెలిసినదే.. అడగనిదే అమ్మైనా పెట్టదు  అన్న సామెతకు  ఇక్కడ చోటు లేదు. అడగకుండానే తన మిత్రుని పరిస్థితి గ్రహించి అన్ని వరాలను ఇచ్చిన ఆ పరమాత్మది సఫల స్నేహమే కదా . ఇక నర నారాయణు లైన   కృష్ణార్జునుల స్నేహం సుఫలమా  అన్నది పరిశీలిస్తే , అర్జునునికి ద్రౌపది , వులూచి ,చిత్రాంగద అన్న భార్యలు వున్నప్పటికీ ఆతని మీద నమ్మకంతో తన చెల్లెలు సుభద్ర ను ఇచ్చి  పెళ్లి చేసాడు .. యుద్ద భూమిలో రక్త సంబంధ...

స్నేహంలో రకాలు

మనకు తెలిసిన  స్నేహాలు   కొన్ని మాత్రమె..... చదువుకునేప్పుడు క్లాస్మేట్స్ , బెంచి మేట్స్ , రూం మేట్స్ , వుద్యోగం చేస్తుండగా కొలీగ్స్, మనం నివసించే ఇంటి  ప్రక్కల వారు , ఇతరత్రా పరిచయస్తులు ఇలా ఎందఱో స్నేహితులు వుంటారు. మన నిత్య జీవితంలో  ఈ స్నేహాల  వల్ల సుఖ దుఖ్ఖాలు రెండింటినీ చూస్తాము అంటే అనుభవిస్తాము ఇది సహజం . కానీ   నాకో సందేహం .......... దు:ఖ్ఖం కలిగించేది నిజమైన స్నేహం ఎలా అవుతుంది?  స్నేహం ...  వ్యక్తికి బలం కావాలి గాని, బలహీనత కాకూడదు. స్నేహం.... ఎటువంటి పరిస్థితులు అయినా ఎదుర్కునే శక్తి గలది కావాలి గాని , పరిస్థితులకు  లొంగనిది గా వుండాలి.  కొన్ని పరిస్థితులు మన   కర్మ ల ఫలితాలే, మనం కోరి తెచ్చుకునేవే కాబట్టి అవి మనకి బరువుగా మారతాయి.   స్నేహం మాత్రమె  వాటిని ఆ బరువుని దూది పింజేలా తీసి వెయ గలదు.. " స్నేహం"   అన్న  పదం(బంధం ) యొక్క  విశిష్టత చాలా గొప్పది అని మన పురాణాల   ద్వారా కూడా తెలుసుకున్నాము... ఐతే, స్నేహంలో కూడా రకాలు వుంటాయి అని ఈ మధ్యనే తెలుసుకున్నాను. అవి...
చిత్రం
 మనిషి సాంఘిక జీవి .  ఒంటరిగా .బ్రతకలేడు... వుదయం నిద్ర లేచినప్పటినుండి రాత్రి నిద్రకు వుపక్రమించే వరకూ ఏదో ఒక పనిలో నిమగ్నుడై వుంటాడు. అన్ని పనులూ ఒంటరిగా చేయ సాధ్యం కాదు. ఎవరో ఒకరి సాయం వుండాల్సిందే.. వుదాహరణకు న్యూస్పేపర్ కావాలి అంటే తెచ్చుకోగలము   కాని సమయం అనుకూలించనప్పుడు పేపర్ బాయ్ సహాయం తీసుకుంటాము . ఇలా మనకు వచ్చే ఉత్తరాలు, పాలు  ఇత్యాది   విషయాల్లో మనం అవతలి వారి మీద ఆధార పడాల్సిందే .. అవి  భౌతికానికి  సంబంధించిన పనులు .. మనసంటూ ఒకటి  వుందిగా... ఆలోచనల పుట్ట .. మరి ఆ పుట్ట ఒంటరిగా ఎలా వుండగలదు ?    చీమలో పాములో వుండాలి కదా ..     తోడు  లేకుండా వుండలేదు.... అందుకే ఏదో ఒక విషయమై నిత్యమూ మర్దన చేసుకుంటుంది..తనని తాను .. విషయం లేకుండా అది  వుండలేదు.  ఆ విషయం ఏదైనా కావచ్చు వ్యక్తి  కావచ్చు భగవంతుడి ధ్యాస  కావచ్చు.. ఏదైనా కావచ్చు ...ఒంటరిగా  మాత్రం వుండలేదు.. "స్నేహం" ..... ఈ పదం అతి మధురం . భగవంతునిలా  కంటికి కనబడదు కాని ఎన్నో మాయలు చేస్తుంది గారడీలు చేస్...

మధురం, మధురం

స్నేహం అంటే ఏమిటి ?  ఏమిటి ఈ పిచ్చి ప్రశ్న అంటారా ..... ఎన్నో సంవత్సరాల నుండి ప్రయత్నిస్తూ వున్నాను సరి ఐన   నిర్వచనం తెలుసుకోవడం కోసం ...... ఒకరి కొకరు చేతిలో  చేయి వేసుకుని సినిమాలు షికార్లు తిరగడం , బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం , గంటల తరబడి మాట్లాడుకోవడం . ఎక్కడికైనా దూరం   వెళ్ళాల్సి వస్తే  మిస్ అవుతామని  ఏడవడం .........  ఏదైనా మాట పట్టింపు వస్తే విడి పోవడం .......... ఒకరి మీద మరొకరు  ద్వేషం పెంచుకోవడం ........ ఇదే స్నేహం అంటే మాత్రం ఒప్పుకోవడం  లేదు  మనసు.... . చదువుకునే పిల్లలు ఐతే స్నేహం పేరున పెడదారులు  పడుతున్నారు ..అదా స్నేహమంటే ... వుహూ, మనసు అందుకూ అంగీకరించడం లేదు.... ఈ  విషయం మీదే మనసు కేంద్రీకరించాను ..సమాధానం దొరికింది . ఆ విషయాలు నెమ్మదిగా ప్రస్తావిస్తాను ... అందాకా ఈ విషయం పై ఎవరైనా స్పందించాలని అనుకుంటే వారికిదే నా ఆహ్వానం ......... మరచిపోయాను .. నా ఈ బ్లాగుకి పెట్టిన పేరు స్నేహానికి ఒక చిన్న జ్ఞాపిక.     
  నీ నవ్వే చాలు .............