నీ నవ్వే చాలు .............
పోస్ట్‌లు
డిసెంబర్, 2012లోని పోస్ట్‌లను చూపుతోంది
ఇంద్రియ విషయాలు, పితృ శూశ్రూషా
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వ్రాసినవారు
రుక్మిణిదేవి
-
"చాలా మంచి విషయం అడిగావు . ఆకాశము,గాలి, అగ్ని, నీళ్ళు, భూమి -- ఇవి పంచ మహా భూతాలు. శబ్దము, స్పర్శము,రూపము,రసము,గంధము---- ఇవి మహా భూతాల గుణాలు . భూమికి పైన చెప్పిన అన్ని గుణాలు వుంటాయి . నీళ్ళకి గంధం తప్ప మిగిలిన నాలుగు గుణాలు వుంటాయి. అగ్నికి శబ్దము, స్పర్శము, రూపము వుంటాయి. గాలికి శబ్దము, స్పర్శము వుంటాయి. ఆకాశానికి ఒక్క శబ్దము మాత్రమె వుంటుంది. ఐదు మహా భూతాలూ ఒకదాన్ని విడిచి మరొకటి వుండలేవు . ఒకటి గానే వుంటూ, స్థూలంగా మాత్రం ఐదు విధాలుగా వ్యక్తం అవుతూ వుంటాయి. ఇంద్రియాలు ఐదు- చెవి, చర్మము, కన్ను, నాలిక, ముక్కు--- . శబ్దము, స్పర్శము,రూపము,రసము,గంధము - ఈ ఐదు ఇంద్రియ విషయాలు. ఈ ఐదు కాక ఆరోది మనస్సు, ఏడవది బుద్ధి , ఎనిమిదవది అహంకారం. సత్యము, రజస్సు , తమస్సు, ఈ మూడూ గుణాలు. పైన చెప్పిన ఈ పంచ మహా భూత ప్రపంచం అవ్యక్తం అనే తత్వంలో ఆవిర్భావం (పుట్టడం ) తిరోభావము (నశించడం ) పొందుతూ వుంటుంది. ' ఇంద్రియాలను నిగ్రహిస్తే ఎలాంటి ఫలం కలుగుతుంది' అన్న విషయం చెప్పడం అంటే బ్రహ్మ విద్య చెప్పడం అన్నమాట . నువ్వు ఉత్తమ బ్రాహ్మణుడివి...
కుల ధర్మం
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వ్రాసినవారు
రుక్మిణిదేవి
-
" నువ్వు పొరబడుతున్నావు. బ్రాహ్మలకి తపస్సూ అధ్యయనమూ బ్రహ్మచర్యము పరమ ధర్మం రాజులకు దండ నీతీ , వైశ్యులకు కృషి, పశువులు పాలించడమూ, వర్తకమూ , శూద్రులకి బ్రాహ్మణ శూశ్రూషా ఎలాగో అదే విధంగా మాకూ మాంసం అమ్ముకు బ్రతకడం పరమ ధర్మం. వంశాను క్రమంగా వస్తున్న కుల వృత్తిని విడిచి పెట్టకూడదని నీకు తెలియనిదా ? ఈ దేశం రాజు .జనకుడు ధర్మం తప్పని వాడు . సకల వర్ణాల వారిని రక్షిస్తూ ఉంటాడు. తమ వర్ణాచారం విడిచిన వాళ్ళని తన వాళ్ళు అని కూడా చూడడు. కఠినం గా దండిస్తాడు. మాంసాన్ని అమ్ముకుని బ్రతుకుతున్నా నేను జీవ చేయను. పై వాళ్ళు చంపి తెస్తారు. నేను తగిన వెలకే అమ్ముతాను. అయినా ఆ ధనం తో నాకు పని లేదు. మనశ్శాంతే నాకు ధనం. గురు జనుల సేవ చేస్తాను. వృద్ధులూ, అతిధులు , బ్రాహ్మలూ, దేవతలు-- వీరందరినీ పూజిస్తాను సత్యమూ, శౌచము ,దానము మరచిపోను. సేవకుల పట్ల, బంధువుల పట్ల ఓర్పు చూపిస్తాను. అసూయ ,దురాశ లను , మనసుకి అంటనీయను. పర...
భారతీయం: నీ నవ్వే చాలు అమ్మ నవ్వింది ... ప్రతి క్షణం ఆ న...
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వ్రాసినవారు
రుక్మిణిదేవి
-
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వ్రాసినవారు
రుక్మిణిదేవి
-
నీ నవ్వే చాలు అమ్మ నవ్వింది ... ప్రతి క్షణం ఆ నవ్వు గుర్తు వస్తుంది.. అది అలౌకిక మైన నవ్వు. ఎలా సాధ్యమైనది అని ఇప్పటికీ సందేహమే.. .టివి చూస్తూనో లేక ఎవరైనా జోక్ చెప్తే నే గాని నవ్వలేని స్థితిలో వున్నాము మనము.. కాని, అమ్మ నవ్వు ఇప్పటికీ ఆశ్చర్యమే... నువ్వు ఏమి కోరుకుంటున్నావు అంటే అదే కోరుకుంటున్నాను అని చెప్తాను.. ఎందుకీ ఉపోద్ఘాతం అంటారా ? అసలు విషయం లోకి వస్తాను.. .మొన్నీ మధ్య ఒకసారి మా మామ గారు ఏ విషయం లోనో భయపడుతున్నారు అనిపించింది నాకూ, మా బాబుకి. నేను మేడ పైన వుండగా మెల్లగా నా దగ్గరకి వచ్చి ఏదో మాట్లాడుతూ " అమ్మా, తాతయ్యని గమనించావా ఈ మధ్య ".... అని అడిగాడు. "నిజమే నాన్నా, ఏదో భయం కనబడింది నాకు. నా సందేహమే గనక నిజమైతే ఆ విషయంలో నేను కౌన్సిల్ చేస్తాను. అసలు విషయం కనుక్కోనీ .. డోంట్ వర్రీ ".. అని చెప్పాను. .ఒక కారణం నాకు తెలిసినదే ...ఈ మధ్య మా అత్తగారు, ' ఆయనకి వయసై పోయింది' ...
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వ్రాసినవారు
రుక్మిణిదేవి
-
షిర్డీ సాయి నాధుని లీలలు తెలియనిది ఎవరికీ ? సమాధిలో నుండి కూడా తనని నమ్మిన వారిని రక్షిస్తానని చెప్పడమే గాక అనుభవం లోనికి తెచ్చిన లీలలు ఎన్నో. ఒక్కో కధ ఒకో సత్యం తెలుపుతుంది. సాయినాధుడు ఏనాడూ తనని దైవం గా చెప్పుకోలేదు అని చెప్తారు కాని తనలో అందరి దేవుళ్ళనీ చూపిన సంఘటనలు వున్నాయి.. దానిని బట్టి చూస్తె "అహం బ్రహ్మస్మి " అన్న వాక్యానికి అద్దం పడుతుంది. ఎక్కిరాల భరద్వాజ గారు వ్రాసిన సాయి లీలామృతం అన్న పుస్తకం చదువుతుంటే కొన్ని కొన్ని ఘటనలలో మనల్ని మనం విశ్లేషించు కోగల స్థితి కలుగుతుంది. యుగాన్ని బట్టి ధర్మం మారుతుంది అన్న విషయం అందరికీ తెలిసినదే .. ఇహ పర శ్రేయస్సు చేకూర్చే జీవిత విధానమే ధర్మం అని చెప్పబడింది. మానవుల తత్వం ఎరిగిన మహనీయులు అన్ని దేశాలకు తగిన ధర్మం బోధించారు. ప్రకృతిలో ప్రతిదానికీ వృద్ది, క్షయము, పునరుద్ధరణ సహజమని తెలిపారు. అంటే, పుట్టుక, వృద్ది చెందుట, మరణించుట , మరల జన్మలను తీసుకొనుట...ఇది ఆత్మ స్వభావము.. ఈ జన్మలో మానవ జన...
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వ్రాసినవారు
రుక్మిణిదేవి
-
ఖాళీగా వున్న మైండ్ దెయ్యాలకు నిలయం అన్నారు ఎవరో .. అంటే విపరీతమైన ఆలోచనలు వస్తుంటాయి అన్నమాట కొన్ని మంచివి కావచ్చు, మరికొన్ని పిచ్చివి కావచ్చు. ఒకరోజు T.V లో ఎదో ప్రోగ్రాం చూస్తున్నాను. అంతలోనే మైండ్ లో కొన్ని ఆలోచనలు.. 1. వాల్మికి మహర్షి కృష్ణ చైతన్యామృ తాన్నితన శిష్య బృందానికి వివరిస్తూ వుండగా అక్కడికి నారద మహర్షి వచ్చాడు... నారదుణ్ణి " ప్రస్తుతం ఈ భూలోకంలో సద్గుణాలతో సంపూర్ణంగా శోభిల్లుతున్న వాడేవాడు " అని అడిగితె నారదుడు శ్రీరామచంద్రమూర్తిని గురించి వివరిస్తాడు. 24,000 శ్లోకాలతో రామాయణాన్ని
విలువైన కధ
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వ్రాసినవారు
రుక్మిణిదేవి
-
ఇదో చిన్న, అతి చిన్న కధ . కాని అత్యంత విలువైన కధ. ప్రతి ఒక్కరికి తెలియాల్సిన కధ . కధలు చిన్న వాళ్ళకే కాదు, పెద్దలకు కూడా ఇష్టమే మరి. అందుకే ఈ కధ ........... మహా భారతం అంటే ప్రీతి లేనిది ఎవరికీ ? మహాభారతం అంటే కేవలం పాండవులకు ,కౌరవులకు మధ్య యుద్దమే గుర్తు వస్తుంది. ద్రౌపది వస్త్రాపహరణమే గుర్తు వస్తుంది. అందులోని చిన్న చిన్న కధలు మనకు గుర్తు రావు.. అవి నేర్పించే నీతి మనకు కనబడదు.. ఒకసారి ద్రోణాచార్యుల వారు తమ శిష్యులైన ధర్మరాజు మరియు దుర్యోధనులను........... దేశ సంచారం చేసి ఎంతమంది మంచివాళ్ళు వున్నారో, ఎంతమంది చెడ్డవాళ్ళు వున్నారో లెక్క చెప్పమన్నారట .సరే అని ఇద్దరూ దేశ సంచారానికి బయలుదేరి వెళ్ళారు.. కొన్ని రోజుల అనంతరం ముందుగా దుర్యోధనుడు వచ్చి, "ఆర్యా, ఈ రాజ్యంలో అందరూ చెడ్డ వాళ్ళే . మంచివాళ్ళు మచ్చుకైనా కనబడ లేదు" అని సగర్వంగా విన్నవించుకున్నాడట. ఆ తర్వాత...
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
వ్రాసినవారు
రుక్మిణిదేవి
-
మంచి నీటి కుండలో చారెడు వుప్పు కలిపితే ఆ నీటి రుచి వుప్పగా మారిపోయి త్రాగడానికి పనికి రాకుండా పోతుంది. సముద్రపు నీటిలో ఎన్ని నదులు కలిసినా ఆ నీరు ఉప్పగానే వుంటుంది గాని త్రాగడానికి పనికి వచ్చే నది నీరు కూడా వృధా అవుతుంది. మనిషి మనసులో ఒక చెడు ఆలోచన చేరితే ఆ మనసు తాను అల్లకల్లోలమై శరీరం మీద అ ప్రభావాన్ని పడవేస్తుంది.. దుఖ్ఖానికి చేరువ చేస్తుంది.